సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

15,000 పాఠశాలలు, 500 కళాశాలల్లో కంటెంట్ క్రియేషన్ ప్రయోగశాలల ద్వారా ఏవీజీసీలో నైపుణ్యాభివృద్ధిపై సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వర్క్‌షాపు


సృజనాధారిత ఆర్థికవ్యవస్థ దార్శనికతకు తగినట్టుగా భారత ఏవీజీసీ వ్యవస్థను బలోపేతం చేయడమే వర్కుషాపు లక్ష్యం

నాడు పోస్టు చేయడమైనది: 12 FEB 2026 10:30PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని జాతీయ మీడియా సెంటర్లో అత్యున్నత స్థాయి కన్సల్టేషన్ వర్క్‌షాపును సమాచారప్రసార (ఐ అండ్ బీమంత్రిత్వ శాఖ ఈ రోజు నిర్వహించిందిదేశ వ్యాప్తంగా 15,000 పాఠశాలలు, 500 కళాశాలల్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీద్వారా కంటెంట్ క్రియేషన్ ప్రయోగశాలల్ని ఏర్పాటు చేయడానికి దీనిని నిర్వహించిందిభారతదేశాన్ని యానిమేషన్విజువల్ ఎఫెక్ట్స్గేమింగ్కామిక్స్ (ఏవీజీసీరంగానికి అంతర్జాతీయ కేంద్రంగా ఉంచడమే సృజనాధారిత దార్శనికతకు ప్రధానాధారమైన ఈ కార్యక్రమ లక్ష్యం.

 

ఈ కార్యక్రమంలో సమాచారప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు మాట్లాడుతూగతేడాది కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ (ఐఐసీటీకార్యకలాపాలు ఇప్పుడు ఎన్ఎఫ్‌డీసీ క్యాంపస్‌లో కొనసాగుతున్నాయని తెలియజేశారుఈ కార్యక్రమానికి సమన్వయ సంస్థగా పనిచేస్తుందని అన్నారుఐఐసీటీకి అవసరమైన ప్రతిభావంతులను అందించే వ్యవస్థలుగా ఈ ప్రతిపాదిత ప్రయోగశాలలు పనిచేస్తాయన్నారుఈ ప్రయోగశాలల నమూనాఅవసరమైన హార్డ్‌వేర్సాఫ్ట్‌వేర్ మౌలిక సదుపాయాలువైవిధ్య విధానాలను అనుమతించే ఉమ్మడి వ్యవస్థ నిర్వహణకున్న అవకాశంపై కూడా సంప్రదింపులు నిర్వహించే అవకాశంపై ఇప్పటికే వివరణాత్మక సంప్రదింపులు పూర్తయ్యాయని ఆయన చెప్పారు.

నీతి ఆయోగ్విద్యా మంత్రిత్వ శాఖనైపుణ్యాభివృద్ధిఔత్సాహిక పారిశ్రామిక మంత్రిత్వ శాఖ అధికారులుబోర్డు/గవర్నింగ్ కౌన్సిల్స్/అకడమిక్ కౌన్సిల్/ఆర్ అండ్ డీ కౌన్సిల్/స్కిల్ కౌన్సిల్ఐఐసీటీ పారిశ్రామిక అభివృద్ధి కౌన్సిల్ సభ్యులురాష్ట్రాలుపారిశ్రామిక సంఘాలువిద్యాసంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

వర్కుషాపులో ప్రధానాంశాలు:

  1. అధునాతన క్రియేటివ్ స్టూడియోలుగా ప్రతిపాదిత ప్రయోగశాలలు పనిచేస్తాయిపరిశ్రమ-ప్రామాణికమైన సాఫ్ట్‌వేర్హార్డ్‌వేర్‌లను ఉపయోగించి వృత్తిపరమైన నిర్మాణ ప్రక్రియలకు సంబంధించిన ప్రత్యక్ష అనుభవాన్ని విద్యార్థులకు అందిస్తుంది.

  2. సృజనాత్మక రంగాల్లో విద్యార్థులకు ప్రాథమిక అవగాహన కల్పించడంప్రత్యేక శిక్షణ అందించేలా ల్యాబ్ కార్యకలాపాలను జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)తో అనుసంధానించడం గురించి చర్చల్లో దృష్టి సారించారు.

  3. అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలను పెంపొందించడానికిసృజనాత్మక వ్యాపార వ్యవస్థను ప్రోత్సహించడానికి ఈ ల్యాబ్‌ల్లో మెంటార్‌షిప్ కార్యక్రమాలుసొంత మేధో సంపత్తి (ఐపీసృష్టి అవసరమని స్పష్టం చేసింది.

  4. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా విస్తరించడానికి జాతీయ కార్యక్రమాలురాష్ట్ర విద్యా శాఖల మధ్య సమన్వయం ఉండటం చాలా ముఖ్యమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు అభిప్రాయ పడ్డారు.

విద్యపరిశ్రమ అవసరాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించిప్రపంచ సృజనాధారిత ఆర్థిక వ్యవస్థకు భారతీయ యువత నాయకత్వం వహించేలా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ వర్కుషాపు ముగిసిందిచిన్ననాటి నుంచే సృజనాత్మక ఆలోచనలనుపరిష్కార నైపుణ్యాలను ఈ ల్యాబులు పెంపొందిస్తాయితద్వారా సాంకేతిక ఆధారిత సృజనాత్మక రంగాల్లో భవిష్యత్తులో వచ్చే కొత్త ఉద్యోగాలకు విద్యార్థులను సిద్ధం చేస్తాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2227453) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Manipuri , Bengali-TR , Punjabi , Kannada