ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గువహటిలో సంప్రదాయ బోడో సాంస్కృతిక కార్యక్రమం ‘బకురుంబా దహోవ్’ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 17 JAN 2026 8:47PM by PIB Hyderabad

నమస్కారంఖులుంబై!

ఏమిటి సంగతులు..? ముందుగా మాఘ బిహు పర్వదినం.. మాఘ దోమాహి సందర్భంగా మీకందరికీ హృదయపూర్వకప్రేమాన్విత శుభకామనలు!

అస్సాం గవర్నర్‌ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యశాసనసభ స్పీకర్‌ శ్రీ బిశ్వజిత్ దైమరీముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మకేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ సర్బానంద సోనోవాల్శ్రీ పబిత్రా మార్గిరిటాబోడోలాండ్ ప్రాదేశిక పాలన మండలి ముఖ్య కార్యనిర్వాహక సభ్యుడు శ్రీ హగ్రామా మోహిలరిరాష్ట్ర మంత్రులుఅస్సాంలోని నా విశిష్ట సోదరీసోదరులారా!

అస్సాం సంస్కృతినిబోడో సంప్రదాయాలను సన్నిహితంగా పరిశీలించే అవకాశం కలగడం నిజంగా నా అదృష్టంఈ రాష్ట్రంలో అత్యధికంగా పర్యటించిన ప్రధానమంత్రి ఇంతకుముందు మరెవరూ లేరుఅస్సాం కళాసాంస్కృతిక రంగాలకు ఒక ప్రధాన వేదిక లభించాలన్నది ఎప్పటినుంచో నా ఆకాంక్షవైభవోపేత కార్యక్రమాల నిర్వహణ ద్వారా జాతీయంగాఅంతర్జాతీయంగా ఈ రాష్ట్రానికి తగిన గుర్తింపు లభించాలిఈ దిశగా లోగడ ఎంతగానో కృషి చేశాంభారీ స్థాయిలో నిర్వహించే బిహు వేడుక సంబంధిత కార్యక్రమాలైనాఝుమైర్ బినోదిని ప్రదర్శన అయినాఏడాదింబావు కిందట ఢిల్లీలో నిర్వహించిన భారీ బోడోలాండ్ ఉత్సవం లేదా ఇతర సాంస్కృతిక కార్యక్రమం ఏదైనప్పటికీఅస్సాం కళాసంస్కృతుల అద్భుత సమ్మేళనాన్ని ఆస్వాదించే ఏ ఒక్క అవకాశాన్నీ నేను జారవిడవనుఅందుకేబోడో ప్రతిష్ఠకు సజీవ నిదర్శనమైన ఇవాళ్టి బకురుంబా ఉత్సవంలో భాగస్వామినయ్యానుబోడో సమాజంతోపాటు అస్సాం సాంస్కృతిక వారసత్వానికి ఈ వేడుక ఒక గౌరవంఇందులో పాలుపంచుకుంటున్న ప్రజలందరికీముఖ్యంగా కళాకారులకు నా శుభాకాంక్షలుఅభినందనలు తెలుపుతున్నాను.

మిత్రులారా!

బకురుంబా దహోవ్’ ఒక పండుగకు పరిమితం కాదు... ఇదొక మాధ్యమంమన సుసంపన్న బోడో సంప్రదాయాన్ని గౌరవించేఈ సమాజంలోని గొప్ప వ్యక్తులను సంస్మరించుకునే మాధ్యమంబోడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మగురుదేవ్ కాళీచరణ్ బ్రహ్మరూపనాథ్ బ్రహ్మసతీష్ చంద్ర బసుమతారిమొరదం బ్రహ్మకంకేశ్వర్ నార్జరీ వంటి ఎందరెందరో మహనీయులు సామాజిక సంస్కరణలకుసాంస్కృతిక పునరుజ్జీవనానికిరాజకీయ చైతన్యానికి ఎనలేని శక్తిని చేకూర్చారుఈ నేపథ్యంలో ఆ మహానుభావులందరికీ నా గౌరవపూర్వక నమస్సులు.

మిత్రులారా!

అస్సాం సంస్కృతిని యావద్భారతానికి గర్వకారణంగా బీజేపీ పరిగణిస్తుందిఅస్సాం గతంచరిత్రతోనే ఈ దేశ చరిత్ర పరిపూర్ణం కాగలదనడంలో సందేహం లేదుకాబట్టేబీజేపీ ప్రభుత్వ హయాంలో బకురుంబా దహొ వంటి గొప్ప ఉత్సవాలు నిర్వహిస్తారుబిహు వేడులకు జాతీయ గుర్తింపు లభించడం తథ్యంఇప్పటికే మన కృషివల్ల ‘చరాయిదేవ్ మొయిదాం’ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో స్థానం సంపాదించిందిఅలాగేఅస్సామీ భాషకు ప్రాచీన భాష హోదా లభించింది.

సోదరీసోదరులారా!

బోడో భాషకు మేం అస్సాం రాష్ట్ర సహ-అధికార భాష హోదా కూడా ఇచ్చాంఈ భాషలో విద్యాబోధనను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రత్యేక డైరెక్టరేట్‌ను కూడా ఏర్పాటు చేశాంమా నిబద్ధత ఫలితంగా బాథౌ మతానికి సగౌరవ గుర్తింపు లభించడమేగాక బాథౌ పూజ రోజును రాష్ట్ర సెలవుదినంగా ప్రకటించాంఏ ప్రభుత్వ హయాంలోనైతే అసమాన స్వాతంత్ర్యసమర యోధుడు లచిత్ బోర్ఫుకాన్ భారీ విగ్రహం ప్రతిష్ఠితమైందోబోడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మ విగ్రహావిష్కరణ జరిగిందో అది కేవలం బీజేపీ ప్రభుత్వం మాత్రమేఅదేవిధంగా శ్రీమంత శంకరదేవ్ భక్తి-సామాజిక సామరస్య సంప్రదాయంజ్యోతి ప్రసాద్ అగర్వాలా కళ-చైతన్యం ఒక్కటేమిటి... అస్సాం సంబంధిత ప్రతి వారసత్వాన్నిప్రతిష్ఠను గౌరవించే అదృష్టం తనకు దక్కిందని బీజేపీ ప్రభుత్వం భావిస్తుందియాదృచ్ఛికంగా ఈ రోజు శ్రీ జ్యోతి ప్రసాద్ అగర్వాలా వర్ధంతి కూడా.. ఈ సందర్భంగా ఆయనకు నా వినమ్ర నివాళి అర్పిస్తున్నాను.

మిత్రులారా!

నేనివాళ ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో నా మదిలో ఎన్నో ఆలోచనలు మెదలుతున్నాయినా అస్సాం రాష్ట్రం ఇంతగా ముందడుగు వేస్తుండటాన్ని తలచుకుంటే నాలో ఆనందోద్వేగాలు పొంగుతున్నాయిఒకనాడు నిత్య రక్తసిక్త ప్రాంతంగా పేరుపడిన ఈ రాష్ట్రంలో నేడు సంస్కృతీ సప్తవర్ణ రంజితమైఅందర్నీ రంజింపజేస్తోందిఒకప్పటి తుపాకుల మోత సద్దుమణిగిసుమధుర ఖామ్సిఫుంగ్ వాద్యనాదాలు వీనులవిందుగా వినిపిస్తున్నాయిఆనాటి కర్ఫ్యూ వాతావరణంలో నిశ్శబ్దం తాండవించిన చోటఇవాళ సంగీత స్వరాలు ప్రతిధ్వనిస్తున్నాయినాటి అశాంతిఅస్థిరతల స్థానంలో  ఈ రోజున బకురుంబా వంటి ఆకర్షణీయ ఉత్సవాల సందడి నెలకొందిఇంత గొప్ప కార్యక్రమం అస్సాం విజయం మాత్రమే కాదు.. ఇది యావద్భారతానికీ చెందుతుందిఅస్సాంలో వచ్చిన ఈ మార్పులు చూసి దేశంలోని ప్రతి పౌరుడూ గర్విస్తున్నాడు.

