రైల్వే మంత్రిత్వ శాఖ
ప్రజాదరణ చూరగొన్న వందే భారత్ స్లీపర్ రైలు
మొదటి రోజు ప్రయాణానికి టిక్కెట్లు అందుబాటులోకి వచ్చిన కొన్ని గంటల్లోనే అమ్ముడైన మొత్తం టిక్కెట్లు
प्रविष्टि तिथि:
20 JAN 2026 7:57PM by PIB Hyderabad
కామాఖ్య (కేవైక్యూ), హౌరా (హెచ్డబ్ల్యూహెచ్) మధ్య నడిచే వందేభారత్ స్లీపర్ రైలు (రైలు నెం. 27576) మొదటి రోజు ప్రయాణానికి ప్రయాణికుల నుంచి అపూర్వ స్పందన లభించింది. పీఆర్ఎస్, ఇతర సైట్ల ద్వారా టికెట్ రిజర్వేషన్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే అన్ని సీట్లు బుక్ అయ్యాయి. 2026 జనవరి 17న ప్రధానమంత్రి ప్రారంభించిన వందేభారత్ స్లీపర్ రైలు వేగాన్ని, సౌకర్యాన్ని, ఆధునిక వసతులను అనుభూతి చెందాలనే ప్రయాణికుల ఉత్సాహాన్ని వేగంగా అమ్ముడుపోయిన టిక్కెట్లు సూచిస్తున్నాయి.
ఈ రైలు మొదటి వాణిజ్య ప్రయాణం 2026 జనవరి 22 న కామాఖ్య నుంచి, 2026 జనవరి 23న హౌరా నుంచి మొదలవుతుంది. ఈ కొత్త రైలుకు టికెట్ల విక్రయం 2026 జనవరి 19న ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా, 24 గంటల వ్యవధిలోనే అన్ని తరగతుల టిక్కెట్లు పూర్తిగా అమ్ముడయ్యాయి. ఇది ప్రీమియం సెమీ హైస్పీడు సేవల పట్ల ప్రజల ఆసక్తిని తెలియజేస్తోంది.
వేగవంతమైన, సురక్షితమైన, మరింత సౌకర్యవంతమైన రైలు సేవలకు ప్రయాణికులు ఇస్తున్న ప్రాధాన్యాన్ని మొదటి వాణిజ్య ప్రయాణానికి వచ్చిన స్పందన తెలియజేస్తుంది. ఈశాన్య, తూర్పు భారత్ మధ్య అనుసంధానాన్ని ఈ కామాఖ్య-హౌరా వందేభారత్ స్లీపర్ రైలు మెరుగుపరుస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది ఆధునిక సౌకర్యాలు, తగ్గిన ప్రయాణ సమయం, ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.
భారతీయ రైల్వేలు అందిస్తున్న అత్యాధునిక రైలు సేవల పట్ల ప్రయాణికుల్లో పెరుగుతున్న నమ్మకాన్ని, ఆసక్తిని కొన్ని గంటల్లోనే పూర్తయిన టిక్కెట్ల విక్రయం చెబుతున్నది. ఈ ప్రాంతంలో ప్రీమియం రైలు ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ఇది సూచిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2216736)
आगंतुक पटल : 15