ప్రధాన మంత్రి కార్యాలయం
సార్వజనీన సిద్ధాంతాలైన క్రమశిక్షణ, సేవ, జ్ఞానం.. ఇవి భూమి భవితకు పునాదులని చాటిచెప్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
28 JAN 2026 9:41AM by PIB Hyderabad
క్రమశిక్షణ, సేవ, జ్ఞానం.. ఇవి సార్వజనీన సిద్ధాంతాలు, భూమి భవితకు పునాదులు అని చాటిచెప్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
‘‘సేవాభావంతో, సత్యనిష్ఠతో చేసిన పనులు ఎప్పుడూ వ్యర్థంగా పోవు. సంకల్పం, అంకిత భావం, సకారాత్మకతలతో మనం ఒక్క మనకే కాక పూర్తి మానవ జాతికి కూడా మేలు చేయవచ్చును.
సత్యం బృహదృతముగ్రం దీక్షా తపో బ్రహ్మ యజ్ఞ: పృథివీం ధారయన్తి
సా నో భూతస్య భవ్యస్య పత్న్యురుం లోకం పృథివీ న: కృణోతు’’.
విస్తృత సత్యం, కఠిన నియమాలు, అందరికీ సేవ చేయాలన్న ప్రతిజ్ఞను స్వీకరించడం, నిష్ఠతో కూడిన జీవితాన్ని గడపడం, విస్తృత జ్ఞానంతో చేసే అన్ని పనులు.. ఇవి సమస్త పృథ్విని తమ భుజాలపైకి ఎత్తుకొని మోస్తాయి. మన గతాన్ని, భవిష్యత్తును తీర్చిదిద్దే పృథ్వి.. మన కోసం విశాల భూభాగాల్ని అందించాలని కోరుకుందామని ఈ సుభాషితం సూచిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘సేవాభావంతో, సత్యనిష్ఠతో చేసిన పనులు ఎప్పుడూ వ్యర్థం కావు. సంకల్పం, అంకితభావం, సకారాత్మకతలతో మనం మనతో పాటు, పూర్తి మానవ జాతికీ మేలు చేయగలుగుతాం.
సత్యం బృహదృతముగ్రం దీక్షా తపో బ్రహ్మ యజ్ఞ: పృథివీం ధారయన్తి
సా నో భూతస్య భవ్యస్య పత్న్యురుం లోకం పృథివీ న: కృణోతు’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2219494)
आगंतुक पटल : 6