మిత్రులారా!

ఈ విషయంలో నా అస్సామీ ప్రజలు.. నా బోడో సోదరీసోదరులు నాపై విశ్వాసం ప్రకటించడం నాకెంతో సంతృప్తినిస్తోందిశాంతిప్రగతి సాధన కోసం మీరు మా ద్వంద్వ సారథ్య ప్రభుత్వానికి అప్పగించిన బాధ్యతను మీ ఆశీస్సులతో మేం నెరవేర్చాంరాష్ట్రంలో ఇరవయ్యేళ్లుగా కొనసాగుతున్న సంఘర్షణకు 2020 నాటి బోడో శాంతి ఒప్పందం భరతవాక్యం పలికిందిఈ ఒప్పందం అనంతరం ప్రజల్లో నమ్మకం పునఃప్రతిష్టితమై వేలాది యువత హింసా మార్గం వీడి జనజీవన ప్రధాన స్రవంతిలో భాగమయ్యారుఈ ఒప్పందం తర్వాత బోడో ప్రాంతంలో అభివృద్ధికివిద్యావ్యాప్తికి కొత్త అవకాశాలు అందివచ్చాయిశాంతియుత వాతావరణ శాంతిభద్రతలకు మాత్రమే పరిమితం కాకుండా దైనందిన జీవితంలో అందర్భాగమైందిఈ విజయంలో ఆద్యంతం మీరంతా చేసిన కృషి అత్యంత కీలక పాత్ర పోషించింది.

మిత్రులారా!

అస్సాం శాంతికిఅభివృద్ధికిప్రతిష్ఠకు కేంద్ర బిందువుగా ఉన్నదెవరంటేసాక్షాత్తూ అస్సాం యువతరమేశాంతి స్థాపన కోసం వారెంచుకున్న పరిష్కారాన్ని మనమంతా ఒక్కటై ఉజ్వల భవిత వైపు నడిపించాలిఅందుకేశాంతి ఒప్పందం కుదిరిన నాటినుంచీ బోడోలాండ్ అభివృద్ధికి మా ప్రభుత్వం నిరతం కృషి చేస్తోందిముందుగా పునరావాస ప్రక్రియను వేగిరపరచివేలాది యువతకు రూ.కోట్లలో ఆర్థిక సహాయం అందించడంతో వారంతా కొత్త జీవితాన్ని ప్రారంభించగలిగారు!

మిత్రులారా!

బీజేపీ ప్రభుత్వ కృషి ఫలితం నేడు మనందరి కళ్లముందు కనిపిస్తోందిప్రతిభావంతులైన నా బోడో యువతరం నేడు అస్సాం సాంస్కృతిక రాయబారులయ్యారుక్రీడా రంగంలోనూ వారు దేశానికి కీర్తిని సముపార్జించారుసరికొత్త స్వప్నాలను ఆత్మవిశ్వాసంతో ఊహించగలగడమే కాకుండా వాటిని సాకారం చేసుకుంటూఅస్సాం పురోగమన వేగం పెంచుతున్నారు.

మిత్రులారా!

అస్సాం కళా-సంస్కృతులనుప్రతిష్ఠను మనం గౌరవించడం చూసికొందరు ఇబ్బంది పడుతున్నారుఈ రాష్ట్రానికి గౌరవం దక్కడాన్ని ఇష్టపడని పార్టీ ఏదో మీకందరికీ తెలుసు కదానిజమే... అది కచ్చితంగా కాంగ్రెస్ పార్టీయేశ్రీ భూపేన్ హజారికాకు ‘భారతరత్న’ పురస్కరాన్ని వ్యతిరేకించింది... కాంగ్రెస్ పార్టీఅస్సాంలో సెమీకండక్టర్ యూనిట్‌ ఏర్పాటుకు ఇచ్చగించనిది ఎవరుకర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడి కుమారుడే!

