రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఈయూ కమిషన్ ఉన్నత ప్రతినిధి/ఉపాధ్యక్షురాలితో న్యూఢిల్లీలో రక్షణ మంత్రి భేటీ


ప్రపంచ విశాల ప్రయోజనాల కోసం భారత, ఈయూ రక్షణ పరిశ్రమలు తమ ప్రయత్నాల్లో సమన్వయాన్ని ఏర్పరుచుకోవాలి: శ్రీ రాజ్‌నాథ్ సింగ్

ఇరు పక్షాలూ హిందూ మహా సముద్ర ప్రాంతంలో కలిసి పనిచేయడంతో పాటు,
సంయుక్త విన్యాసాల ద్వారా పరస్పర అత్యుత్తమ పద్ధతుల్లోని మంచిని గ్రహించాలి: కాజా కల్లాస్

प्रविष्टि तिथि: 27 JAN 2026 1:33PM by PIB Hyderabad

యూరోపియన్ యూనియన్ (ఈయూ) కమిషన్ ఉన్నత ప్రతినిధి/ఉపాధ్యక్షురాలు కాజా కల్లాస్‌తో కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ న్యూ ఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు. ద్వైపాక్షిక భద్రతకు, రక్షణకు సంబంధించిన అనేక అంశాలపై ఈ సమావేశంలో నేతలు ఇద్దరూ చర్చించారు. ప్రజాస్వామ్యం, బహుళవాదం, చట్టబద్ధ పాలనకు సంబంధించి ఉమ్మడి సిద్ధాంతాలను భారత్, ఈయూ అనుసరిస్తున్నాయని, ఇవి క్రమ క్రమంగా ఒక గాఢ భాగస్వామ్యానికి పునాదిని వేస్తాయని రక్షణ మంత్రి తెలిపారు. ఈ విలువల ఆధారంగా ప్రపంచ స్థిరత, సుస్థిర అభివృద్ధి, సమ్మిళిత సమృద్ధి లక్ష్యాల సాధన దిశగా ఆచరణాత్మక సహకారంతో ముందుకు సాగాలని భారత్ ప్రయత్నిస్తోందని కూడా ఆయన వివరించారు.  
భారత్, ఈయూ రక్షణ రంగాలకు చెందిన పరిశ్రమలు ప్రపంచ విశాల హితాన్ని దృష్టిలో పెట్టుకొని తమ ప్రయత్నాల్లో సమన్వయాన్ని ఏర్పరుచుకోవాలని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇది వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి సాధన కోసం ఈయూ చేస్తున్న కృషికి కూడా అనుగుణంగా ఉందనీ, అంతేకాక భారత ‘ఆత్మనిర్భర్ భారత్’ దృష్టికోణాన్ని సమర్థిస్తోందని ఆయన అన్నారు. సరఫరా వ్యవస్థలను ఏకీకరించి విశ్వసనీయ రక్షణ ప్రధాన అనుబంధ విస్తారిత వ్యవస్థల్నీ, భవిష్యత్తుకు అనువైన విధంగా తయారీ సామర్థ్యాల్నీ మెరుగుపరుచుకోవడంలో ఓ ప్రధాన శక్తిగా ఈ భాగస్వామ్యం మారగలుగుతుందని ఆయన చెప్పారు. ఈయూ చేపట్టిన ‘రీ ఆర్మ్ ఇనీషియేటివ్’లో భారత రక్షణ పరిశ్రమ ఒక కీలక పాత్రను పోషిస్తుందనీ, ప్రత్యేకించి ప్రస్తుతం ఈయూ తన సరఫరాదారులలో త్వరిత గతిన మార్పు చేర్పులను చేసుకోవడంతో పాటు ఆధారపడక తప్పని స్థితితో ఎదురయ్యే ముప్పుల్ని తగ్గించుకోవాలని కూడా ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కల్లాస్ భారత్‌లో పర్యటించడం ఎంతో ప్రత్యేకమని ఆయన అన్నారు.    
భారత 77వ గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొంటుండడం, విశేషించి కర్తవ్య పథ్‌లో నిర్వహించిన కవాతులో పాలుపంచుకోవడానికి ఈయూకు అవకాశం లభించడం పట్ల కాజా కల్లాస్ కృతజ్ఞత‌ తెలిపారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్, ఈయూ తప్పక కలిసి పనిచేయాలని, సంయుక్త విన్యాసాల ద్వారా పరస్పర అత్యుత్తమ పద్ధతుల్లోని మంచిని గ్రహించాలని ఆమె అన్నారు. గురుగ్రామ్‌లోని భారతీయ నౌకాదళ ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్-ఇండియన్ ఓషన్ రీజియన్ (ఐఎఫ్‌సీ-ఐఓఆర్)లో ఒక అనుసంధాయక అధికారి (ఎల్‌ఓ)ను నియమించాలన్న ఈయూ ప్రతిపాదనను రక్షణ మంత్రి స్వాగతించారు. ఐఎఫ్‌సీ-ఐఓఆర్‌లో యూరోపియన్ యూనియన్ లైజాన్ ఆఫీసరును నియమించడం హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్రపు దోపిడీ దొంగలను ఎదుర్కోవడంతో పాటు ఇతరత్రా ముప్పులను పసిగట్టడంలో భారతీయ నౌకాదళంతో కలిసి కార్యకలాపాల పరంగా సమన్వయాన్ని పెంపొందించుకోవడంలో కూడా తోడ్పాటు లభిస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2219173) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil , Malayalam