ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారతీయ యువత అసమాన సామర్థ్యం, అంకితభావానికి ప్రధాని ప్రశంస


జనవరి 12న ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’లో యువ నాయకులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం

प्रविष्टि तिथि: 10 JAN 2026 8:20AM by PIB Hyderabad

భారతీయ యువత స్ఫూర్తినిఅంకితభావం కనబరుస్తోందని, ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌’ వేదిక ద్వారా దేశ యువతతో ముచ్చటించేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నానని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు చెప్పారు.

దృఢమైనసుసంపన్నమైన దేశాన్ని నిర్మించడంలో కీలక శక్తి భారతీయ యువతేననివారి అసమానమైన సామర్థ్యంనిబద్ధత ప్రశంసనీయమని ప్రధానమంత్రి అన్నారుదేశవ్యాప్తంగా ఉన్న యువత, తమ ఆలోచనలనుఆకాంక్షలను పంచుకునే వేదికగా ఈ చర్చా కార్యక్రమం నిలుస్తుందన్నారుఅలాగే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు తోడ్పడుతుందని తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మన్షుఖ్ మాండవీయ రాసిన పోస్టుకు శ్రీ మోదీ స్పందిస్తూ:

"అద్భుతమైన ఉత్సాహంసాటిలేని పట్టుదలతో కూడిన మన యువతరం శక్తివంతమైనసుసంపన్నమైన దేశ నిర్మాణానికి నడుం బిగించింది. ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ వేదికపై యువ మిత్రులతో ముచ్చటించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానుఈ కార్యక్రమంలో భాగంగా జనవరి 12న మీ అందరినీ కలుస్తాను."


(रिलीज़ आईडी: 2213658) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam