ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 15 FEB 2026 11:02AM by PIB Hyderabad

ఈ రోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. “ఆదిదేవుడైన మహాదేవుడు తన కృపను అందరిపై ఎల్లప్పుడూ నిలుపుగాక! అందరికీ శ్రేయస్సు కలుగుగాక. మన భరతవర్ష శ్రేయస్సు సమున్నత శిఖరాలకు చేరుగాక” అని శ్రీ మోదీ ఆకాంక్షించారు.

 

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

 

"దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆదిదేవుడైన మహాదేవుడు ఎల్లప్పుడూ అందరిపై తన ఆశీస్సులను కురిపించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆయన ఆశీస్సులు అందరికీ శ్రేయస్సును తీసుకురావాలి. మన దేశ శ్రేయస్సు మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవాలి.

 

హర హర మహాదేవ!"

 

***


(రిలీజ్ ఐడి: 2228341) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam