ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో వీరబాల దివస్ కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం


· అజేయమైన ధైర్యానికీ, అత్యున్నత సాహసానికీ ప్రతీకలైన వీర సాహిబ్‌జాదాలను నేడు స్మరించుకుందాం.. వారు దేశానికి గర్వకారణం

· మాతా గుజ్రీ, శ్రీ గురు గోవింద్ సింగ్, నలుగురు సాహిబ్జాదాల ధైర్యమూ, ఆదర్శాలూ ప్రతి భారతీయుడికీ తరగని స్ఫూర్తి

· వలసవాద మనస్తత్వం నుంచి శాశ్వత విముక్తి దిశగా భారత్ సంకల్పం

· వలసవాద మనస్తత్వం నుంచి భారత్ విముక్తమవుతున్న నేటి తరుణంలో దేశానికి బలంగా నిలుస్తున్న భాషా వైవిధ్యం

· వికసిత భారత్ లక్ష్యం దిశగా భారత్‌ను నడపబోతున్న జెన్ జీ, జెన్ ఆల్ఫా: ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 26 DEC 2025 3:03PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ‘వీరబాల దివస్’ సందర్భంగా ఈ రోజు నిర్వహించిన జాతీయ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారుదేశం నలుమూలల నుంచి వచ్చిన అతిథులకు స్వాగతం పలికిన ప్రధానమంత్రిఅక్కడున్న పిల్లలనుద్దేశించి మాట్లాడారువీరబాల దివస్ ప్రాముఖ్యతను వారికి వివరించారుఈ సందర్భంగా కళాకారుల వందేమాతర ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించారువారి అంకితభావంకృషి ఆ ప్రదర్శనలో స్పష్టంగా కనిపించాయన్నారు.

భారతదేశానికి గర్వకారణమైనఅజేయ ధైర్య సాహసాలకు ప్రతీకలైన వీర సాహిబ్‌జాదాలను దేశం నేడు స్మరించుకుంటోందని శ్రీ మోదీ చెప్పారువయస్సుఅనుభవాల పరిమితులను ఛేదించుకున్న ఈ సాహిబ్‌జాదాలు క్రూర మొఘల్ సామ్రాజ్యం ఎదుట కొండలా అడ్డు నిలిచారన్నారుమతోన్మాదాన్నీఉగ్ర మూలాలనూ పెకలించారని కొనియాడారుఇంతటి మహోజ్వల చరిత్ర ఉన్న ఈ దేశ యువత.. స్ఫూర్తిదాయకమైన ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న యువతరం ఏదయినా సాధించగలదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

డిసెంబర్ 26వ తేదీ వస్తే చాలు.. సాహిబ్‌జాదాల అసమాన పరాక్రమ స్ఫూర్తితో ‘వీరబాల దివస్’ వేడుకలను ప్రభుత్వం ప్రారంభించిందన్న తృప్తిభరోసా కలుగుతాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారుగత నాలుగేళ్లుగా ఈ కొత్త సంప్రదాయంతో సాహిబ్‌జాదాల స్ఫూర్తిని యువత అందిపుచ్చుకుంటోందన్నారుయువతను ధీరులుగాప్రతిభావంతులుగా తీర్చిదిద్దే దిశగా ఇది ఓ వేదికగా నిలిచిందన్నారుఏటా వివిధ రంగాల్లో దేశం కోసం విశేష విజయాలు సాధించిన బాలలు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని (పీఎంఆర్‌బీపీస్వీకరిస్తారనిఈ సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా 20 మంది పిల్లలు ఈ పురస్కారాన్ని అందుకున్నారని ప్రధానమంత్రి తెలిపారువారితో తన సంభాషణను వివరిస్తూ... చాలా మంది పిల్లలు అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారనీ.. కొందరు సామాజిక సేవపర్యావరణ పరిరక్షణలో ప్రశంసనీయ సేవలందించారనీ.. ఇంకొందరు శాస్త్రసాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలు చేశారనీ.. మరికొందరు క్రీడలుకళసంస్కృతీ రంగంలో విశేష కృషి చేశారనీ శ్రీ మోదీ తెలిపారుఈ పురస్కారం ఆ పిల్లలది మాత్రమే కాదనీ.. వారి తల్లిదండ్రులుఉపాధ్యాయులుమార్గదర్శకుల కృషికీ ఇది గుర్తింపు అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారుపురస్కార విజేతలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించిన ఆయనవారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు.

వీరబాల దివస్‌ను భావోద్వేగానికీభక్తిభావానికీ ప్రతీకగా వ్యాఖ్యానించిన శ్రీ మోదీ.. అత్యంత చిన్న వయస్సులోనే నాడు అత్యంత శక్తిమంతమైన మొఘల్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచిన వీర సాహిబ్‌జాదాలు అజిత్ సింగ్జుఝార్ సింగ్జొరావర్ సింగ్ఫతే సింగ్‌లను స్మరించుకున్నారుప్రాథమిక భారతీయ ఆదర్శాలకూమత మౌఢ్యానికీ నడుమ.. సత్యానికీఅసత్యానికీ నడుమ.. ఆ పోరాటం సాగిందన్నారుఒక పక్షానికి పదో గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ నాయకత్వం వహించగామరోవైపు ఔరంగజేబు క్రూర పాలన సాగిందన్నారుభారతీయుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి బలవంతంగా మతమార్పిడులు చేయాలని ఔరంగజేబు నిశ్చయించుకున్నాడనిఅందుకే సాహిబ్‌జాదాలు చాలా చిన్నవారే అయినప్పటికీ వారిని లక్ష్యంగా చేసుకున్నాడని ప్రధానమంత్రి చెప్పారుగురు గోవింద్ సింగ్ సామాన్యుడు కాదనీ.. తపస్సుకూత్యాగానికీ ప్రతీక అయిన ఆయన వారసత్వాన్ని సాహిబ్‌జాదాలు అందిపుచ్చుకున్నారనీ... ఔరంగజేబుఅతని సేనానులు ఈ విషయాన్ని విస్మరించారని ప్రధానమంత్రి అన్నారుమొఘలు సామ్రాజ్యం అంత బలమైనదే అయినప్పటికీనలుగురు సాహిబ్‌జాదాలలో ఒక్కరు కూడా చలించలేదని శ్రీ మోదీ కొనియాడారువారి శౌర్యం ఇప్పటికీ ఆయన మాటల్లో ప్రతిధ్వనిస్తుందంటూ...సాహిబ్‌జాదా అజిత్ సింగ్ మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు.

కొన్ని రోజుల కిందటే కురుక్షేత్రలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో శ్రీ గురు తేగ్ బహదూర్ జీని ఆయన 350వ బలిదాన దినం సందర్భంగా దేశం స్మరించుకుందని ప్రధానమంత్రి మోదీ గుర్తుచేశారుఆయన త్యాగం నుంచి స్ఫూర్తి పొందిన సాహిబ్‌జాదాలు మొఘలుల అకృత్యాలకు భయపడతారనుకోవడం పొరపాటన్నారుమాతా గుజ్రీశ్రీ గురు గోవింద్ సింగ్నలుగురు సాహిబ్‌జాదాల ధైర్యమూఆదర్శాలూ ప్రతి భారతీయుడికీ బలాన్నిస్తాయనీతరగని స్ఫూర్తినిస్తాయని ప్రధానమంత్రి అన్నారుసాహిబ్‌జాదాల త్యాగనిరతి ప్రతి పౌరుడికీ ఎంతగానో తెలిసి ఉండాల్సిందన్న శ్రీ మోదీ.. దురదృష్టవశాత్తు స్వాతంత్య్రానంతరం కూడా వలసవాద మనస్తత్వమే బలంగా ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1835లో బ్రిటిష్ రాజకీయవేత్త మెకాలే ఈ మనస్తత్వానికి బీజం వేశారనీస్వాతంత్య్రానంతరం కూడా దీన్ని నిర్మూలించలేకపోయామనీ అన్నారుదీంతో ఇలాంటి సత్యాలు దశాబ్దాల పాటు అణచివేతకు గురయ్యాయన్నారువలసవాద మనస్తత్వం నుంచి విముక్తిని నేడు భారత్ సంకల్పించిందని శ్రీ మోదీ స్పష్టం చేశారుభారతీయ త్యాగాలకూశౌర్యానికీ సంబంధించిన జ్ఞాపకాలు ఇకపై అణచివేతకు లోనుకాబోవనిదేశ నాయికా నాయకులను ఇకపై పక్కనపెట్టబోమని ప్రకటించారుఅందుకే వీరబాల్ దివస్‌ను పూర్తి భక్తిశ్రద్ధలతోఉత్సాహంతో నిర్వహిస్తున్నామని తెలిపారుప్రభుత్వం అక్కడితోనే ఆగలేదన్నారు. 2035 నాటికి మెకాలే కుట్రకు 200 ఏళ్లు పూర్తవుతుందనిమరో పదేళ్లు మిగిలి ఉండగానే వలసవాద మనస్తత్వం నుంచి భారత్ సంపూర్ణ విముక్తిని సాధించి చూపుతుందని స్పష్టం చేశారుఈ మనస్తత్వం నుంచి విముక్తి పొందితే.. స్వదేశీ సంప్రదాయాల పట్ల మరింత గౌరవాదరాలు పెరుగుతాయనిస్వావలంబన పథంలో దేశం పురోగమిస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

వలసవాద మనస్తత్వం నుంచి దేశాన్ని విముక్తం చేసే ప్రచారానికి సంబంధించిన ఛాయలు ఇటీవల పార్లమెంటులో కనిపించాయనిశీతాకాల సమావేశాల్లో పార్లమెంటు సభ్యులు హిందీఇంగ్లిషుతోపాటు ఇతర భారతీయ భాషల్లో దాదాపు 160 ప్రసంగాలు చేశారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారుసుమారు 50 ప్రసంగాలు తమిళంలో, 40కి పైగా ప్రసంగాలు మరాఠీలోదాదాపు 25 ప్రసంగాలు బెంగాలీలో చేశారని ఆయన తెలిపారుప్రపంచంలోని ఏ పార్లమెంటులో అయినా ఇలాంటి దృశ్యం చాలా అరుదుగా కనిపిస్తుందనిఇది మనందరికీ గర్వకారణమని అన్నారుదేశంలో భాషా వైవిధ్యాన్ని అణచివేసేందుకు మెకాలే ప్రయత్నించాడనికానీ వలసవాద మనస్తత్వం నుంచి భారత్ నేడు విముక్తి పొందుతున్న తరుణంలో.. ఆ భాషా వైవిధ్యమే మనకు గొప్ప శక్తిగా నిలుస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.  

 

యువ భారత్ సంస్థ సభ్యులైన యువతనుద్దేశించి ప్రసంగిస్తూవారు ‘జెన్ జీఆల్ఫా’ తరాలకు ప్రతినిధులని శ్రీ మోదీ వ్యాఖ్యానించారుదేశాన్ని వికసిత భారత్‌గా రూపుదిద్దేది వారేనని స్పష్టం చేశారుఈ తరం సామర్థ్యాన్నిఆత్మవిశ్వాసాన్ని తాను చూస్తున్నాననిఅవగతం చేసుకున్నాననిఅందువల్లనే వారిపై తనకెంతో విశ్వాసం ఉందని ఆయన చెప్పారుఒక సామెతను ఉటంకిస్తూఒక పసివాడు వివేచనతో మాట్లాడినపుడు దాన్ని అంగీకరించాలనిమన గొప్పతనాన్ని నిర్వచించేది ఆలోచనలువిజయాలే తప్ప వయసు కాదని స్పష్టం చేశారుయువతరం అందరికీ స్ఫూర్తినిచ్చేలా పని చేయగలదనిఈ వాస్తవాన్ని చాలామంది ఇప్పటికే రుజువు చేశారని ఆయన వివరించారుఅయితేమన చేరాల్సిన గమ్యం ఎంతో దూరంలో ఉన్నందున ఆ విజయాలను కేవలం శుభారంభంగా మాత్రమే పరిగణించాలని చెప్పారుఆకాశమే హద్దుగా మన స్వప్నాలను సాకారం చేసుకోవాలని ఉద్బోధించారులోగడ అంతటా అలముకున్న నిరాశాపూరిత వాతావరణం ఫలితంగా కలలు కనడమంటే భయంగా ఉండేదనినేడు అటువంటి పరిస్థితులు లేవుగనుక ఈ తరం ఎంతో అదృష్టవంతులని పేర్కొన్నారుదేశం వారి ప్రతిభకు చేయూతనివ్వడమే ఇందుకు కారణమని శ్రీ మోదీ వ్యాఖ్యానించారుఈ మేరకు దేశం నలుమూలలా ప్రతిభను అన్వేషించిదానికి పదును పెట్టే వేదికలను సమకూరుస్తున్నదని తెలిపారుతద్వారా 140 కోట్ల మంది పౌరుల బలాన్ని వారి ఆకాంక్షలకు జోడిస్తున్నదని చెప్పారుడిజిటల్ ఇండియా విజయం ఫలితంగా యువతరానికి ఇంటర్నెట్ సాధికారత కల్పించడంతోపాటు అభ్యసన వనరులు అందుబాటులోకి వచ్చాయన్నారుశాస్త్రసాంకేతికవ్యవస్థాపన రంగాల్లో విద్యాభ్యాసం చేసిన వారికి ‘అంకుర భారత్‌’ (స్టార్టప్ ఇండియా), క్రీడలలో రాణించే వారికి ‘క్రీడా భారత్‌’ (ఖేలో ఇండియావంటి కార్యక్రమాలు ప్రోత్సాహం ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారుఓ రెండు రోజుల కిందటే తాను పార్లమెంటు క్రీడా మహోత్సవాల్లో పాల్గొన్నాననియువత పురోగమనానికి మద్దతిచ్చే అనేక వేదికలు అందుబాటులో ఉన్నాయనడానికి ఇదొక నిదర్శనమని శ్రీ మోదీ చెప్పారుస్వల్పకాలిక ప్రాచుర్యం మోజులో పడకుండా అప్రమత్తత వహించాలని యువతకు సూచించారుజీవన సూత్రాలుఆలోచనలలో పరిపక్వత అత్యావశ్యకమని స్పష్టం చేశారుదేశంలోని మహనీయుల ఆదర్శాలువ్యక్తిత్వాల నుంచి స్ఫూర్తి పొందాలనితమ విజయం వ్యక్తిగతంగా కాకుండా దేశానికి సంబంధించినదిగా ఉండేలా చూసుకోవాలని పిలుపునిచ్చారు.

యువత సాధికారతపై దృష్టితో కొత్త విధానాలకు రూపకల్పన చేస్తున్నామనియువత కేంద్రకంగా దేశ ప్రగతికి ప్రణాళికలు రచిస్తున్నామని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారుమేరా యువ భారత్ వంటి వేదికల ద్వారా యువత అనుసంధానానికిఅవకాశాలతోపాటు నాయకత్వ నైపుణ్య కల్పనకు కృషి కొనసాగుతున్నదని ఆయన తెలిపారుఅంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రగతిక్రీడలకు ప్రోత్సాహంఫిన్‌టెక్ఉత్పాదక రంగాల విస్తరణనైపుణ్యాభివృద్ధిఇంటర్న్‌షిప్‌ దిశగా అవకాశాల సృష్టి తదితర ప్రతి  కార్యక్రమంలో యువతకు పెద్దపీట వేస్తున్నామని శ్రీ మోదీ వివరించారుప్రతి రంగంలోనూ యువతకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయనిప్రపంచంలో యువ జనాభాగల దేశాలలో భారత్‌ ఒకటిగా ఉందని తెలిపారుయువతరానికి ఇది కలిసివచ్చే కాలం కాబట్టిరాబోయే 25 ఏళ్లు దేశ భవిష్యత్తకు దిశానిర్దేశం చేస్తాయని శ్రీ మోదీ అన్నారుస్వాతంత్ర్యానంతరం తొలిసారి దేశ సామర్థ్యాలుఆకాంక్షలు ప్రపంచ అంచనాలను అందుకుంటున్నాయని ఆయన వ్యాఖ్యానించారుమునుపెన్నడూ లేనిరీతిలో గొప్ప అవకాశాలున్న నేటి పరిస్థితులలో యువతరం నేడు ఎదుగుతున్నదని చెప్పారుదీనికి అనుగుణంగా వారి ప్రతిభఆత్మవిశ్వాసంనాయకత్వ లక్షణాల సద్వినియోగం చేసుకుంటూ మెరుగైన అవకాశాల కల్పనకు ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తున్నదని వెల్లడించారు.

విద్యా విధానంలో గణనీయ సంస్కరణలతో వికసిత భారత్‌కు బలమైన పునాదులు వేస్తున్నామని చెప్పారుఈ మేరకు 21వ శతాబ్దపు ఆధునిక అభ్యసన పద్ధతులపై కొత్త జాతీయ విద్యా విధానం దృష్టి సారిస్తుందని తెలిపారుఆచరణాత్మక అభ్యాసానికి ప్రాధాన్యమిస్తూబాలలు బట్టీపట్టే బదులు ఆలోచించేలా ఇది ప్రోత్సహిస్తుందనిప్రశ్నించే మనోధైర్యాన్నిస్తుందనిపరిష్కార నైపుణ్యాన్ని పెంచుతుందని ఆయన వివరించారుబహుళ కోర్సుల అధ్యయనంనైపుణ్యాధారిత అభ్యాసంక్రీడలకు ప్రోత్సాహంసాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో విద్యార్థులకు ఎనలేని ప్రయోజనం చేకూరుతుందని శ్రీ మోదీ చెప్పారుఈ దిశగా దేశంలో తొలిసారి అర్థవంతమైన కృషి కొనసాగుతున్నదనిదేశవ్యాప్తంగా లక్షలాది బాలలు అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల ద్వారా ఆవిష్కరణలుపరిశోధనలలో పాలుపంచుకుంటున్నారని చెప్పారుపాఠశాల స్థాయిలోనే రోబోటిక్స్ఏఐసుస్థిరతడిజైన్ థింకింగ్‌ వంటి ఆధునిక అంశాలను పరిచయం చేస్తున్నారని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారుఅంతేగాకజాతీయ విద్యా విధానం వల్ల మాతృభాషలో చదువుకునే అవకాశం కూడా లభించిందనిదీంతో అభ్యసనం సరళమై బాలలు పాఠ్యాంశాలను చక్కగా అర్థం చేసుకోగలరని పేర్కొన్నారు.

సాహసులైన ‘సాహిబ్‌జాదా’లు మార్గం ఎంత కష్టమైనదని కాకుండా సముచితమైనదా... కాదాఅని మాత్రమే చూశారనిఅదే స్ఫూర్తి నేడు కూడా అవసరమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారుపెద్ద కలలు కనాలనిదీక్షతో కృషి చేయాలనిఆత్మవిశ్వాసాన్ని కోల్పోరాదని చెబుతూభారత యువత నుంచి తాను ఆశిస్తున్నది ఇదేనన్నారుదేశ భవిష్యత్తు బాలలుయువత భవిష్యత్తుపైనే ఆధారపడి ఉంటుందన్నారువారి ధైర్యంప్రతిభఅంకితభావమే దేశ ప్రగతికి మార్గనిర్దేశం చేస్తాయని శ్రీ మోదీ స్పష్టం చేశారుఈ విశ్వాసంకర్తవ్య దీక్షనిరంతర వేగంతో భారత్‌ ఉజ్వల భవిష్యత్‌ పథంలో సాగుతుందని ప్రధానమంత్రి వివరించారుపురస్కార విజేతలకు అభినందనలతోపాటుఅందరికీ  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారుచివరగా, ‘సాహిబ్‌జాదా’లకు మరోసారి నివాళి అర్పిస్తూ తన ప్రసంగం ముగించారు.

కేంద్ర మంత్రులు శ్రీమతి అన్నపూర్ణా దేవిశ్రీమతి సావిత్రి ఠాకూర్శ్రీ రవ్‌నీత్‌ సింగ్శ్రీ హర్ష్ మల్హోత్రా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం

వీర బాలల దినోత్సవం సందర్భంగా ‘సాహిబ్‌జాదా’ల అసాధారణ ధైర్యసాహసాలుఅత్యున్నత త్యాగం గురించి పౌరులకు అవగాహన కల్పనతోపాటు దేశ చరిత్రలోని ఈ యువ వీరుల అకుంఠిత దీక్షను సంస్మరించుకోవడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వివిధ భాగస్వాములతో సంయుక్తంగా దేశమంతటా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందిఇందులో భాగంగా కథా శ్రవణంపద్య పఠనంపోస్టర్ల తయారీవ్యాస రచన వంటి అంశాల్లో పోటీలు కూడా నిర్వహిస్తోందిఈ మేరకు పాఠశాలలుశిశు సంరక్షణ సంస్థలుఅంగన్‌వాడీ కేంద్రాలు సహా విద్యా-‘మైగవ్’, ‘మైభారత్’ పోర్టళ్ల ద్వారా ఆన్‌లైన్‌ మార్గంలో వీటిని నిర్వహిస్తోంది.

శ్రీ గురు గోవింద్ సింగ్ ప్రకాష్ పర్వ్‌ సందర్భంగా 2022 జనవరి 9న ఆయన కుమారులైన సాహిబ్‌జాదా ‘బాబా జొరావర్ సింగ్బాబా ఫతే సింగ్’ అమరత్వ సంస్మరణార్థం డిసెంబరు 26వ తేదీని ‘వీర్ బాలల దినోత్సవం’గా నిర్వహిస్తామని ప్రధానమంత్రి ప్రకటించారుఆ ఇద్దరు ‘సాహిబ్‌జాదా’ల సాటిలేని త్యాగం తరతరాలుగా యువతరానికి స్ఫూర్తినిస్తూనే ఉంది. ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ (పీఎంఆర్‌బీపీగ్రహీతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2208999) సందర్శకుల సూచీ సంఖ్య : : 27