ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సాహవంతులైన సిబ్బందికి ప్రధానమంత్రి వందనం

నాడు పోస్టు చేయడమైనది: 19 JAN 2026 9:30AM by PIB Hyderabad

జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, ఆ దళంలోని సిబ్బంది చూపే ధైర్యసాహసాలను, అంకితభావాన్ని, నిస్వార్థ సేవలను ప్రశంసించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన ఇలా పేర్కొన్నారు:

"సంక్షోభ సమయాల్లో అంచంచలమైన ధైర్యం, వృత్తి ధర్మాన్ని పాటిస్తూ సేవలందిస్తున్న ఎన్‌డీఆర్ఎఫ్ దళంలోని పురుషులు, మహిళా సిబ్బందికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్ఎఫ్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఆపద సమయంలో ఎల్లప్పుడూ ముందుండే ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది, అత్యంత కఠినమైన పరిస్థితుల్లోనూ ప్రాణాలు కాపాడేందుకు, సహాయం అందించేందుకు, బాధితుల్లో విశ్వాసం కలిగించేందుకు అవిశ్రాతంగా కృషి చేస్తారు. అత్యున్నత సేవా ప్రమాణాలకు వారి నైపుణ్యం, కర్తవ్య నిర్వహణ నిదర్శనం. కొన్నేళ్లుగా.. విపత్తు సన్నద్దత, ప్రతిస్పందనలో ఎన్‌డీఆర్ఎఫ్ ఒక శక్తిగా ఎదిగి, అంతర్జాతీయంగా ఎంతో గౌరవాన్ని సంపాదించుకుంది.

@NDRFHQ”


(రిలీజ్ ఐడి: 2216092) సందర్శకుల సూచీ సంఖ్య : : 64