కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా 887 ఏటీఎంల యాక్టివేషన్‌తో తపాలా విభాగం ఏటీఎమ్ వ్యవస్థ ఆధునికీకరణ

प्रविष्टि तिथि: 20 JAN 2026 3:43PM by PIB Hyderabad

బ్యాంకింగ్ సేవలను మరింత సులభంగా, వినియోగదారులకు అనుకూలమైనవిగా తీర్చిదిద్దే దిశగా తపాలా విభాగం ఓ ముఖ్య నిర్ణయం తీసుకుంది.. దేశమంతటా  ఏటీఎమ్ వ్యవస్థను నవీకరించింది.
వేర్వేరు పోస్టాఫీసుల్లో ఏర్పాటు చేసిన ఈ 887 ఏటీఎమ్‌లు పౌరులు తమకు అవసరమైన బ్యాంకింగ్ సేవల్ని వారి ఇళ్లకు దగ్గర్లోనే పొందడంలో తోడ్పడుతున్నాయి. ఈ కార్యక్రమం ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో, ఇంతవరకు బ్యాంకింగ్ సేవలకు నోచుకోకుండా ఉండిపోయిన ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ప్రయోజనకరంగా ఉంది. డిజిటల్ పరివర్తన మాధ్యమం ద్వారా ఆర్థిక సేవలను అందరికీ అందుబాటు లోకీ తీసుకువెళ్లాలన్న ప్రభుత్వ ఆశయం నెరవేరడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతోంది.
ఈ ఏటీఎమ్‌లను ఉపయోగించుకుని, కస్టమర్లు నగదును తీసుకోవడం, ఖాతాలో ఉన్న నిల్వ మొత్తాలను సరి చూసుకోవడం తో పాటు ఇతర ప్రాధమిక బ్యాంకింగ్ లావాదేవీలు పూర్తి చేసుకోగలుగుతారు.
పౌరులందరూ దేశం నలుమూలలా ఉన్న ఏటీఎమ్‌ల సేవలను అందుకోవాల్సిందిగా వారిని తపాలా విభాగం కోరుతోంది.

 

***


(रिलीज़ आईडी: 2216470) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil , Kannada