ప్రధాన మంత్రి కార్యాలయం
జనవరి 12న అహ్మదాబాద్‌లో జర్మనీ చాన్స్‌లర్ శ్రీ మెర్జ్‌ను కలుసుకోనున్న ప్రధానమంత్రి భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని సమీక్షించనున్న ఇద్దరు నేతలు
సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించనున్న చాన్స్‌లర్ శ్రీ మెర్జ్, ప్రధానమంత్రి శ్రీ మోదీ..
అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవంలో పాలుపంచుకోనున్న ఇరువురు నేతలు
प्रविष्टि तिथि:
09 JAN 2026 12:05PM by PIB Hyderabad
జర్మనీ ఫెడరల్ చాన్స్‌లర్ శ్రీ ఫ్రైడ్‌రిచ్ మెర్జ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 12న అహ్మదాబాద్‌లో భేటీ కానున్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానించడంతో, జర్మనీ ఫెడరల్ చాన్స్‌లర్ శ్రీ ఫ్రెడరిక్ మెర్జ్ 2026 జనవరి 12, 13 తేదీల్లో భారత్‌లో అధికారిక పర్యటనకు వస్తున్నారు. చాన్స్‌లర్ శ్రీ మెర్జ్ భారత్‌లో అధికారికంగా పర్యటించడం ఇది మొదటి సారి.
జనవరి 12న ఉదయం సుమారు 9:30 గంటలకు నేతలు ఇద్దరూ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. దాదాపు 10 గంటలకు సబర్మతి నది ఒడ్డున అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవంలో పాల్గొంటారు. తరువాత, ఉదయం 11:15 గంటల నుంచీ గాంధీనగర్‌లోని మహాత్మా మందిరంలో ద్వైపాక్షిక చర్చలు ఉంటాయి.
నేతలు ఇద్దరూ భారత్ -జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని సమీక్షిస్తారు. భారత్ -జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇటీవలే 25 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. వారి చర్చల్లో వ్యాపారం, పెట్టుబడి, సాంకేతికత, విద్య, నైపుణ్య శిక్షణ, గమనశీలత రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడంపై దృష్టి సారిస్తారు. రక్షణ, భద్రత, శాస్త్ర విజ్ఞానం, నవకల్పన, పరిశోధన, హరిత ప్రధానమైన, సుస్థిర అభివృద్ధి, రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు వంటి ముఖ్య రంగాల్లో ఇప్పుడున్న సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం గురించి కూడా సమీక్షిస్తారు.
ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన అంశాలపై ప్రధానమంత్రి శ్రీ మోదీ, చాన్స్‌లర్ శ్రీ మెర్జ్ తమ అభిప్రాయాలను తెలియజేసుకొంటారు. వారు ఇరు దేశాలకు చెందిన వాణిజ్య, పరిశ్రమ రంగాల ప్రముఖులతో కూడా చర్చిస్తారు.
***
(रिलीज़ आईडी: 2212926)
आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam