ప్రధాన మంత్రి కార్యాలయం
పురాతన భారతీయ 'స్టిచ్డ్-షిప్' పద్ధతిలో నిర్మించిన ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య పోర్‌బందర్ నుంచి ఒమన్‌లోని మస్కట్‌కు తొలి ప్రయాణాన్ని ప్రారంభించడంపై ప్రధానమంత్రి ప్రశంస
प्रविष्टि तिथि:
29 DEC 2025 5:57PM by PIB Hyderabad
ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య నౌకను అద్భుతంగా తీర్చిదిద్ది, ప్రాణం పోసిన రూపకర్తలు, కళాకారులు, నౌకా నిర్మాణ నిపుణులు, భారత నావికాదళం అంకితభావంతో చేసిన కృషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ నౌక గుజరాత్‌లోని పోర్‌బందర్ నుంచి ఒమన్‌లోని మస్కట్ వరకు తొలి ప్రయాణాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రశంసలు కురిపించారు. పురాతన భారతీయ 'స్టిచ్డ్-షిప్' సాంకేతికతతో నిర్మించిన ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య, భారతదేశపు సుసంపన్నమైన సముద్రయాన సంప్రదాయాలను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 'గల్ఫ్ ప్రాంతంతో, ఇతర దేశాలతో మనకున్న చారిత్రక సంబంధాలను పునరుద్ధరిస్తూ సాగుతున్న ఈ నౌకా సిబ్బందికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి ప్రయాణం సురక్షితంగా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా సాగాలని కోరుకుంటున్నాను' అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య పోర్‌బందర్ నుంచి ఒమన్‌లోని మస్కట్‌కు తొలి ప్రయాణాన్ని ప్రారంభించటం అధ్బుతం. పురాతన భారతీయ 'స్టిచ్డ్-షిప్' సాంకేతికతతో నిర్మితమైన ఈ నౌక, భారతదేశపు సుసంపన్నమైన సముద్రయాన సంప్రదాయాలను సగర్వంగా చాటిచెబుతోంది. ఈ విశిష్టమైన నౌకను అద్భుతంగా తీర్చిదిద్దిన రూపకర్తలు, కళాకారులు, నౌకా నిర్మాణ నిపుణులు, భారత నావికాదళ అంకితభావంతో కూడిన కృషిని నేను అభినందిస్తున్నాను. గల్ఫ్ ప్రాంతంతో, అంతకు మించి మనకున్న చారిత్రక సంబంధాలను పునరుద్ధరిస్తూ సాగుతున్న ఈ నౌకా సిబ్బందికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి ప్రయాణం సురక్షితంగా, ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా సాగాలని కోరుకుంటున్నాను"
@INSVKaundinya
(रिलीज़ आईडी: 2209699)
आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam