ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారతీయ కోస్తా తీర రక్షక దళం స్థాపన దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 01 FEB 2026 11:20AM by PIB Hyderabad

భారతీయ కోస్తా తీర రక్షక దళం స్థాపన దినోత్సవం సందర్భంగా అందులోని సైనికులుఅధికారులందరికీ ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాభినందనలను తెలియజేశారుభారతీయ కోస్తా తీర రక్షక దళం మన సముద్ర తీరం పొడవునా ఒక దృఢమైన కవచంగా నిలిచి తన ప్రతిష్ఠను చాటుతోందని శ్రీ మోదీ అన్నారునౌకావాణిజ్యానికి భద్రతను కల్పించడంలోనూవైపరీత్యాలు ఎదురైనప్పుడల్లా సత్వరం రంగంలోకి దిగి అవసరమైన రక్షణసహాయక చర్యలు చేపట్టడంలోనూ ఈ దళం తిరుగులేని నిబద్ధతను నిరూపిస్తోందనీమన నౌకావాణిజ్య అనుబంధ విస్తారిత వ్యవస్థను ఇది పరిరక్షిస్తున్న తీరు ప్రశంసనీయమనీ ప్రధానమంత్రి అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -

‘‘భారతీయ కోస్తా తీర రక్షక దళం స్థాపన దినోత్సవం సందర్భంగా ఆ దళంలోని సైనికులుఅధికారులందరికీ శుభాకాంక్షలువారు మన సముద్ర తీరం పొడవునా దృఢ రక్షాకవచంగా నిలుస్తూప్రసిద్ధి పొందారునౌకావాణిజ్య భద్రతకు వారు తిరుగులేని నిబద్ధతను చాటి చెబుతున్నారువైపరీత్యాలు ఎదురైనప్పుడల్లా తక్షణం రంగంలోకి దిగి అవసరమైన రక్షణసహాయక చర్యలను చేపడుతున్నారుఅలాగే మన నౌకావాణిజ్య అనుబంధ విస్తారిత వ్యవస్థను ఈ దళం పరిరక్షిస్తున్న తీరు కూడా ప్రశంసనీయంగా ఉంది’’ అని పేర్కొన్నారు.

 

 

****

MJPS/VJ


(రిలీజ్ ఐడి: 2221383) సందర్శకుల సూచీ సంఖ్య : : 58