ప్రధాన మంత్రి కార్యాలయం
దోడాలో జరిగిన ఘోర ప్రమాదంలో సైనికుల మరణంపై ప్రధానమంత్రి సంతాపం
प्रविष्टि तिथि:
22 JAN 2026 8:14PM by PIB Hyderabad
దోడాలో జరిగిన ఘోర ప్రమాదంలో వీర జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
దోడాలో జరిగిన దుర్ఘటనలో సైనికులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆవేదన చెందినట్లు ప్రధానమంత్రి తెలిపారు. దేశానికి వారు అందించిన సేవలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు.
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ప్రార్థించారు. బాధితులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తున్నామని ఆయన చెప్పారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.
“దోడాలో జరిగిన ప్రమాదం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ ఘటనలో మన వీర జవాన్లను కోల్పోయాం. దేశానికి వారు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాం.”
***
(रिलीज़ आईडी: 2217480)
आगंतुक पटल : 4