ప్రధాన మంత్రి కార్యాలయం
ఆలోచనల్లో, పనుల్లో క్రమశిక్షణకు ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని సంస్కృత సుభాషితం ద్వారా చెప్పిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
05 FEB 2026 9:49AM by PIB Hyderabad
జీవితంలో స్పష్టమైన ఆలోచనలకీ, దృఢ సంకల్పానికీ ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతయినా ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్పష్టం చేశారు. అలాగే నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల సంకటాలు ఎదురవుతాయని కూడా తెలియజెప్పడం కోసం ఆయన.. మన ప్రాచీన జ్ఞానం మనకిచ్చిన ఓ సందేశాన్ని గురించి ప్రస్తావించారు.
నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడితే అది మన మనసును బలహీనపరిచి, ఉద్దేశాన్ని వక్రీకరిస్తుందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఒకసారి మౌలిక కార్యాల్ని చేపట్టిన తరువాత, సవాళ్లు మరింత గాఢంగానూ, జటిలంగానూ మారిపోతాయనీ, వాటిని అధిగమించడానికి క్రమశిక్షణ, ఏకత, తిరుగులేని సంకల్ప సహకారాన్ని తీసుకోవలసి వస్తుందనీ ఆయన తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ అందులో :
‘‘వికల్పమాత్రావస్థానే వైరూప్యం మనసో భవేత్
పశ్చాన్మూలక్రియారంభగంభీరావర్తదుస్తర:’’ అనే సంస్కృత సుభాషితాన్ని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2223798)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam