ప్రధాన మంత్రి కార్యాలయం
జాతిపిత మహాత్మాగాంధీకి రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
30 JAN 2026 1:45PM by PIB Hyderabad
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. బాపూజీ ఆశయాలు దేశ ప్రయాణానికి మార్గనిర్దేశం చేస్తాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. "ఆయన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామనీ, న్యాయం, సామరస్యం, మానవ సేవతో కూడిన భారతదేశ నిర్మాణానికి మా నిబద్ధతను ప్రకటిస్తున్నాం" అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులు అర్పించాం. ఎప్పటికీ చెరిగిపోని ఆయన ఆశయాలు దేశ ప్రగతికి నిరంతరం మార్గనిర్దేశం చేస్తుంటాయి. గాంధీజీ సిద్ధాంతాలకు కట్టుబడి.. న్యాయం, సామరస్యం, మానవ సేవతో కూడిన భారతదేశ నిర్మాణానికి మా నిబద్ధతను ప్రకటిస్తున్నాం"
(रिलीज़ आईडी: 2220838)
आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam