ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నిరంతర కృషి, పురోగతి స్ఫూర్తిని చాటే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని


మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 21 JAN 2026 9:28AM by PIB Hyderabad

ఈ రోజు అవతరణ దినోత్సవాన్ని జరుపుకొంటున్న మూడు ఈశాన్య రాష్ట్రాలు మణిపూర్, మేఘాలయ, త్రిపుర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ప్రాంత సోదరీ సోదరులందరికీ ప్రధానమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. స్వయంకృషితో ముందకు సాగుతూ  జీవన రంగంలోనూ విజయం సాధిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

నిరంతర కృషి, ప్రగతి స్ఫూర్తిని చాటే ఓ సంస్కృత సుభాషితాన్ని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రజలతో పంచుకున్నారు.

సంస్కృత శ్లోకం-

“చరైవేతి చరైవేతి చరన్వై మధు విందతి

సూర్యాస్య పశ్య శ్రేమాణం న మామార్ న జీర్యతి

నిరంతరం శ్రమించే వ్యక్తులే ప్రగతి ఫలపు మాధుర్యాన్ని ఆస్వాదించగలరు. అలుపు లేకుండాఅంతరాయం లేకుండా సూర్యుడు తన శక్తితో ప్రపంచానికి వెలుగులు పంచినట్టే.. మనం నిరంతరం ముందుకు సాగుతూ ఉండాలి- అని ఆ శ్లోకం వివరిస్తుంది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

ఈశాన్య రాష్ట్రాలు మణిపూర్, మేఘాలయ, త్రిపుర నేడు అవతరణ దినోత్సవాన్ని జరుపుకొంటున్నాయి.  ఈ సందర్భంగా ఆ రాష్ట్రాల సోదరీ సోదరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నిరంతర కృషితో జీవన రంగంలోనూ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.  

 

చరైవేతి చరైవేతి చరన్వై మధు విందతి

సూర్యాస్య పశ్య శ్రేమాణం న మామార్ న జీర్యతి.’’  


(रिलीज़ आईडी: 2216722) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam