ప్రధాన మంత్రి కార్యాలయం
'సదైవ అటల్' వద్ద శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళులు అర్పించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
25 DEC 2025 11:21AM by PIB Hyderabad
మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఆయన స్మారక చిహ్నం 'సదైవ అటల్' వద్ద ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. అటల్ జీ జీవితం ప్రజా సేవకు, దేశ సేవకు అంకితమైందని.. దేశ ప్రజలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటుందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
"మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఇవాళ ఢిల్లీలోని ఆయన స్మృతి స్థలం 'సదైవ అటల్'ను సందర్శించి, నివాళులు అర్పించే అదృష్టం నాకు లభించింది. ప్రజాసేవ, దేశ సేవకు అంకితమైన ఆయన జీవితం ఎల్లప్పుడూ దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుంది".
(रिलीज़ आईडी: 2208426)
आगंतुक पटल : 91
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
Manipuri
,
Assamese
,
Odia
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil