ఆయుష్
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా 32 ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా నగదు రహిత చికిత్స అందించేందుకు


జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద

నాడు పోస్టు చేయడమైనది: 10 FEB 2026 6:45PM by PIB Hyderabad

ఆయుర్వేదాన్ని ప్రధాన ఆరోగ్య బీమా వ్యవస్థతో అనుసంధానించటంలో కీలక పరిణామం చోటుచేసుకుందికేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయూర్వేద (ఏఐఐఏ), జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్‌ (జీఐసీమధ్య ఉమ్మడి జాబితా నమోదుపై న్యూఢిల్లీలో 10 ఫిబ్రవరి 2026న అవగాహనా ఒప్పందం (ఏంఓయూకుదిరింది.

ఈ ఒప్పందం ద్వారా జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ పరిధిలోని మొత్తం 32 సాధారణ బీమా సంస్థలతో ఏఐఐఏ అనుసంధానమవటంతో అర్హత గల ఆయుర్వేద సేవలకు రోగులు నగదు రహిత చికిత్స సౌకర్యాన్ని పొందవచ్చు.

 

ఆయుష్ హెల్త్ ఇన్సూరెన్స్ నిపుణుల బృందం ఛైర్మన్ ప్రొఫెసర్ బెజోన్ కుమార్ మిశ్రా సమక్షంలో ఏఐఐఏ డైరెక్టర్ ప్రొఫెసర్ (వైద్యపి.కెప్రజాపతిజనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ డైరెక్టర్ (ఆరోగ్యంశ్రీ సెగర్ సంపత్ కుమార్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ కార్యక్రమానికి ఏఐఐఏ డీన్ (పీహెచ్‌డీప్రొఫెసర్ (డాక్టర్మహేశ్ వ్యాస్డీన్ (పీజీప్రొఫెసర్ (డాక్టర్ఆర్.కెయాదవ్మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ (డీఎంఎస్డాక్టర్ అల్కా కపూర్ఇతర సీనియర్ అధ్యాపకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏఐఐఏ డైరెక్టర్ ప్రొఫెసర్ (వైద్యపి.కెప్రజాపతి మాట్లాడుతూ.. ఈ ఒప్పందంతో జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్‌తో అనుబంధమున్న 32 బీమా కంపెనీల ద్వారా ఏఐఐఏలో నగదు రహిత చికిత్సను అందించవచ్చని తెలిపారుఆయుష్ మంత్రిత్వ శాఖకుఏఐఐఏ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారుఈ ఒప్పందం వల్ల రోగులకు ఆయుర్వేద వైద్యానికి సంబంధించి సౌలభ్యం మెరుగుపడటంతో పాటు ఆర్థిక వెసులుబాటువిశ్వాసం పెరుగుతాయని తద్వారా ఎంతో ప్రయోజకరమన్నారు.

 

ఆయుష్ హెల్త్ ఇన్సూరెన్స్ నిపుణుల కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ బెజోన్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. ఏఐఐఏ బృందాన్ని అభినందించారుఒక ఆయుష్ సంస్థజనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్‌తో అధికారిక ఒప్పందం కుదుర్చుకోవటం దేశంలోనే తొలిసారని వెల్లడించారుఏఐఐఏలో అందుబాటులోకి వచ్చిన నగదు రహిత చికిత్స సౌకర్యం వల్ల రోగుల్లో నమ్మకం పెరుగుతుందనిఎక్కువ మందికి సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారుఇది సంస్థపై విశ్వసనీయతను బలపరచటమే కాకఆయుష్ ఆరోగ్య సేవల స్థిరమైన వృద్ధికి దోహదపడుతుందన్నారు

 

ఈ సందర్భంగా ఆయుర్వేద చికిత్సలకు సంబంధించి బీమా మద్దతును సులభతరం చేసేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన కీలక కార్యక్రమం గురించి ప్రొఫెసర్ మిశ్రా తెలిపారులబ్ధిదారులు బీమా సంబంధిత సందేహాలను తీర్చుకోవటానికిఆయుష్ ఇన్సూరెన్స్ కవరేజీపై అవగాహన పెంచటానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ మొదటిసారిగా ప్రత్యేక ఆయుష్ హెల్త్ ఇన్సూరెన్స్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది.

ఆయుష్ హెల్త్ ఇన్సూరెన్స్ హెల్ప్‌లైన్‌ వివరాలు:

హెల్ప్‌లైన్‌ నంబర్: 1800-11-0008

పనివేళలుఅన్ని పనిదినాల్లో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు

బీమా ప్రయోజనాలను పొందటంలో ఎదురయ్యే సమస్యలను తొలగించిఆయుష్ ఆరోగ్య సేవలను సులభంగా వినియోగించుకునేలా ప్రోత్సహించటమే ఈ హెల్ప్‌లైన్‌ ముఖ్య ఉద్దేశం.

 

ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏగురించి

భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏసంస్థఆయుర్వేద రంగంలో అత్యన్నత సంస్థగా గుర్తింపు పొందిందిసంప్రదాయ ఆయుర్వేద విజ్ఞానాన్నిఆధునిక శాస్త్రీయ పురోగతితో అనుసంధానించటమే దీని ఉద్దేశంవివిధ విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేట్డాక్టోరల్ కోర్సులను ఈ సంస్థ అందించటమే కాకపరిశోధనఔషధాల అభివృద్ధిప్రామాణీకరణనాణ్యతనియంత్రణఔషధాల భద్రతఆయుర్వేద ఔషధాల శాస్త్రీయ ధ్రువీకరణ వంటి రంగాల్లో క్రీయాశీలకంగా పాల్గొంటుంది.

 

ఏఐఐఏలో అధునాతన రోగనిర్ధారణ సౌకర్యాలతో 200 పడకల రిఫరల్ ఆసుపత్రితో పాటు, 25 ప్రత్యేక విభాగాలు, 12 క్లినికల్ యూనిట్లు, 8 ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనా ప్రయోగశాలలు ఉన్నాయిఇవి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకుబోధనపరిశోధనలకు మద్దతిస్తాయిప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదానికి ప్రచారం కల్పించేందుకుపరిశోధనలను ప్రోత్సహించటానికి అంతర్జాతీయ సహకార కేంద్రాన్ని కూడా ఈ సంస్థ నిర్వహిస్తుంది.

 

జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ (జీఐసీగురించి

 

ఇన్సూరెన్స్ చట్టం-1938లోని సెక్షన్ 64c ప్రకారం ఏర్పాటైన చట్టబద్ధమైన సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్.. 2001 నుంచి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీడెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐఆధ్వర్యంలో పనిచేస్తోందిబీమా రంగంలో వేగంగా మారుతున్న ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పారిశ్రామిక విధానాలను సమన్వయం చేయటంలోప్రజా ప్రయోజనాలను కాపాడటంలో ఈ కౌన్సిల్ కీలక పాత్ర పోషిస్తుంది.

 

ఈ అవగాహనా ఒప్పందం.. భారతదేశంలో సమ్మిళితసమగ్రబీమా మద్దతులో ఆయుర్వేద ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించటంలో విప్లవాత్మక ముందడును సూచిస్తుందిజాతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఆయుష్ విధానాలను బలోపేతం చేయటానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఇది స్పష్టం చేస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2226534) సందర్శకుల సూచీ సంఖ్య : : 21
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: हिन्दी , Marathi , Malayalam , English , Urdu , Bengali , Punjabi