ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్, అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ముసాయిదాను స్వాగతించిన ప్రధానమంత్రి.. 'మేక్ ఇన్ ఇండియా’, ఉపాధి కల్పనకు ఊతం: ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 07 FEB 2026 8:59AM by PIB Hyderabad

భారతదేశం, అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి కుదిరిన ముసాయిదాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ స్వాగతించారు. ఈ పరిణామం ఇరుదేశాలకు గొప్ప శుభవార్త అన్నారు.

భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో డొనాల్డ్ ట్రంప్ చూపిన వ్యక్తిగత నిబద్ధతకు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారుఈ కార్యాచరణ ఇరుదేశాల భాగస్వామ్యంలో పెరుగుతున్న సాన్నిహిత్యంవిశ్వాసంశక్తిమంతమైన మార్పుని ప్రతిబింబిస్తోందన్నారు.

ఈ ఒప్పందం రైతులకుపారిశ్రామికవేత్తలకుఎంఎస్ఎంఈలుస్టార్టప్ ఆవిష్కర్తలకుమత్స్యకారులకు నూతన అవకాశాలను కల్పించటంతో 'మేక్ ఇన్ ఇండియాబలోపేతం అవటమే కాకమహిళలకుయువతకు పెద్దఎత్తున ఉపాధి లభిస్తుందని ప్రధానమంత్రి అన్నారు.

పెట్టుబడులనుసాంకేతిక భాగస్వామ్యాలను ఈ కార్యాచరణ మరింత బలోపేతం చేస్తుందని.. స్థిరత్వంవిశ్వసనీయమైన సరఫరా వ్యవస్థలను పటిష్ఠం చేస్తుందనిఅలాగే ప్రపంచ వృద్ధికి దోహదపడుతుందని ఆయన చెప్పారు.

వికసిత్ భారత్ లక్ష్యంగా భారతదేశ ఆకాంక్షను ప్రధానమంత్రి స్పష్టం చేశారుభవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజల సాధికారతకుసామూహిక వృద్ధికి తోడ్పడే ప్రపంచ భాగస్వామ్యాలకు భారత్ అత్యంత ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు.

భారత్అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందానికి సంబంధించి కేంద్ర వాణిజ్యపరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో చేసిన పోస్టుకు స్పందిస్తూశ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు;

"భారత్యూఎస్ఏకు గొప్ప శుభవార్త!

రెండు దేశాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి రూపొందించిన ముసాయిదాపై మేం ఏకాభిప్రాయానికి వచ్చాంమన దేశాల మధ్య పటిష్ఠమైన సంబంధాల కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపిన వ్యక్తిగత నిబద్ధతకు ధన్యవాదాలు.

ఈ కార్యాచరణ ఇరు దేశాల భాగస్వామ్యంలో పెరుగుతున్న సాన్నిహిత్యంవిశ్వాసంశక్తిమంతమైన మార్పుని ప్రతిబింబిస్తోందిదీని ద్వారా రైతులకుపారిశ్రామికవేత్తలకుఎంఎస్ఎంఈలుస్టార్టప్ ఆవిష్కర్తలకుమత్స్యకారులకు నూతన అవకాశాలు ఏర్పడటం వల్ల 'మేక్ ఇన్ ఇండియాబలోపేతం అవుతుందిమహిళలకుయువతకు పెద్దఎత్తున ఉపాధి లభిస్తుంది.

భారత్అమెరికా దేశాలు ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రాధాన్యతనిస్తున్నాయిఈ కార్యాచరణ మన మధ్య పెట్టుబడులనుసాంకేతిక భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేస్తుంది.

ఈ ముసాయిదా ద్వారా స్థిరత్వంవిశ్వసనీయమైన సరఫరా వ్యవస్థలు పటిష్టమవటమే కాకప్రపంచ వృద్ధికి దోహదపడుతుందివికసిత్ భారత్ లక్ష్యంగా భారతదేశం అడుగులు వేస్తున్న తరుణంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజల సాధికారతకుసామూహిక వృద్ధికి తోడ్పడే ప్రపంచ భాగస్వామ్యాల నిర్మాణానికి మేం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాం.

@POTUS 

@realDonaldTrump”

 

(రిలీజ్ ఐడి: 2224886) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam