సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పిప్రహ్వా అవశేషాలను తిరిగి స్వదేశానికి తీసుకురావటం యాజమాన్య హక్కు కాదు.. సంరక్షణ బాధ్యత


ఒత్తిడి, నిర్బంధం ద్వారా కాదు.. సంభాషణ, నైతిక విలువల ద్వారా ప్రపంచవ్యాప్తంగా బుద్ధుని బోధనల వ్యాప్తి

రాయ్ పిథోరా సాంస్కృతిక భవనంలో బౌద్ధ తత్వశాస్త్రంపై ప్యానెల్ చర్చ

प्रविष्टि तिथि: 05 JAN 2026 9:43AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన పవిత్ర పిప్రహ్వా అవశేషాల భారీ అంతర్జాతీయ ప్రదర్శన సందర్భంగా న్యూఢిల్లీలోని రాయ్ పిథోరా సాంస్కృతిక భవనంలో బౌద్ధ తత్వశాస్త్రంపై ప్యానెల్ చర్చ నిర్వహించారు

నలందలోని నవ నలంద మహావిహార (డీమ్డ్ విశ్వవిద్యాలయంవైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ సిద్ధార్థ్ సింగ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగిందిలక్నోలోని బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నళిన్ కుమార్ శాస్త్రిఢిల్లీ విశ్వవిద్యాలయం ఫిలాసఫీ విభాగం ప్రొఫెసర్ బాల గణపతిలక్నోలోని బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆనంద్ సింగ్,న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం సంస్కృత విభాగం ప్రొఫెసర్ రజనీశ్ మిశ్రాకోల్‌కతా విశ్వవిద్యాలయం బౌద్ధ అధ్యయన విభాగం మాజీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఉజ్వల్ కుమార్‌తో పాటు పలువురు ప్రముఖ విద్యాంసులు ప్యానెల్ సభ్యులుగా పాల్గొన్నారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రొఫెసర్ సిద్ధార్థ్ సింగ్ ప్రసంగిస్తూ.. బలప్రయోగం లేదా ఒత్తిడి ద్వారా కాకుండాసంభాషణనైతిక విలువలువ్యక్తిగతంగా ఆదర్శంగా తీసుకోవటం ద్వారా బుద్ధుని బోధనలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించినట్లు తెలిపారుధర్మం ఆధారంగా ఉండే ఇతర సంప్రదాయాల లాగే బౌద్ధమతం కూడా మత మార్పిడికి కాక మానవాళి మనసును శుద్ధి చేయటంబాధల నుంచి విముక్తి కలిగించటంపై దృష్టి సారిస్తుందని చెప్పారువర్తమాన ఆచరణకర్తలను చారిత్రక బుద్ధునితో అనుసంధానిస్తూసజీవ సంప్రదాయాలను కొనసాగించటంలో బుద్ధుని అవశేషాలు తోడ్పడుతున్నాయని స్పష్టం చేశారుపిప్రహ్వా అవశేషాలను తిరిగి స్వదేశానికి తీసుకురావటమనేది కేవలం యాజమాన్య హక్కుకు సంబంధించిన విషయం కాదనిఉమ్మడి వారసత్వ సంరక్షణ బాధ్యతకు నిదర్శనమని చెప్పారు.

పిప్రహ్వా అవశేషాలను తిరిగి స్వదేశానికి తీసుకురావటం.. శాంతిసమగ్ర జాతీయ అభివృద్ధికి మార్గదర్శిగా పునరుద్ధరించిన బౌద్ధ తత్వశాస్త్ర ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుందని ప్రొఫెసర్ నళిన్ కుమార్ శాస్త్రి అన్నారునైతిక పాలనపర్యావరణ సుస్థిరతమానసిక ఆరోగ్యం వంటి సమకాలీన అంశాలతో ప్రాచీన జ్ఞానాన్ని బౌద్ధ చింతన అనుసంధానిస్తుందని తెలిపారుసామాజిక సామరస్యంపర్యావరణ బాధ్యతప్రపంచ సంక్షేమానికి అనత్తబ్రహ్మవిహారాలుప్రతీత్యసముత్పాదం వంటి బోధనలు అత్యవసరమన్నారుధర్మానికి మాతృభూమిగా భారత్ పాత్రను ఆయన స్పష్టం చేశారు.

బుద్ధుడుఆయన శిష్యుల అవశేషాలు కేవలం చిహ్నాలు మాత్రమే కాదనిధర్మానికి సజీవ స్వరూపాలని ప్రొఫెసర్ ఆనంద్ సింగ్ స్పష్టం చేశారుబుద్ధుని ఉనికినిఆయన బోధనలను ఇవి ఏకకాలంలో ప్రతిబింబిస్తాయన్నారుస్థూపాలుచైత్యాల ద్వారా పవిత్ర బౌద్ధ క్షేత్రాలు విస్తరించటంలో ఈ అవశేషాల ఆరాధన కీలక పాత్ర పోషించిందని తెలిపారుమౌలిక తాత్విక విలువలను కోల్పోకుండానేఆదిబుద్ధ భావనలనుమాతృదేవత ఆరాధన వంటి స్థానిక సాంస్కృతిక అంశాలను బౌద్ధమతం మిళితం చేసుకుందని చెప్పారు.

దార్శనికతసార్వత్రిక నైతిక విలువలే ప్రపంచవ్యాప్తంగా బౌద్ధమతం ఆదరణ పొందటానికి ముఖ్య కారణాలని ప్రొఫెసర్ బాల గణపతి స్పష్టం చేశారుపిప్రహ్వా అవశేషాలను బుద్ధుని సందేశానికి సజీవ చిహ్నాలుగా అభివర్ణిస్తూధర్మానికి మాతృభూమిగా భారత నాగరికత పాత్రను తెలియజేశారువిచ్ఛిన్నమవుతున్న నేటి ప్రపంచంలో శాంతిపరస్పర సహకారంనైతిక స్పష్టతకు ఆచరణాత్మకమానవీయ మార్గాన్ని బౌద్ధ దర్శనం చూపుతుందని అభిప్రాయపడ్డారు.

బౌద్ధ దర్శనానికిప్రాచీన భారతీయ చింతనకూ మధ్య లోతైన తాత్వికగ్రంథపరమైన కొనసాగింపును ప్రొఫెసర్ రజనీశ్ మిశ్రా తెలిపారుశ్రమణబ్రాహ్మణ సంప్రదాయాల మధ్య ఉమ్మడి మేధో వాతావరణాన్ని ప్రముఖంగా ప్రస్తావించారువారణాసి వంటి విద్యా కేంద్రాలు చారిత్రక కాలం నుంచి చర్చలువాదోపవాదాలుతాత్విక పరిణతికి వేదికలుగా నిలిచాయని అన్నారు.

బుద్ధుడి మొదటి బోధనలకు వారణాసి సమీపంలోని సారనాథ్ ను ఎంచుకోవటంలోని ఉద్దేశ్యాన్ని ప్రొఫెసర్ ఉజ్వల్ కుమార్ వివరించారుఈ సందర్భంగా బౌద్ధ ధర్మ సిద్ధాంతాల్లోని స్థూపంచైత్యం మధ్య వ్యత్యాసాన్ని స్పష్టం చేశారుబుద్ధునిఇతర గొప్ప గురువుల పవిత్ర అవశేషాలతో ఉండేది స్థూపం.. బుద్ధుని గౌరవార్థంస్మారకార్థం నిర్మించిన పవిత్ర చిహ్నంచైత్యమని తెలిపారుబౌద్ధుల నైతికభక్తిపూర్వక జీవితంలో ఈ రెండూ కీలకమని చెప్పారు.

పిప్రహ్వా అవశేషాలను స్వదేశానికి తీసుకురావటానికి గౌరవ భారత ప్రధానమంత్రికేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి చేసిన సమష్టి కృషిని ప్యానల్ కొనియాడిందిఇది కేవలం దౌత్యపరమైన అంశం మాత్రమే కాదనిసాంస్కృతిక బాధ్యతప్రపంచ సంక్షేమంశాంతిమానవీయ విలువల పట్ల భారత్ కున్న అచంచలమైన ప్రాధాన్యతకు నిదర్శనమని పేర్కొంది.

 

***


(रिलीज़ आईडी: 2211535) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Tamil , Kannada