|
వరస నెం.
|
ఒప్పందాలు/ ఎంఓయూలు/ ఎల్ఓఎల్
|
లక్ష్యాలు
|
|
1
|
గుజరాత్ ప్రభుత్వం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (పెట్టుబడి మంత్రిత్వ శాఖ మధ్య ధోలేరా ప్రత్యేక పెట్టుబడి ప్రాంతం అభివృద్ధి కోసం పెట్టుబడి సహకారంపై ఉద్దేశ్య పత్రం
|
గుజరాత్ లోని ధోలేరా ప్రత్యేక పెట్టుబడి ప్రాంతం అభివృద్ధిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) భాగస్వామ్యంతో పెట్టుబడి సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడం. ఈ ప్రతిపాదిత భాగస్వామ్యంలో అంతర్జాతీయ విమానాశ్రయం, పైలట్ శిక్షణ పాఠశాల, విమానాల నిర్వహణ - మరమ్మతులు - పునర్నిర్మాణం (ఎంఆర్ఓ) సౌకర్యం, గ్రీన్‌ఫీల్డ్ పోర్టు, స్మార్ట్ పట్టణ నివాస ప్రాంతం, రైల్వే అనుసంధానం, అలాగే ఇంధన మౌలిక వసతుల అభివృద్ధి వంటి కీలక వ్యూహాత్మక మౌలిక సదుపాయాల అభివృద్ధి భాగంగా ఉంటుంది.
|
|
2
|
భారతదేశంలోని ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్ - స్పేస్), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతరిక్ష సంస్థ మధ్య అంతరిక్ష పరిశ్రమ అభివృద్ధి ,వాణిజ్య సహకారాన్ని సాధ్యం చేసే సంయుక్త కార్యక్రమం కోసం ఉద్దేశ్య పత్రం (లెటర్ ఆఫ్ ఇంటెంట్)
|
అంతరిక్ష రంగంలో సంయుక్త మౌలిక వసతుల అభివృద్ధి, వాణిజ్యీకరణ కోసం భారత్ - యూఏఈ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం. ఇందులో ప్రయోగ సముదాయాలు (లాంచ్ కాంప్లెక్సులు), తయారీ, సాంకేతిక జోన్లు, అంతరిక్ష స్టార్టప్‌ల కోసం ఇన్‌క్యూబేషన్ కేంద్రం, యాక్సిలరేటర్, శిక్షణ సంస్థ, అలాగే శిక్షణా మార్పిడి కార్యక్రమాలు భాగంగా ఉంటాయి.
|
|
3
|
భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యంపై ఉద్దేశ్య పత్రం (లెటర్ ఆఫ్ ఇంటెంట్)
|
వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్య కార్యాచరణ ఒప్పందాన్ని ఏర్పాటు చేయడం కోసం కలిసి పనిచేయడం. రక్షణ పరిశ్రమ భాగస్వామ్యం, రక్షణ ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికత, శిక్షణ, విద్య, సిద్ధాంతం, ప్రత్యేక ఆపరేషన్లు పరస్పర నిర్వహణ, సైబర్ స్పేస్, ఉగ్రవాద నిరోధం వంటి అనేక రంగాల్లో రక్షణ సహకారాన్ని విస్తరించడం.
|
|
4
|
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్), అబూ ధాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ గ్యాస్ (ఏడీఎన్ఓసీ జీఏఎస్) మధ్య విక్రయాలు, కొనుగోలు ఒప్పందం (సేల్స్ అండ్ పర్చేజ్ అగ్రిమెంట్ -(ఎస్పీఏ)
|
ఈ దీర్ఘకాలిక ఒప్పందం ప్రకారం, 2028 నుంచి ప్రారంభమై 10 సంవత్సరాల కాలానికి HPCL సంస్థ ఏడీఎన్ఓసీ గ్యాస్ నుంచి హెచ్పీసీఎల్ సంవత్సరానికి 0.5 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంపీటీఏ) ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) ను కొనుగోలు చేస్తుంది.
|
|
5
|
భారత వాణిజ్య, పరిశ్రమలమంత్రిత్వ శాఖకు చెందిన వ్యవసాయ,ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (అపెడా), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాతావరణ మార్పు, పర్యావరణ మంత్రిత్వ శాఖ మధ్య ఆహార భద్రత, సాంకేతిక అవసరాలపై అవగాహన ఒప్పందం (ఎంఓయూ)
|
ఈ అవగాహన ఒప్పందం ఆహార రంగంలో వాణిజ్యం, పరస్పర మార్పిడి, సహకారాన్ని పెంపొందించడానికి అవసరమైన ఆరోగ్య, నాణ్యతా ప్రమాణాలను (నిర్దేశిస్తుంది. ఇది భారతదేశం నుంచి న యూఏఈకి బియ్యం, ఇతర ఆహార ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తుంది. దీనివల్ల భారతీయ రైతులకు లబ్ధి చేకూరడమే కాకుండా, యూఏఈ ఆహార భద్రతకు ఎంతగానో దోహదపడుతుంది.
|
|
వరస నెం.
|
ప్రకటనలు
|
లక్ష్యాలు
|
|
6
|
భారతదేశంలో సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్ ఏర్పాటు
|
భారతదేశానికి చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ- డీఏసీ), యూఏఈకి చెందిన జీ -42 సంస్థ కలిసి భారతదేశంలో ఒక సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి సూత్రప్రాయ అంగీకారం.
|
|
7
|
ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2032 నాటికి రెట్టింపు (200 బిలియన్ డాలర్లు) చేయాలని లక్ష్యం
|
2032 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $200 బిలియన్లకు పైగా రెట్టింపు చేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఇరు దేశాలలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను అనుసంధానించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అలాగే భారత్ మార్ట్, వర్చువల్ ట్రేడ్ కారిడార్, భారత్-ఆఫ్రికా సేతు వంటి కార్యక్రమాల ద్వారా కొత్త మార్కెట్లను ప్రోత్సహించాలని నిర్ణయించారు.
|
|
8
|
పౌర అణుశక్తి రంగంలో ద్వైపాక్షిక సహకారం పెంపు
|
సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా (శాంతి) చట్టం 2025 ద్వారా వచ్చిన కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి, అధునాతన అణు సాంకేతిక పరిజ్ఞానాలలో భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడానికి అంగీకారం కుదిరింది. ఇందులో పెద్ద అణు రియాక్టర్లు, చిన్న మాడ్యులర్ రియాక్టర్ల (ఎస్ఎంఆర్) అభివృద్ధి, విస్తరణ, అడ్వాన్స్ రియాక్టర్ సిస్టమ్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కార్యకలాపాలు, నిర్వహణ, అణు భద్రతలో సహకారం ఉన్నాయి.
|
|
9
|
గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో యూఏఈకి చెందిన ప్రముఖ సంస్థలైన ఫస్ట్ అబుదాబి బ్యాంక్ (ఎఫ్ఏబీ), డిపి వరల్డ్ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసి, కార్యకలాపాలను ప్రారంభించడానికి అంగీకారం
|
ఫస్ట్ అబుదాబి బ్యాంక్ గిఫ్ట్ సిటీలో ఒక శాఖను ఏర్పాటు చేస్తుంది. ఇది వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను పెంపొందిస్తుంది. అలాగే డిపి వరల్డ్ తన గ్లోబల్ కార్యకలాపాల కోసం ఓడలను లీజుకు తీసుకోవడం వంటి సేవలతో సహా తన కార్యకలాపాలను గిఫ్ట్ సిటీ నుంచి నిర్వహిస్తుంది.
|
|
10
|
డిజిటల్/డేటా ఎంబసీల' ఏర్పాటుపై అవకాశాల అన్వేషణ
|
పరస్పర ఆమోదం పొందిన సార్వభౌమత్వ ఏర్పాట్ల ప్రకారం, 'డిజిటల్ ఎంబసీలను' ఏర్పాటు చేసే అవకాశాన్ని అన్వేషించడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి.
|
|
11
|
అబుదాబిలో 'హౌస్ ఆఫ్ ఇండియా' ఏర్పాటు
|
అబుదాబిలో భారతీయ కళలు, వారసత్వం, పురావస్తు ప్రదర్శనశాలతో (మ్యూజియం) కూడిన సాంస్కృతిక కేంద్రాన్ని ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ఏర్పాటు చేయడానికి రెండు దేశాల మధ్య సూత్రప్రాయంగా అంగీకారం
|
|
12
|
యువత పరస్పర పర్యటనలకు ప్రోత్సాహం."
|
భవిష్యత్ తరాల మధ్య అవగాహనను పెంపొందించడానికి, విద్యా, పరిశోధనా రంగాలలో సహకారాన్ని పెంపొందించడానికి, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఇరు దేశాల నుంచి యువ ప్రతినిధివర్గాల పర్యటనలను ఏర్పాటు చేసే దిశగా కృషి చేయడానికి సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది.
|