ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం
प्रविष्टि तिथि:
28 JAN 2026 11:22AM by PIB Hyderabad
మహారాష్ట్రలోని బారామతి జిల్లాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. "ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. ఈ తీవ్ర విషాద సమయంలో మృతుల కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన విమాన ప్రమాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన వారందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ తీవ్ర విషాద సమయంలో మృతుల కుటుంబాలకు మనోధైర్యం లభించాలని ప్రార్థిస్తున్నాను.”
***
(रिलीज़ आईडी: 2219509)
आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam