హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సామర్థ్య నిర్మాణం ద్వారా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం

నాడు పోస్టు చేయడమైనది: 03 FEB 2026 4:15PM by PIB Hyderabad

‘‘క్రిప్టో కరెన్సీలు, క్రౌడ్ ఫండింగ్, లాభాపేక్ష రహిత సంస్థల ద్వారా ఉగ్రవాదులకు అందుతున్న నిధులను అడ్డుకోవడం (సీఎఫ్‌టీ)’’ అనే అంశంపై 2025 ఏప్రిల్ 21 నుంచి 22 వరకు న్యూఢిల్లీలో సామర్థ్య నిర్మాణ కార్యక్రమం జరిగింది.సెంట్రల్ ఏసియన్ రిపబ్లిక్స్ (సీఏఆర్ఎస్) ప్రతినిధుల కోసం నిర్వహించిన మొదటి సామర్థ్య నిర్మాణ కార్యక్రమమిది. ఉగ్రవాదులకు అందుతున్న నిధులను అడ్డుకోవడంలో అంతర్జాతీయంగా భారత్ నాయకత్వ స్థానం బలోపేతమవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జాతీయ భద్రతా మండలి సచివాలయం సహకారంతో రెవెన్యూ విభాగం దీనిని నిర్వహించింది.

ప్రధానంగా డిజిటల్ వ్యవస్థలను, సామాజిక నిర్మాణాలను దుర్వినియోగం చేయడం ద్వారా ఎదురవుతున్న ముప్పుల నేపథ్యంలో ఉగ్రవాదులకు అందుతున్న ఆర్థిక సాయాన్ని అడ్డుకొనేలా అంతర్జాతీయ సహకారం పట్ల భారత్‌కున్న అంకితభావాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది. రెవెన్యూ విభాగానికి చెందిన ఎఫ్ఏ‌టీఎఫ్ సెల్, ఫైనాన్సియల్ ఇంటిలిజెన్స్ యూనిట్ ఇండియా (ఎఫ్ఐయూ ఐఎన్‌డీ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), హోం వ్యవహారాలు, ఈఏజీకి చెందిన నిపుణులు ఈ కార్యక్రమాలను నిర్వహించారు. చేపట్టిన సెషన్లు:

  1. వర్చువల్ వ్యవస్థల దుర్వినియోగం గుర్తింపు, దర్యాప్తు

  2. ఉగ్రవాద కార్యకలాపాల కోసం చేపడుతున్న క్రౌడ్ ఫండింగ్ విధానాలు

  3. ఎన్‌పీవోల పర్యవేక్షణకు నియంత్రణ, ఆర్థిక నిఘా విధానాలు

సీఏఆర్‌తో నైపుణ్యాలను పంచుకోవడం ఏప్రిల్ శిక్షణకు మాత్రమే పరిమితం. అలాగే శిక్షణానంతరం నైపుణ్యాలను అందించేలా మరే ఇతర కార్యక్రమాన్ని నిర్వహించలేదు.

వివిధ కార్యక్రమాల ద్వారా మధ్య ఆసియా ప్రతినిధులకు సాంకేతిక నైపుణ్యాలను భారత్ అందిస్తోంది. దీనిలో శిక్షణా కార్యక్రమాలు, అంతర్గత సంప్రదింపులు ఉన్నాయి.

  1. ఉగ్రవాదానికి సంబంధించిన దర్యాప్తులపై ఆర్థిక నిఘా సమాచార సేకరణ.

  2. వర్చువల్ అసెట్ సర్వీసు ప్రొవైడర్ (వీఏఎస్‌పీ)ల దుర్వినియోగం వల్ల ఎదురయ్యే సమస్యలు.

  3. క్రౌడ్ ఫండింగ్ వేదికల దుర్వినియోగం.

  4. తీవ్రవాదానికి ఆర్థిక సాయం, ఎన్‌పీవోల రిస్క్ ప్రొఫైలింగ్ వ్యవస్థలు

  5. ఫైనాన్సియల్ ఇంటిలిజెన్స్ యూనిట్ - ఇండియా (ఎఫ్ఐయూ-ఐఎన్‌డీ), ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సహా భారతీయ సంస్థలు చేపట్టిన అధ్యయనాలు.

అలాగే, ఆయా దేశాల న్యాయ పరిధిలో, వారి అవసరాలకు తగినట్టుగా వినియోగించుకోవడానికి వీలుగా రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను సీఏఆర్‌ ప్రతినిధులకు అందించారు.

భవిష్యత్తులో ఉగ్రవాదులకు అందే నిధులకు సంబంధించి ఇదే తరహా సవాళ్లను ఎదుర్కొనే ఇతర ప్రాంతాలతో సహకారానికి భారత్ ప్రతిపాదించింది. బిమ్స్‌టెక్ దేశాల కోసం దౌత్యపరమైన, కార్యాచరణ సమన్వయానికి అనుగుణంగా.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలసి రెవెన్యూ విభాగం ఇలాంటి సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ఉగ్రవాదులకు అందే నిధులను అడ్డుకోవడం (సీఎఫ్‌టీ) కోసం ఏర్పాటు చేసిన రెండు బృందాలు - ఏసియన్ పసిఫిక్ గ్రూప్ (ఏపీజీ), యూరేషియన్ గ్రూప్ (ఈఏజీ)లో భారత్ సభ్యురాలిగా ఉంది. ఈ బృందాల ద్వారా సమయానుగుణంగా భారత్ సహకారాన్ని అందిస్తోంది.

లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2222832) సందర్శకుల సూచీ సంఖ్య : : 78
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Tamil