ప్రధాన మంత్రి కార్యాలయం
అస్సాంలోని గౌహతిలో తాను పాల్గొన్న బాగురుంబా ధహోవ్ కార్యక్రమ విశేషాలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
17 JAN 2026 11:50PM by PIB Hyderabad
గౌహతిలోని సారుసజై స్టేడియంలో బోడో సమాజ గొప్ప వారసత్వాన్ని చాటే చరిత్రాత్మక సాంస్కృతిక కార్యక్రమం బగురుంబా దహోవ్-2026లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఆ కార్యక్రమ విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
‘ఎక్స్’వేదికగా చేసిన వరుస పోస్టుల్లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
"గౌహతిలోని నా సోదరీ సోదరులతో కలిసి బగురుంబా దహోవ్ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవం. ఈ కార్యక్రమం అద్భుతమైన బోడో సంస్కృతిని ప్రదర్శించింది. ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ నా అభినందనలు."
"బాగురుంబా దహోవ్ కార్యక్రమం ఫోటోలు కొన్ని ఇక్కడ ఉన్నాయి."
“బోడో సంస్కృతీ సంప్రదాయాలను చాటే గొప్ప కార్యక్రమానికి హాజరైనందుకు గర్వంగా ఉంది!”
"మన అస్సాం సంస్కృతి యావత్ దేశానికే గర్వకారణం. రాష్ట్ర గొప్ప వారసత్వాన్ని, మహోన్నత వ్యక్తిత్వాలను గౌరవించడం ఒక గౌరవం."
"అస్సాంలో విభిన్న రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిని దేశం మొత్తం ఎంతో ఆరాధిస్తోంది."
"తమ సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం, కాంగ్రెస్ ఎల్లప్పుడూ అస్సాంలో అస్థిరతను ప్రోత్సహిస్తూనే ఉంది. ప్రజలకు సేవ చేయడానికి బదులుగా వారు చొరబాటుదారులను స్వాగతించడంపై దృష్టి పెట్టారు."
"కాంగ్రెస్ ఎప్పుడూ అస్సాంను, మొత్తం ఈశాన్య ప్రాంతాన్నీ నిర్లక్ష్యం చేసింది’’.
దీనికి విరుద్ధంగా... ఎన్డీఏ ప్రభుత్వం భావోద్వేగ దూరాలను తగ్గించడమే కాకుండా మెరుగైన మౌలిక సదుపాయాల ద్వారా ఈ మొత్తం ప్రాంతాన్ని అభివృద్ధితో అనుసంధానించింది."
"గౌహతిలో నిర్వహించిన బగురుంబా దహోవ్ కార్యక్రమం నిజంగా అద్భుతం!"
"ఈ రోజు, అస్సాంలో రూప్కోన్వర్ జ్యోతి ప్రసాద్ అగర్వాలా గౌరవార్థం సిల్పీ దివస్ జరుపుకుంటారు. ఆయన అస్సాం సాంస్కృతిక రంగ ప్రముఖులు. ఆయన రచనలు అస్సామీ ప్రజల మనస్సుల్లో శాశ్వత ముద్ర వేశాయి. నాటక రంగం, సినిమాలు, సంగీతం, ఇతర సాంస్కృతిక రంగాల్లో అనేక మంది రాణించేందుకు ఆయన జీవితం స్ఫూర్తిని అందించింది’’
‘‘గౌహతిలో జరిగిన కార్యక్రమంలో నేను ఆయనకు నివాళులర్పించాను.”
***
(रिलीज़ आईडी: 2215891)
आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam