రైల్వే మంత్రిత్వ శాఖ
బుల్లెట్ రైలు ప్రాజెక్టును సాకారం చేస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’
ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో వేగంగా సాగుతున్న
ఓవర్‌హెడ్ విద్యుదీకరణలో భాగంగా స్తంభాల ఏర్పాటు: అశ్వినీ వైష్ణవ్
प्रविष्टि तिथि:
19 JAN 2026 8:03PM by PIB Hyderabad
ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కారిడార్ వెంబడి ఓవర్‌హెడ్ విద్యుదీకరణలో భాగంగా స్తంభాల ఏర్పాటు పనులు వేగంగా సాగుతున్నాయి. భారత తొలి హై-స్పీడ్ రైలు వ్యవస్థకు విద్యుత్ ట్రాక్షన్‌ను ప్రారంభించే దిశగా ఈ అభివృద్ధి ఒక కీలక ముందడుగును సూచిస్తుంది. 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం ఆధారంగా స్థిరమైన క్షేత్రస్థాయి అమలును ఇది ప్రతిబింబిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైన హై-స్పీడ్ రైలు సాంకేతికతను అవలంబిస్తూనే... ఇది దేశీయ తయారీ సామర్థ్యాలను బలపరుస్తుంది.
సురక్షితమైన, సమర్థమైన హై-స్పీడ్ రైలు కార్యకలాపాలకు మద్దతునివ్వడం కోసం వయాడక్ట్ స్ట్రెచ్‌లు సహా అలైన్‌మెంట్‌లోని కీలక విభాగాల్లో ఓవర్‌హెడ్ విద్యుదీకరణ స్తంభాల ఏర్పాటు జరుగుతోంది. కారిడార్‌లో నడుస్తున్న బుల్లెట్ రైళ్లకు విశ్వసనీయ విద్యుత్ సరఫరా కోసం అవసరమైన మౌలిక సదుపాయాల్లో ఈ స్తంభాలు కీలక భాగంగా ఉన్నాయి.
ఓహెచ్ఈ స్తంభాలను భూమి నుంచి గణనీయమైన ఎత్తులో ఉన్న ఎలివేటెడ్ వయాడక్ట్‌లపై ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంమీద ఈ కారిడార్ పొడవునా 9.5 నుంచి 14.5 మీటర్ల ఎత్తు ఉన్న 20,000 కంటే ఎక్కువ స్తంభాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్తంభాలు బుల్లెట్ రైలు కార్యకలాపాలకు అవసరమైన ఓవర్‌హెడ్ వైర్లు, ఎర్తింగ్ ఏర్పాట్లు, ఫిట్టింగ్‌లు, ఇతర అనుబంధ పరికరాలు సహా పూర్తి 2×25 kV ఓవర్‌హెడ్ ట్రాక్షన్ పవర్ సిస్టమ్‌కు మద్దతునిస్తాయి.
నిరంతర ట్రాక్షన్ పవర్‌ను నిర్ధారించేందుకు వీలుగా ముంబయి-అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ వెంబడి ట్రాక్షన్ సబ్‌స్టేషన్లు (టీఎస్ఎస్), డిస్ట్రిబ్యూషన్ సబ్‌స్టేషన్ల (డీఎస్ఎస్) నెట్‌వర్క్‌నూ అభివృద్ధి చేస్తున్నారు.
ఓహెచ్ఈ స్తంభాలు రైల్వే ట్రాక్‌ల పక్కన ఏర్పాటు చేసే నిలువు ఉక్కు నిర్మాణాలు. ఇవి ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ వైర్లకు మద్దతునిస్తాయి. అవి వైర్ల కోసం సరైన ఎత్తు, సరైన అమరిక, తగినంత తన్యతను నిర్వహిస్తాయి. ఎలక్ట్రిక్ రైళ్లకు నిరంతర, సురక్షిత విద్యుత్ సరఫరాను అనుమతిస్తాయి.
ఈ పనులు పూర్తయితే... ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు రెండు నగరాల మధ్య ప్రయాణాన్ని మరింత వేగవంతం, సౌకర్యవంతం చేస్తుంది. అదే సమయంలో కారిడార్ అంతటా కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఉద్యోగాల కల్పనతో పాటు తయారీ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా ప్రయాణికులకు, స్థానిక ఆర్థిక వ్యవస్థలకు, భారతీయ పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. అధునాతన రైల్వే సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం... దేశంలో ప్రపంచ స్థాయి రైల్వే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం దిశగా కీలక ముందడుగును ఇది సూచిస్తుంది.
****
(रिलीज़ आईडी: 2216297)
आगंतुक पटल : 11