పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మరో 208 కర్బనోద్గార పరిశ్రమలకు హరితగృహ వాయు ఉద్గార తీవ్రత పరిమితులను నిర్దేశించిన ప్రభుత్వం

प्रविष्टि तिथि: 22 JAN 2026 3:04PM by PIB Hyderabad

కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ (సీసీటీఎస్కింద.. కర్బనోద్గారాలను అధికంగా వెలువరిస్తున్న పరిశ్రమలకు హరితగృహ వాయు ఉద్గార తీవ్రత (జీఈఐ) పరిమితులను భారత ప్రభుత్వం నిర్దేశించింది. 2026 జనవరి 13న విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా.. పెట్రోలియం రిఫైనరీలు, పెట్రోకెమికళ్లు, టెక్స్‌టైల్స్, సెకండరీ అల్యూమినియం రంగాలను భారత కార్బన్ మార్కెట్ (ఐసీఎం) నిబంధనల పరిధిలోకి తెచ్చారు.

ఈ రంగాలకు సంబంధించి, మొత్తం 208 కాలుష్య కారక సంస్థలు.. ఇకపై నిర్దేశించిన ఉద్గార తీవ్రత తగ్గింపు లక్ష్యాలను తప్పనిసరిగా చేరుకోవాల్సి ఉంటుంది. దీంతో దేశంలో అత్యంత ఉద్గార తీవ్రత కలిగిన పరిశ్రమలకు చెందిన 490 కాలుష్య కారక సంస్థలు ఇప్పుడు భారత కార్బన్ మార్కెట్ నిబంధనల పరిధిలోకి వచ్చాయి. ప్రభుత్వం మొదట 2025 అక్టోబరులో అల్యూమినియం, సిమెంటుక్లోర్-ఆల్కలీపల్ప్ - పేపర్ రంగాలకు చెందిన 282 కాలుష్య కారక సంస్థలకు ఈ ఉద్గార లక్ష్యాలను నిర్దేశించింది.

2023లో ప్రభుత్వం ప్రకటించిన సీసీటీఎస్.. భారత కార్బన్ మార్కెట్ పనితీరుకు విధివిధానాలను అందించింది. కార్బన్ క్రెడిట్ సర్టిఫికేట్ వర్తక యంత్రాంగం ద్వారా, ఉద్గారాలకు ధరలను నిర్ణయించి.. వివిధ రంగాల నుంచి వెలువడే హరితగృహ వాయు ఉద్గారాలను తగ్గించడం లేదా నివారించడం సీసీటీఎస్ లక్ష్యం.

సీసీటీఎస్ రెండు పద్ధతుల్లో పనిచేస్తుంది. ఒకటి నిబంధనల అమలు పద్ధతిరెండోది పరిహార పద్ధతి. నిబంధనల అమలు పద్ధతి కింద.. కాలుష్య కారక పరిశ్రమలు తమకు కేటాయించిన హరితగృహ వాయు ఉద్గార తీవ్రత (జీఈఐ) లక్ష్యాలను తప్పక చేరుకోవాలి. నిర్దేశిత లక్ష్యాల కన్నా తక్కువ కాలుష్యాన్ని వెలువరిచే సంస్థలు కార్బన్ క్రెడిట్ సర్టిఫికేట్లను పొందేందుకు అర్హత సాధిస్తాయి. లక్ష్యాలను చేరుకోలేకపోయిన ఇతర కాలుష్య కారక సంస్థలకు వారు ఈ సర్టిఫికెట్లను విక్రయించవచ్చు.

పరిశ్రమలతో ఏళ్ల తరబడి జరిపిన నిరంతర చర్చలు, కఠినమైన సాంకేతిక పరీక్షలు, వివిధ సంస్థలూ భాగస్వాముల సమన్వయ కృషికి.. ఈ పురోగతి నిదర్శనం. పరిశ్రమల పరిధి విస్తరించడం, నిబంధనల యంత్రాంగంలో పరిణతి వల్ల- దేశ దీర్ఘకాలిక వాతావరణ లక్ష్యాలు, ఉద్గార రహిత (నెట్ జీరో) పద్ధతులకు అనుగుణంగా పారిశ్రామికాభివృద్ధిని ముందుకు నడపడంలో ఐసీఎం కీలక పాత్ర పోషిస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2217348) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Gujarati , Tamil , Malayalam