ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎమ్) 2.0ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన 2026-27 బడ్జెట్
ఎలక్ట్రానిక్స్ విడి విభాగాల తయారీ పథకం (ఈసీఎమ్ఎస్) కోసం బడ్జెట్ కేటాయింపులు రూ. 40,000 కోట్లకు పెంపు
ఉన్నత ప్రమాణాలు, మెరుగైన మార్జిన్‌తో ఐటీ/ఐటీఇఎస్ కోసం కొత్త సేఫ్ హార్బర్ నిబంధనలు
प्रविष्टि तिथि:
01 FEB 2026 2:27PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు 2026-27 ఆర్థిక సంవత్సరం కోసం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. భారత ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం వృద్ధిని వేగవంతం చేయడానికి ముఖ్యమైన చర్యలనూ ఈ ప్రకటనల్లో ప్రస్తావించారు.
పరికరాలు, సామగ్రి ఉత్పత్తికి, ఫుల్ స్టాక్ ఇండియన్ ఐపీని రూపొందించడానికి, సరుకు రవాణా వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎమ్) 2.0ను ప్రారంభిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. సాంకేతికత, నైపుణ్యం కలిగిన కార్మికులను అభివృద్ధి చేయడానికి పరిశ్రమ నేతృత్వంలోని పరిశోధన, శిక్షణ కేంద్రాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి దీని కోసం రూ. 1,000 కోట్లు కేటాయించారు. భారత సెమీకండక్టర్ రంగ సామర్థ్యాలను విస్తరించిన ఐఎస్ఎమ్ 1.0 ఆధారంగానే ఐఎస్ఎమ్ 2.0ను నిర్మిస్తున్నారు.
2025, ఏప్రిల్ నెలలో 722,919 కోట్ల వ్యయంతో ప్రారంభించిన ఎలక్ట్రానిక్స్ విడి భాగాల తయారీ పథకం (ఈసీఎమ్ఎస్) ఇప్పటికే దాని లక్ష్యానికి రెట్టింపు పెట్టుబడి హామీలను పొందింది. ఈ ఊపును ఉపయోగించుకోవడానికి ఇప్పుడు వ్యయాన్ని రూ. 40,000 కోట్లకు పెంచాలని ప్రతిపాదించారు.
భారత వృద్ధికి చోదక శక్తిగా ఉన్న ఐటీ రంగానికి ఊతమివ్వడానికి, పారదర్శక పన్ను విధానాన్ని అందించడానికి 2026-27 బడ్జెట్ ఐటీ/ఐటీఈఎస్‌ల కోసం ఉన్నత ప్రమాణాలు, మెరుగైన మార్జిన్‌తో కొత్త సేఫ్ హార్బర్ నిబంధనలను ప్రతిపాదించింది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సేవలు, ఐటీ ఆధారిత సేవలు, నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ సేవలు, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన కాంట్రాక్ట్ ఆర్ అండ్ డి సేవల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రగామిగా ఉంది. ఈ వ్యాపార విభాగాల పరస్పర అనుసంధానాన్ని అంగీకరిస్తూ, అందరికీ వర్తించే 15.5 శాతం కామన్ సేఫ్ హార్బర్ మార్జిన్‌తో ఈ సేవలన్నింటినీ ఒకే కేటగిరీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల కింద ఏకీకృతం చేయాలని బడ్జెట్ ప్రతిపాదించింది.
· ఐటీ సేవల కోసం సేఫ్ హార్బర్‌ను పొందేందుకు పరిమితిని 300 కోట్ల రూపాయల నుంచి 2,000 కోట్ల రూపాయల వరకు గణనీయంగా పెంచాలని ప్రతిపాదించారు.
· ఐటీ సేవల కోసం సేఫ్ హార్బర్ అనేది పన్ను అధికారి దరఖాస్తును పరిశీలించి, ఆమోదించాల్సిన అవసరం లేకుండా ఆటోమేటెడ్ నియమ-ఆధారిత ప్రక్రియ ద్వారా ఆమోదించబడుతుంది,.
· ఐటీ సేవల కంపెనీ ఒకసారి దరఖాస్తు చేసుకున్నప్పుడు, అదే సేఫ్ హార్బర్‌ను దాని ఎంపిక ప్రకారం 5 సంవత్సరాల పాటు కొనసాగించవచ్చు.
ఇంకా, ముందస్తు ధరల ఒప్పందాన్ని (ఏపీఏ) ముగించాలనుకునే ఐటీ సేవల కంపెనీల కోసం... ఐటీ సేవల ఏకపక్ష ఏపీఏ ప్రక్రియను వేగవంతం చేయాలని, దానిని 2 సంవత్సరాల వ్యవధిలో ముగించడానికి ప్రయత్నించాలని ప్రతిపాదించారు. పన్ను చెల్లింపుదారుల అభ్యర్థనపై 2 సంవత్సరాల వ్యవధిని మరో 6 నెలల వరకు పొడిగించవచ్చు. ఏపీఏలోకి ప్రవేశించే సంస్థకు అందుబాటులో ఉన్న సవరించిన రిటర్న్‌ల సౌకర్యాన్ని దాని అనుబంధ సంస్థలకూ విస్తరించాలని ప్రతిపాదించారు.
కీలకమైన మౌలిక సదుపాయాలను ప్రారంభించడం, డేటా సెంటర్లలో పెట్టుబడులను పెంచాల్సిన అవసరాన్ని గుర్తించి, భారత డేటా సెంటర్ సేవలను ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు క్లౌడ్ సేవలను అందించే ఏదైనా విదేశీ కంపెనీకి 2047 వరకు పన్ను మినహాయింపునివ్వాలని 2026-27 బడ్జెట్ ప్రతిపాదించింది. ఇది భారతీయ రీసెల్లర్ సంస్థ ద్వారా భారతీయ వినియోగదారులకు సేవలను అందించాల్సి ఉంటుంది. భారత్ నుంచి డేటా సెంటర్ సేవలను అందించే కంపెనీ సంబంధిత సంస్థ అయితే ఖర్చుపై 15 శాతం సేఫ్ హార్బర్‌నూ ప్రతిపాదించారు.
వికసిత్ భారత్ కోసం ప్రధాన చోదక శక్తిగా సేవల రంగంపై దృష్టి సారించే చర్యలను సిఫార్సు చేయడానికి అత్యంత శక్తిమంతమైన 'విద్య నుంచి ఉపాధి, వ్యాపారం' స్టాండింగ్ కమిటీనీ ప్రతిపాదించారు. ఈ కమిటీ ఉద్యోగాలు, నైపుణ్య అవసరాలపై ఏఐ సహా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ప్రభావాన్ని అంచనా వేసి, అవసరమైన చర్యలను ప్రతిపాదిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2221755)
आगंतुक पटल : 12