ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మలేషియా పర్యటనకు ముందు ప్రధానమంత్రి ప్రకటన

నాడు పోస్టు చేయడమైనది: 07 FEB 2026 8:45AM by PIB Hyderabad

నా స్నేహితుడు, మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు ఈరోజు నేడు ఆ దేశ అధికారిక పర్యటనకు బయలుదేరుతున్నాను.

భారత్, మలేషియాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు ఇటీవలి కాలంలో గణనీయమైన పురోగతిని సాధించాయి. ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో జరగబోయే చర్చల కోసం, మా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. రక్షణ, భద్రతా సంబంధాలను మరింత లోతుగా పెంచుకోవడం, ఆర్థిక, ఆవిష్కరణల భాగస్వామ్యాన్ని మెరుగుపరచడం, అలాగే మా సహకారాన్ని కొత్త రంగాల్లో విస్తరించడం వంటి అంశాలే లక్ష్యంగా మేము ముందుకు సాగుతాం.

మలేషియాలోని భారతీయ సమాజాన్ని కలవడానికి కూడా నేను ఎంతో ఆసక్తిగా ఉన్నాను. దాదాపు ముప్పై లక్షల మంది ఉన్న వీరు.. ప్రపంచంలోని అతిపెద్ద భారతీయ ప్రవాస సమూహాల్లో ఒకరిగా ఉన్నారు. మలేషియా అభివృద్ధికి వారు అందిస్తున్న అపారమైన కృషి, మన రెండు దేశాల మధ్య ఒక సజీవ వారధిగా వారి పాత్ర.. మన చారిత్రక స్నేహానికి బలమైన పునాదిని అందిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2224884) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Gujarati , Tamil , Kannada , Kannada , Malayalam