ప్రధాన మంత్రి కార్యాలయం
దృఢ సంకల్పం, ఇచ్ఛా శక్తి ప్రాధాన్యాన్ని చెప్పే సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
02 JAN 2026 9:43AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నూతన సంవత్సర వేళ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో అందరి ప్రయత్నాలూ ఫలిస్తాయన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.
కొత్త ఏడాదిలో చేసుకున్న తీర్మానాలను దృఢ సంకల్పంతోనూ, ఇచ్ఛాశక్తితోనూ నెరవేర్చుకోవచ్చని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ఈ శాశ్వత జ్ఞానం మనకు ఉన్నతిని సాధించేందుకూ, అప్రమత్తంగా ఉండేందుకూ, సంక్షేమ ప్రదాయక కార్యాల్లో నిమగ్నం అయ్యేందుకూ ప్రోత్సాహాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. భవిష్యత్తును ఊహించడంలో మన మనస్సును స్థిరంగా, నిర్భయంగా ఉంచుకోవడంలో కూడా ఇది సాయపడుతుందని ఆయన అన్నారు.
స్ఫూర్తిదాయకమైన సంస్కృత శ్లోకాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘రాబోయే సంవత్సరాల్లో మీ ప్రయత్నాలన్నీ ఫలించాలని నేను కోరుకుంటున్నాను. కొత్త ఏడాదిలో మీరు చేసుకున్న తీర్మానాలు దృఢ సంకల్పంతో, ఇచ్ఛాశక్తితో నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాను.
ఉత్థాతవ్యం జాగృతవ్యం యోక్తవ్యం భూతికర్మసు।
భవిష్యతీత్యేవ మన: కృత్వా సతతమవ్యథై:।।”
(रिलीज़ आईडी: 2210764)
आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam