ప్రధాన మంత్రి కార్యాలయం
జనవరి 3న భగవాన్ బుద్ధునికి సంబంధించిన పవిత్ర పిప్రహ్వా అవశేషాల అంతర్జాతీయ ప్రదర్శనను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
పిప్రహ్వా అవశేషాలు భగవాన్ బుద్ధునితో ప్రత్యక్ష సంబంధమున్న తొలి, అత్యంత ప్రాచీన, చారిత్రక ప్రాధాన్యత కలిగినవి
‘‘ద లైట్, ద లోటస్: రెలిక్స్ ఆఫ్ ద అవేకెన్డ్ వన్’’ ఇతివృత్తంతో భగవాన్ బుద్ధ జీవిత విశేషాలను అందించనున్న ప్రదర్శన
దేశంలోని శాశ్వత బౌద్ధ వారసత్వ సంపదను ప్రపంచానికి చూపించనున్న ప్రదర్శన
శతాబ్దాల తర్వాత తిరిగి తీసుకు వచ్చిన పిప్రహ్వా అవశేషాలు, పురావస్తు సంపదలను ఒకచోట చేర్చిన ప్రదర్శన
प्रविष्टि तिथि:
01 JAN 2026 5:39PM by PIB Hyderabad
భగవాన్ బుద్దునికి సంబంధించిన పవిత్ర పిప్రహ్వా అవశేషాల అంతర్జాతీయ ప్రదర్శనను 2026 జనవరి 3వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ‘‘ద లైట్, ద లోటస్: రెలిక్స్ ఆఫ్ ద అవేకెన్డ్ వన్’’ అనే ఇతివృత్తంతో న్యూఢిల్లీలోని రాయ్ పిథోరా సాంస్కృతిక సముదాయంలో ఈ ప్రదర్శన జరగనుంది.
ఈ ప్రదర్శనలో శతాబ్దానికి పైగా కాలం తర్వాత విదేశాల నుంచి తిరిగి తీసుకొచ్చిన పిప్రహ్వా అవశేషాలను, న్యూఢిల్లీలోని జాతీయ మ్యూజియం, కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియంలో భద్రపరిచిన అసలైన అవశేషాలు, పురావస్తు సంపదతో కలిపి మొదటిసారిగా ఒకే వేదికపై ప్రదర్శిస్తున్నారు.
1898లో కనుగొన్న పిప్రహ్వా అవశేషాలు ప్రారంభ బౌద్దమత పురావస్తు అధ్యయనంలో అత్యంత కీలక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఇవి భగవాన్ బుద్దునికి నేరుగా సంబంధం ఉన్న అత్యంత ప్రాచీన, చారిత్రకంగా ముఖ్యమైన అవశేషాలలో ఒకటిగా గుర్తింపు పొందాయి. పురావస్తు ఆధారాలు పిప్రహ్వా ప్రదేశాన్ని ప్రాచీన కపిలవస్తుతో అనుసంధానిస్తున్నాయి. కపిలవస్తు అనేది సన్యాసం స్వీకరించే ముందు భగవాన్ బుద్ధ తన ప్రారంభ జీవితం గడిపిన ప్రాంతంగా గుర్తింపు పొందింది.
ఈ ప్రదర్శన భగవాన్ బుద్దుని బోధనలతో భారత్‌కు ఉన్న లోతైన, నాగరిక సంబంధాన్ని తెలియజేస్తుంది. దేశ గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాలనే ప్రధానమంత్రి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ప్రభుత్వం నిరంతర కృషి, సంస్థాగత సహకారం, వినూత్న ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా ఈ అవశేషాలను ఇటీవల తిరిగి స్వదేశానికి తీసుకురావడం సాధ్యమైంది.
ఈ ప్రదర్శనను వివిధ ఇతివృత్తాల ఆధారంగా ఏర్పాటు చేశారు. సాంచి స్తూపం నుంచి స్పూర్తి పొందిన పునర్నిర్మిత వ్యాఖ్యానాత్మక నమూనా దీనికి ప్రధాన ఆకర్షణ. ఇందులో జాతీయ సేకరణల నుంచి తీసుకొచ్చన అసలైన అవశేషాలు, అరుదైన వస్తువులను ఒకచోట ప్రదర్శించనున్నారు. ఇతర విభాగాల్లో పిప్రహ్వా పురావస్తు విశేషాల పునశ్చరణ, బుద్ధుని జీవితంలోని ముఖ్య ఘట్టాలు, దృశ్యాదృశ్యాలు: బౌద్ధ బోధనల సౌందర్య భాష, సరిహద్దులు దాటి విస్తరించిన బౌద్ధ కళలు, ఆదర్శాలు, సాంస్కృతిక కళాఖండాల స్వదేశ పునరాగమనం: నిరంతర ప్రయత్నం వంటివి ఉన్నాయి.
సాధారణ ప్రజలకు ఈ అవశేషాల ప్రాముఖ్యత సులభంగా అర్థం కావడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇందులో లీనమయ్యే చిత్రాలు, డిజిటల్ పునర్నిర్మాణాలు, మల్టీమీడియా ప్రదర్శనలు ఉన్నాయి. ఈ అంశాలు భగవాన్ బుద్దునిధ జీవితం, పిప్రహ్వా అవశేషాల ఆవిష్కరణ, అవి ప్రాంతాల మధ్య ప్రయాణించిన విధానం, వాటికి సంబంధించిన కళా సంప్రదాయాలపై సులభంగా అర్థమయ్యేలా అవగాహనను అందిస్తాయి.
***
(रिलीज़ आईडी: 2210628)
आगंतुक पटल : 9