ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మలేషియా ప్రధానమంత్రితో భారత ప్రధానమంత్రి అధికారిక చర్చలు

నాడు పోస్టు చేయడమైనది: 08 FEB 2026 11:19AM by PIB Hyderabad

ఈ రోజు పెర్దానా పుత్రా కాంప్లెక్స్‌లో మలేషియా ప్రధానమంత్రి గౌరవ దాతోసేరి అన్వర్ ఇబ్రహీం భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి సంప్రదాయ పూర్వక స్వాగతం పలికారుఅనంతరం ఇరువురు నేతలు ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం అధికారిక నివాసం సెరి పెర్దానాలో ప్రతినిధి బృందం స్థాయిలో చర్చలు జరిపారు.

ఈ విస్తృత చర్చల్లో భాగంగా 2024లో ఇరు దేశాల మధ్య కుదిరిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరువురు నేతలు అంగీకరించారుఈ భాగస్వామ్యానికి మూలధారమైన ప్రాచీన భారత్-మలేషియా సంబంధాలనుప్రజల మధ్య సన్నిహిత బంధాలను వారు గుర్తు చేసుకున్నారువాణిజ్యంపెట్టుబడిరక్షణభద్రతనౌకా వాణిజ్యంపరిశుద్ధ ఇంధనాలుమౌలిక సదుపాయాలుఅంకురసంస్థలువ్యవసాయంవిద్యఆరోగ్యంఆయుర్వేదంపర్యాటకంసాంస్కృతిక సంబంధాల వంటి ప్రాధాన్య రంగాలు సహా మొత్తం ద్వైపాక్షిక సంబంధాలను ఇరువురు నేతలు సమీక్షించారుసెమీకండక్టర్లుకృత్రిమ మేధ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పరస్పర సహకారాన్ని మెరుగుపరచడం గురించీ వారు చర్చించారుద్వైపాక్షిక డిజిటల్ కౌన్సిల్ ద్వారా ఇరు దేశాల మధ్య డిజిటల్ సహకారంలో స్థిరమైన పురోగతిని నాయకులు ప్రశంసించారుఫిన్‌టెక్ సహకారాన్ని మెరుగుపరచడానికి యూపీఐపే-నెట్ మధ్య ఒప్పందాన్ని వారు స్వాగతించారు.


ద్వైపాక్షికసంస్థాగతసాంస్కృతిక సంబంధాలను మెరుగుపరచడం లక్ష్యంగా చట్ట సభలువిశ్వవిద్యాలయాల ద్వారా ఇరు దేశాల యువత మధ్య సంబంధాలను బలోపేతం చేయాలని ప్రధానమంత్రి శ్రీ మోదీ పిలుపునిచ్చారుఈ సందర్భంలో భారతదేశంలోని నలంద విశ్వవిద్యాలయంమలయా యూనివర్సిటీఐఐటీ మద్రాస్అడ్వాన్స్‌డ్ సెమీకండక్టర్ అకాడమీ ఆఫ్ మలేషియా మధ్య కొనసాగుతున్న సహకారాన్ని ఆయన స్వాగతించారుమలేషియాలో భారత తొలి కాన్సులేట్ ప్రారంభం వాణిజ్యప్రజా సంబంధాలను బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.


 

ప్రపంచస్థాయిలో పాలనా సంస్కరణలుబలోపేతమవుతున్న ఇండో-పసిఫిక్భారత్-ఆసియాన్ భాగస్వామ్యం సహా పరస్పర ప్రయోజనకరమైన ప్రాంతీయప్రపంచ సమస్యలపై తమ దృక్కోణాలను వారు పంచుకున్నారుఏఐటీఐజీఏ సమీక్షను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భారత ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.

2025
లో ఆసియాన్ కూటమికి మలేషియా విజయవంతంగా అధ్యక్షత వహించిన సందర్భంగా ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంను ప్రధానమంత్రి అభినందించారు2026లో బ్రిక్స్ కూటమికి భారత్ అధ్యక్షత వహించనున్న క్రమంలో భారత ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం... ఈ విషయంలో భారత్‌కు సంపూర్ణ మద్దతును ప్రకటించారుపహల్గాం ఉగ్రదాడినిఎర్రకోట పేలుళ్లను తీవ్రంగా ఖండించిన మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంకు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారుఉగ్రవాద నిరోధక చర్యల్లో నిరంతర సన్నిహిత సహకారం కోసం పిలుపునిచ్చారు.

చర్చల అనంతరం డిజిటల్ చెల్లింపులుభద్రతా సహకారంసెమీకండక్టర్లుఆరోగ్యంవైద్యంవిపత్తు నిర్వహణఅవినీతిని ఎదుర్కోవడంఆడియో-విజువల్ సహ నిర్మాణంసాంకేతిక-వృత్తి విద్యయూఎన్ శాంతి పరిరక్షణ సహకారంభారతీయ కార్మికులకు సామాజిక భద్రత వంటి అనేక ముఖ్యమైన ద్వైపాక్షిక ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారుఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ (ఐబీసీఏ)లో చేరడానికి మలేషియా అన్ని ప్రక్రియలనూ పూర్తి చేసిందిఇరు దేశాల మధ్య జరిగిన అవగాహన ఒప్పందాల పూర్తి జాబితాను ఇక్కడ చూడవచ్చు[లింక్]

ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఈ నెల 7 10వ భారత్-మలేషియా సీఈవోల సదస్సును నిర్వహించారుఈ సదస్సు తీర్మానాలను ఇరుపక్షాలూ ఆమోదించాయి.

భారత ప్రధానమంత్రి గౌరవార్థం మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ప్రత్యేక విందును ఏర్పాటు చేశారుప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం అందించిన సాదర ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపిన భారత ప్రధానమంత్రి... భారత్‌ను సందర్శించాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2225164) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Gujarati , Odia , Kannada , Malayalam