ప్రధాన మంత్రి కార్యాలయం
మలేషియాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
07 FEB 2026 5:42PM by PIB Hyderabad
గౌరవనీయులైన ప్రధాని అన్వర్ ఇబ్రహీం గారికి,
నా ప్రియమైన స్నేహితులారా, సోదరీసోదరులారా,
సలామత్ పాతాంగ్!
వణక్కమ్!
సుఖమానో?
సత్ శ్రీ అకాల్!
బాగున్నారా?
కేమ్-ఛో?
మీ సాదర స్వాగతం మన ఉమ్మడి సంస్కృతికి ఉన్న అద్భుతమైన వైవిధ్యాన్ని తెలియజేస్తోంది.
ముందుగా ఈ సామాజిక వేడుకలో పాల్గొన్న నా ప్రియ మిత్రుడు ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం గారికి నా ధన్యవాదాలు. ఇప్పుడే చేసిన ప్రసంగంలో భారత్-మలేషియా స్నేహానికి ఉన్న విస్తృతి, భవిష్యత్తు సామర్థ్యం గురించి ఆయన చెప్పిన మంచి మాటలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
అంతేకాదు ప్రధాని స్వయంగా విమానాశ్రయానికి వచ్చి నాకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి తన కారులో నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు. కేవలం తన కారును మాత్రమే కాకుండా తన సీటును కూడా పంచుకున్నారు. ఈ ప్రత్యేకమైన ఆత్మీయత భారత్‌తో పాటు మీ అందరిపై ఆయనకు ఉన్న ప్రేమ, గౌరవానికి నిదర్శనం.
మీ ఆత్మీయ మాటలు, ఆతిథ్యం, స్నేహానికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడను.
మిత్రులారా,
మనం ఇప్పుడే ఒక రికార్డు స్థాయి సాంస్కృతిక ప్రదర్శనను చూశాం. 800 మందికి పైగా కళాకారులు అద్భుతమైన సమన్వయంతో ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనను మన ప్రజలు రాబోయే ఎన్నో ఏళ్లపాటు గుర్తుంచుకుంటారు. మీకు అభినందలు తెలియజేస్తున్నాను. ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులందరినీ అభినందిస్తున్నాను.
మిత్రులారా,
ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం గారు ప్రధాని కాకముందు నుంచే మేం స్నేహితులం. సంస్కరణల పట్ల ఆయన చూపుతున్న శ్రద్ధ, ఆయన గొప్ప మేధస్సు, 2025లో ఆసియాన్ అధ్యక్షుడిగా ఆయన సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించటం పట్ల నేను అభినందనలు తెలియజేస్తున్నాను.
మనం ప్రపంచంలోనే అతిపెద్ద 'డిజిటల్ ప్రజా మౌలికసదుపాయం', అతిపెద్ద ఆర్థిక సాంకేతికత వ్యవస్థను తయారుచేశాం. మన యూపీఐ ప్లాట్‌ఫామ్ కారణంగా ప్రపంచంలోని తక్షణ డిజిటల్ లావాదేవీలలో దాదాపు సగం దేశంలోనే జరుగుతున్నాయి.
వేగంగా వృద్ధి చెందుతూనే మన వృద్ధి పర్యావరణహితంగా ఉండేలా చూసుకున్నాం. ఒక దశాబ్దంలో మన సౌర శక్తి సామర్థ్యం దాదాపు 40 రెట్లు పెరగటం అనేది దీనికి ఒక మంచి ఉదాహరణ.
మిత్రులారా,
గతంలో భారతదేశాన్ని కేవలం ఒక భారీ మార్కెట్‌లా మాత్రమే చూసేవారు. ఇప్పుడు మనం పెట్టుబడులు, వాణిజ్యానికి ఒక కేంద్రంగా మారాం. వృద్ధికి ఒక 'నమ్మకమైన భాగస్వామి'గా భారతదేశాన్ని నేడు ప్రపంచం గుర్తిస్తోంది. బ్రిటన్, యూఏఈ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఒమన్, ఐరోపా సమాఖ్య, అమెరికా.. ఇలా ఎన్నో దేశాలు భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాయి. నమ్మకం అనేది నేడు భారతదేశపు అత్యంత బలమైన డబ్బుగా మారింది.
మిత్రులారా,
భారతదేశం మిమ్మల్ని ఎల్లప్పుడూ రెండు చేతులతో ఆహ్వానిస్తుంది. అందుకే కొన్ని నెలల క్రితం మేం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. మలేషియాలోని భారత సంతతి పౌరులకు 'ఓసీఐ కార్డ్' అర్హతను 6వ తరం వరకు పొడిగించాం.
మేం 'ఇండియన్ స్కాలర్‌షిప్స్ ట్రస్ట్ ఫండ్'కు మద్దతు ఇస్తూ వస్తున్నాం. ఇప్పుడు విద్యార్థులు భారతదేశంలో చదువుకోవడానికి వీలుగా 'తిరువళ్లువర్ ఉపకారవేతనాలను' కూడా అందించబోతున్నాం. అలాగే 'భారత్ గురించి తెలుసుకోండి కార్యక్రమం'లో మిమ్మల్ని చూడాలని మేం కోరుకుంటున్నాం.
మరో సంతోషకరమైన విషయం ఏమిటంటే.. త్వరలోనే మేం మలేషియాలో భారతదేశపు కొత్త 'కాన్సులేట్'ను ప్రారంభించనున్నాం. ఇది మనల్ని మరింత దగ్గర చేస్తుంది.
మిత్రులారా,
140 కోట్ల మంది భారతీయులు 2047 నాటికి 'వికసిత్ భారత్'ను నిర్మించాలని కోరుకుంటున్నారు.
వికసిత్ భారత్‌ను తయారుచేయాలి కదా?
మనం వికసిత్ భారత్‌ను నిర్మించి తీరుతామా లేదా?
మనం మన కలలను సాకారం చేసుకుంటామా లేదా?
మనం మన కలలను సంకల్పాలుగా మారుస్తామా లేదా?
మనం మన సంకల్పాన్ని సిద్ధింపజేసుకుంటామా లేదా?
ఈ ప్రయాణంలో మన ప్రవాస భారతీయులు, భారత సంతతి గలవారు అత్యంత విలువైన భాగస్వాములు. మీరు కౌలాలంపూర్‌లో పుట్టినా లేదా కోల్‌కతాలో పుట్టినా.. మీ హృదయాల్లో భారత్ ఎప్పుడూ సజీవంగా ఉంటుంది. మలేషియా, భారతదేశాల పురోగతిలో మీరు క్రియాశీలక భాగస్వాములు. సంపన్న మలేషియా, 'వికసిత్ భారత్' కలలను సాకారం చేయడంలో మీరు ఖచ్చితంగా సహాయపడతారు.
జై హింద్!
జుంపా లాగి!
మిక్కా నండ్రి!
***
(రిలీజ్ ఐడి: 2225171)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam