ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పరీక్షా పే చర్చా-26లో పాల్గొనాల్సిందిగా అందరికీ ఆహ్వానం పలికిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 05 FEB 2026 9:56PM by PIB Hyderabad

రేపటి రోజున, అంటే ఫిబ్రవరి 6న ఉదయం 10 గంటలకు నిర్వహించే పరీక్షాపేచర్చా-26 (#ParikshaPeCharcha26) కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రతి ఒక్కరినీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానించారు. ఈ సంవత్సరపు సంచికలో పరీక్షలకు సంబంధించిన చాలా ఆసక్తిదాయకమైన అంశాలు ఉంటాయనీ, ముఖ్యంగా ఒత్తిడికి లోనవకుండా ఉండడానికీ, నేర్చుకోవడంపై దృష్టిని కేంద్రీకరించడానికీ ప్రాధాన్యంగా ఉంటాయని ఆయన ఉద్ఘాటించారు. ఈ వేదిక తనకు సదా ఆనందాన్నిస్తుందని, దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులతో మాట్లాడే అవకాశం కలగడమే దీనికి కారణమని ప్రధానమంత్రి తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘రేపు, అంటే ఫిబ్రవరి 6న ఉదయం 10 గంటలకు పరీక్షా పే చర్చా-26 (#ParikshaPeCharcha26) కార్యక్రమాన్ని చూడండి. పరీక్షలకు సంబంధించిన చాలా ఆసక్తిదాయకమైన అంశాలు ఈ సంవత్సరం పరీక్షా పే చర్చాలో భాగంగా ఉంటాయి.. ముఖ్యంగా ఒత్తిడికి లోనవకుండా ఉండాల్సిన అవసరంతో పాటు నేర్చుకోవడంపై దృష్టిని కేంద్రీకరించడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వడం, తదితర అంశాలు దీన్లో ఉంటాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడాన్ని నేను ఎప్పటికీ ఆనందిస్తుంటాను..  దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థులతో భేటీ అయ్యి, వారితో మాట్లాడే అవకాశం నాకు ఈ కార్యక్రమం ద్వారా లభించడమే దీనికి కారణం’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2224768) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , Malayalam , Bengali , English , Urdu , हिन्दी , Manipuri , Punjabi , Gujarati , Kannada