రాజ్యసభ సచివాలయం
భారత అండర్-19 క్రికెట్ జట్టు ఘనవిజయంపై ఎగువసభలో అభినందనలు తెలియజేసిన రాజ్యసభ ఛైర్మన్ శ్రీ సీ. పీ. రాధాకృష్ణన్
నాడు పోస్టు చేయడమైనది:
09 FEB 2026 1:56PM by PIB Hyderabad
గౌరవనీయ సభ్యులారా.. జింబాబ్వేలోని హరారేలో జరిగిన ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్స్‌లో ఇంగ్లండు జట్టుపై ఘనవిజయం సాధించి మన దేశానికి గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టిన భారత అండర్-19 క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనను నేను ఎంతో గర్వంతో ప్రస్తావిస్తున్నాను.
రికార్డు స్థాయిలో ఆరోసారి అండర్-19 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకోవడం మన యువతలో ఉన్న అపారమైన నైపుణ్యాలను, అంకితభావాన్ని, క్రీడా నైపుణ్యాన్ని మరోసారి చాటిచెప్పింది.
గౌరవనీయ సభ్యులారా..నేను ఎల్లప్పుడూ బృంద స్ఫూర్తిని అభినందిస్తాను. ఈ విజయం మొత్తం జట్టుకు దక్కినప్పటికీ అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్స్ చరిత్రలోనే అత్యధికంగా 175 పరుగులు సాధించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ మాటలను రికార్డుల్లో నమోదు చేయాలనుకుంటున్నాను. ఫైనల్ వరకు జరిగిన ప్రయాణంలో అతని తోటి క్రీడాకారులు ప్రదర్శించిన అద్భుతమైన వ్యక్తిగత ప్రదర్శనలు నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. వారి ఉజ్వల భవిష్యత్తుకు ఇవి నిదర్శనం.
నాతో పాటు ఈ సభ తరఫున జట్టు కెప్టెన్, క్రీడాకారులు, కోచ్లు, సహాయక సిబ్బంది అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యువ ఛాంపియన్లు రాబోయే కాలంలో మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను.
***
(రిలీజ్ ఐడి: 2225565)
సందర్శకుల సూచీ సంఖ్య : : 57