మిత్రులారా!

నేనివాళ ఈ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే గమోచా (కండువా)ను మెడలో ధరించడం చూసి అస్సాంను అపహాస్యం చేసేది ఏ పార్టీ...? కాంగ్రెస్ పార్టీయే.

సోదరీసోదరులారా!

అస్సాంబోడోలాండ్ ప్రాంతం దశాబ్దాలుగా ప్రధాన ప్రగతి స్రవంతికి దూరమైందంటే అందుకు బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేరాజకీయ ప్రయోజనాల కోసం అస్సాంలో అస్థిరతను సృష్టించిరాష్ట్రాన్ని హింసాగ్రిగుండంలోకి తోసిందిస్వాతంత్ర్యం తర్వాత కూడా అస్సాం ఎన్నో సవాళ్లతో కునారిల్లిందికానీవాటి పరిష్కారానికి కాంగ్రెస్ చేసిందేమిటివాటిని తీర్చడానికి బదులు తన రాజకీయ పబ్బం గడిచే నిమిత్తం వాడుకుందిప్రజల మధ్య విశ్వాసం పెంచాల్సిన అవసరాన్ని పక్కకు నెట్టివిభజనకు ఆజ్యం పోసిందిచర్చలు అవసరమైన సమయంలో సౌహార్ద సంభాషణ మార్గాలను మూసివేసిందిముఖ్యంగా.. బోడోలాండ్ ప్రజల గళాన్ని ఎన్నడూ వినిపించుకున్నది లేదుతన ప్రజల గాయాలను మాన్పాల్సిన స్థితిలోవారికి సేవ చేయాల్సిన బాధ్యతను విస్మరించిచొరబాటుదారులకు అస్సాం తలుపులు తెరిచింది.

మిత్రులారా!

అస్సాం ప్రజలను కాంగ్రెస్‌ తమవారుగా పరిగణించదు సరికదా... వారికి విదేశీ చొరబాటుదారులంటేనే ఎంతో ఇష్టంఎందుకంటేఆ చొరబాటుదారులే కాంగ్రెస్‌కు గట్టి ఓటు బ్యాంకుగా మారుతున్నారుకాబట్టేఆ పార్టీ పాలనలో విదేశీ చొరబాటుదారుల ప్రవాహానికి అడ్డుకట్టలు లేనేలేవువీరంతా అస్సాంలోని లక్షల ఎకరాల భూమిని ఆక్రమించుకుంటుండగాకాంగ్రెస్ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తూ వచ్చిందికానీఇవాళ శ్రీ హిమంత ప్రభుత్వం లక్షల ఎకరాల భూమిని చొరబాటుదారుల నుంచి విముక్తం చేసిఅస్సాం ప్రజలకు అప్పగించడం నాకెంతో సంతోషాన్నిస్తోంది.

మిత్రులారా!

అస్సాంపై కాంగ్రెస్ సదా శీతకన్ను వేసింది... ఆ మాటకొస్తే ఈశాన్య ప్రాంతం మొత్తాన్నీ తన ఉదాసీనతకు బలిచేసిందిఈ ప్రాంత అభివృద్ధి అవశ్యమని భావించని ఆ కాంగ్రెస్ పార్టీకి అస్సాం ప్రగతిపై శ్రద్ధ ఎందుకుంటుందిబోడో ప్రజల ఆశలుఆకాంక్షల గురించి ఆలోచించే తీరిక వారికెక్కడిదికాంగ్రెస్ ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాంతాన్ని సమస్యల్లోకి నెట్టాయి.

సోదరీసోదరులారా!

