ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గుర్తింపు మోసాలను నివారించేందుకు 2.5 కోట్లకు పైగా మరణించిన వారి ఆధార్ కార్డుల తొలగింపు

నాడు పోస్టు చేయడమైనది: 04 FEB 2026 2:38PM by PIB Hyderabad

ప్రపంచంలోనే అతి పెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ ఆధార్దాదాపు 134 కోట్ల సజీవ ఆధార్ కార్డుదారులు ఉన్నారు.

మరణించిన వారి ఆధార్ నంబరు తొలగింపు

ఆధార్ డేటా‌బేస్ కచ్చితత్వాన్నివిశ్వసనీయతను పరిరక్షించడంలో భాగంగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2.5 కోట్లకు పైగా మరణించిన వారి ఆధార్ కార్డులను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐతొలగించింది.

ఒక వ్యక్తి మరణించినట్లయితే.. సంక్షేమ ప్రయోజనాలను పొందేందుకు అతడు/ఆమె గుర్తింపును దుర్వినియోగం చేయకుండా ఉండటానికి లేదా అనధికారికంగా ఉపయోగించడానికి వీలు లేకుండా చేయడానికి ఆధార్ కార్డును డీయాక్టివేట్ చేస్తారు.

వ్యక్తి మరణం నమోదయిన రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం ఆధార్‌లో చిరునామాగా నమోదైన రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం వివరాలు వేరుగా ఉండవచ్చు.

గుర్తింపు మోసాలను అరికట్టేందుకు చేపట్టిన ప్రయత్నాలు

గుర్తింపు మోసాలను తగ్గించేందుకుదేశంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎలాంటి మోసాలు లేకుండా లబ్ధిదారులకు అందించేందుకు అనేక చర్యలు తీసుకున్నారు.

  1. బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్ ఫీచర్.. దుర్వినియోగాన్ని నివారించేందుకు ఆధార్ నంబర్‌‌ను ఆ వ్యక్తి తన బయోమెట్రిక్స్‌తో లాక్ చేసుకొనే వీలును ఇది కల్పిస్తుంది.

  2. ఆధార్ నంబరు ఉన్న వ్యక్తికి ఆధార్ లాక్/అన్‌లాక్ సౌకర్యం.

  3. మోసపూరిత గుర్తింపును నివారించడానికిలావాదేవీ సమయంలో లబ్ధిదారుడు భౌతిక హాజరును నిర్ధారించేందుకు ‘లైవ్‌నెస్ డిటెక్షన్ ఫీచర్’తో ముఖ గుర్తింపు అమలవుతోంది.

  4. ఆఫ్‌లైన్ ధ్రువీకరణ: ఆఫ్‌లైన్ గుర్తింపు ధ్రువీకరణ కోసం ఆధార్ అనుసంధానిత క్యూఆర్ కోడ్ వినియోగంకాగితరహిత ఆధార్ ఆఫ్‌లైన్ ఈ-కేవైసీ-ఆధార్ఆధార్ ధ్రువీకృత క్రెడిన్షియల్స్ వినియోగాన్ని ప్రోత్సహించడం.

  5. ఆధార్ కార్డు దారుల కీలక సమాచారాన్ని ఏ రూపంలోనూ యూఐడీఏఐ పంచుకోదు.

  6. భద్రమైన డేటా స్టోరేజి: ఆధార్ నంబర్లను ఎన్‌క్రిప్టెడ్ విధానంలో భద్రపరిచేలా ఆధార్ డేటా వాల్టులను తప్పనిసరిగా ఉపయోగించాలని సంబంధిత సంస్థలకు సూచించారు.

  7. డేటాబేస్ శానిటైజేషన్: ఎప్పటికప్పుడు నకిలీలను తొలగించడంచనిపోయిన వ్యక్తులకు సంబంధించిన ఆధార్ కార్డుల డీయాక్టివేషన్ జరుగుతుంది.

  8. యూఐడీఏఐ జాబితాలో పొందుపరిచిన డాక్యుమెంట్ల ఆధారంగా మాత్రమే ఆధార్ కార్డు వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి.

  9. తమ ధ్రువీకృత ఆధార్ నంబర్ క్రెడెన్షియల్స్‌ను భద్రంగాసులభంగా ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ సీకింగ్ ఎంటిటీస్ (ఓవీఎస్‌ఈ)తో పంచుకొనేందుకు కొత్త ఆధార్ యాప్‌ను యూఐడీఏఐ ప్రారంభించింది.

04.02.2026న లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద అందించారు

 

***


(రిలీజ్ ఐడి: 2223797) సందర్శకుల సూచీ సంఖ్య : : 30
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Gujarati , Kannada