పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
‘అంతర్జాతీయ చిత్తడి నేలల దినోత్సవం 2026’ నేపథ్యంలో భారత్ రాంసర్ జాబితాలో మరో రెండు చిత్తడి ప్రాంతాలు
చేరినట్లు ప్రకటించిన కేంద్ర పర్యావరణ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్
ఉత్తరప్రదేశ్‌లోని పట్నా పక్షుల అభయారణ్యం, గుజరాత్‌లోని ఛారీ-ధండ్‌కు అంతర్జాతీయ గుర్తింపు
प्रविष्टि तिथि:
31 JAN 2026 10:11AM by PIB Hyderabad
అంతర్జాతీయ చిత్తడి నేలల దినోత్సవాన్ని 2026 ఫిబ్రవరి 2న నిర్వహిస్తున్న నేపథ్యంలో భారత్ రాంసర్ జాబితాలో మరో రెండు కొత్త ప్రాంతాలను చేర్చినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ప్రకటించారు.
రాంసర్ ప్రాంతాల జాబితాలో ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో ఉన్న పట్నా పక్షుల అభయారణ్యం, గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉన్న ఛారీ-ధండ్ చోటు దక్కించుకున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో మంత్రి పేర్కొన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత దేశంలోని రాంసర్ ప్రాంతాలు 276 శాతం మేర పెరిగాయని శ్రీ యాదవ్ తెలియజేశారు. 2014లో 26 ప్రాంతాలుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 98కు చేరుకుంది. పర్యావరణాన్ని కాపాడటంలోనూ, చిత్తడి నేలలను పరిరక్షించడంలోనూ భారత్ అంకిత భావాన్ని ఈ అంతర్జాతీయ గుర్తింపు ప్రతిబింబిస్తోందన్నారు.
***
(रिलीज़ आईडी: 2221298)
आगंतुक पटल : 9