కాంగ్రెస్‌ హయాంనాటి పాపాలను మా ద్వంద్వ సారథ్య ప్రభుత్వం ప్రక్షాళన చేస్తోందిఈ రాష్ట్రంలో ఇవాళ అభివృద్ధి వేగం ఎలాంటిదో మీ కళ్ల ముందే ఉందిబోడో-కచారి సంక్షేమ స్వయంప్రతిపత్తి మండలిని మేం ఏర్పాటు చేశాంఆ ప్రాంతంలో  అభివృద్ధిని వేగిరపరుస్తూ రూ.1500 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాంకోక్రాఝార్‌లో వైద్య కళాశాలఆసుపత్రి ప్రారంభమయ్యాయితముల్పూర్‌లో వైద్య కళాశాల నిర్మాణం కూడా వేగం పుంజుకుందినర్సింగ్ కళాశాలలుపారా-మెడికల్ సంస్థల ఏర్పాటుతో యువతకు కొత్త అవకాశాలు అందివస్తున్నాయిగోబర్ధనపర్బత్‌ఝారాహొరిసింగా వంటి ప్రాంతాల్లో పాలిటెక్నిక్సాంకేతిక శిక్షణ సంస్థలు కూడా నిర్మితమయ్యాయి.

మిత్రులారా!

బోడోలాండ్ కోసం ప్రత్యేక సంక్షేమ శాఖతోపాటు బోడోలాండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీని కూడా ఏర్పాటు చేశాంబోడో సమాజ సంక్షేమం కోసం మెరుగైన విధానాల రూపకల్పనలో ఇది తోడ్పాటునిస్తుంది.

మిత్రులారా!

బీజేపీ ప్రభుత్వం హృదయాల మధ్య అంతరాన్ని మాత్రమే కాదు... అస్సాం-ఢిల్లీ మధ్య దూరాన్ని కూడా తగ్గించిందిమౌలిక సదుపాయాల మెరుగు ద్వారా అస్సాంలో వివిధ ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గిస్తోందిమునుపటి దుర్గమ ప్రాంతాల్లో నేడు జాతీయ రహదారులు నిర్మాణం సాగుతోందిఈ రహదారులన్నిటి వల్లా కొత్త అవకాశాలకు తలుపులు తెరుచుకుంటాయికోక్రాఝార్‌ను భూటాన్ సరిహద్దుతో కలిపే బిష్మురి-సరళ్పారా రహదారి నిర్మాణానికి రూ.కోట్లలో నిధులు కేటాయించాంకోక్రాఝార్ నుంచి భూటాన్‌లోని గెలెఫు వరకూ ప్రతిపాదిత రైలు మార్గం కూడా మరో కీలక ముందడుగుదీన్ని మేమొక ప్రత్యేక రైల్వే ప్రాజెక్టుగా ప్రకటించి, ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో కీలక భాగం చేశాంఇది పూర్తయితే వాణిజ్యంపర్యాటక రంగాలు రెండింటికీ ప్రోత్సాహం లభిస్తుంది.

మిత్రులారా!

ఒక సమాజం తన మూలాలకు అనుసంధానితమైచర్చలు-విశ్వాసం బలోపేతమైప్రతి వర్గానికీ  సమాన అవకాశాలు లభించినపుడు సానుకూల మార్పులు తథ్యంనేడు అస్సాంబోడోలాండ్ ప్రయాణం ఆ దిశలోనూ సాగుతోందిఅస్సాం ఆత్మవిశ్వాసం.. సామర్థ్యం.. పురోగమనం నుంచి దేశవృద్ధి ప్రస్థానానికి సరికొత్త బలం చేకూరుతోందిదేశంలో వేగంగా పురోగమించే రాష్ట్రాల్లో ఈ రోజు అస్సాం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుండగారాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుంటోందిఈ అభివృద్ధిలో.. ఈ రూపాంతరీకరణలో బోడోలాండ్ సహా అస్సాం ప్రజలంతా కీలక పాత్ర పోషిస్తున్నారుఈ నేపథ్యంలో నేటి ఈ కార్యక్రమంపై మీకందరికీ మరోసారి అనేకానేక శుభాకాంక్షలు తెలుపుతూధన్యవాదాలు అర్పిస్తున్నాను.

 

***


(रिलीज़ आईडी: 2215889) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Gujarati , Kannada