రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

మాజీ సైనికులు (కేంద్ర సివిల్ సర్వీసులు, పోస్టుల్లో పునర్నియామకం) సవరణ నియమాలు 2026


పునర్నియామక నియమాల పరిధిలోకి ఎంఎన్ఎస్ సిబ్బంది: పునరావాసం, ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాలు

నాడు పోస్టు చేయడమైనది: 10 FEB 2026 3:04PM by PIB Hyderabad

రాజ్యాంగంలోని 309వ అధికరణ ప్రకారం మాజీ సైనికోద్యోగులు (కేంద్ర సివిల్ సర్వీసులుపోస్టుల్లో పునర్నియామకంసవరణ నిబంధనలు-2026ను ప్రభుత్వం ప్రకటించిందిఆర్మీనౌకా దళంవాయుసేనలో పోరాట లేదా పోరాటేతర విభాగాల్లో ఏ ర్యాంకులో పని చేసిన వారైనా కేంద్ర సివిల్ సర్వీసుల్లో పనిచేసేందుకు మాజీ సైనికులను పునర్నియామకం నిర్వచన పరిధిలోకి వచ్చేలా 2(సీ)(i) నియమాన్ని సవరించారుఅలాగే మిలటరీ నర్సింగ్ సేవలు (ఎంఎన్ఎస్సిబ్బందిని కూడా దీని పరిధిలోకి తీసుకువచ్చారు.

కమిషన్డ్ ఆఫీసర్లుగా ఉన్న ఎంఎన్ఎస్ అధికారులకు ఇతర మాజీ సైనికుల మాదిరిగానే పునర్నియామక ప్రయోజనాలు లభిస్తాయా లేదా అనే విషయంలో గతంలో ఉన్న అస్పష్టతను ఈ సవరణ తొలగించిందిదీని ద్వారా పునర్నియామక నిబంధనల పరిధిలో ఎంఎన్ఎస్ సిబ్బందిని అధికారికంగా గుర్తించడమే కాకుండామాజీ రక్షణ సిబ్బందిలో మరింత ఎక్కువ మందికి పునరావాసంప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాలను బలోపేతం చేస్తుంది.

2వ నియమంలోనిక్లాజ్ (సిసవరణ ప్రకారం, 'మాజీ సైనికులనిర్వచనంలో ఇప్పుడు ఆర్మీనౌకా దళంవాయుసేనతో పాటు 'భారత యూనియన్ మిలిటరీ నర్సింగ్ సర్వీస్' (ఎంఎన్ఎస్)ను కూడా స్పష్టంగా చేర్చారుపోరాట లేదా పోరాటేతర విభాగాల్లో ఏ ర్యాంకులో పనిచేసిన వారికైనా ఈ నిబంధన వర్తిస్తుందిఈ సవరణ ఫిబ్రవరి 09, 2026న ప్రచురితమైన వెంటనే అమలులోకి వచ్చింది.

ఎంఎన్ఎస్ సిబ్బందికి ఈ సవరణ అధికారికంగా కల్పించే ప్రయోజనాలు:

  • రిజర్వేషన్ కోటాలు: కేంద్ర ప్రభుత్వ పోస్టుల్లో గ్రూప్ సిలో 10 శాతంగ్రూప్ డీలో 20 శాతం.

  • వయో పరిమితి సడలింపుసివిల్ ఉద్యోగ అర్హత కోసం అభ్యర్థి వాస్తవ వయసు నుంచి వారు మిలటరీ సర్వీసులో ఉన్న సంవత్సరాలతో పాటు.. అదనంగా మరో మూడేళ్లను తగ్గించుకొనేలా వెసులుబాటు.

  • ఉద్యోగ ప్రాధాన్యంయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ముందు ఇతర మాజీ సైనికులతో సమాన హోదా

 

***


(రిలీజ్ ఐడి: 2225861) సందర్శకుల సూచీ సంఖ్య : : 19
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Malayalam