ఉప రాష్ట్రపతి సచివాలయం
‘‘మోదీ శకంలో భారత్ ఆర్థిక సాధికారత’’ పుస్తకావిష్కరణ సందర్భంగా దశాబ్ద కాలపు సంస్కరణలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి
ప్రధాని మోదీ హయాంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న
ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరణ: ఉపరాష్ట్రపతి
ఏకీకృత జాతీయ మార్కెట్ నిర్మాణంలో జీఎస్టీ, డిజిటల్ ఇండియా పాత్ర పోషించాయన్న ఉపరాష్ట్రపతి
రూ.47 లక్షల కోట్లకు పైగా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ... పాలనలో పారదర్శకతకు నిదర్శనం: ఉపరాష్ట్రపతి
प्रविष्टि तिथि:
24 DEC 2025 4:08PM by PIB Hyderabad
పార్లమెంట్ సభ్యులు ప్రొఫెసర్ (డాక్టర్) సికందర్ కుమార్ రచించిన ‘‘మోదీ యుగంలో భారత్ ఆర్థిక సాధికారత’’ అనే పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ ఈ రోజు ఆయన నివాసంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ఈ పుస్తకం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత, సమర్థవంతమైన నాయకత్వం, దేశంలో అమలవుతున్న విప్లవాత్మక ఆర్థిక విధానాలకు ఒక శక్తిమంతమైన నిదర్శనమని కొనియాడారు.
గత దశాబ్ద కాలంలో భారత్ అద్భుతమైన ఆర్థిక మార్పులను చూసిందని, దీనివల్ల దేశవ్యాప్తంగా ఆత్మవిశ్వాసం పెరిగిందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, అలాగే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని ఆయన అన్నారు.
ఈ పుస్తకం దివాలా చట్టాలు, డిజిటల్ పాలన, పారదర్శక బ్యాంకింగ్ వ్యవస్థలు వంటి ప్రధాన నిర్మాణాత్మక సంస్కరణలను విశదీకరిస్తుందని తెలిపారు. ఇవి కేవలం విధానపరమైన నిర్ణయాలు మాత్రమే కాకుండా, దశాబ్దాలుగా పేరుకుపోయిన అసమర్థతను, అవినీతిని నిర్మూలించేందుకు తీసుకున్న సాహసోపేతమైన అడుగులని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆశయమైన ‘‘కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన’’ ఇప్పుడు సమర్థత, క్రమశిక్షణతో కూడిన కార్యరూప నమూనాగా అభివృద్ధి చెందిందని అన్నారు.
ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు వంద శాతం లబ్ధిదారులకే అందాలన్నది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రధాన లక్ష్యమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. (జన్ ధన్, ఆధార్, మొబైల్) జామ్ త్రయం ద్వారా ప్రతక్ష లబ్ది బదిలీలతో లీకేజీలు తగ్గి, ప్రభుత్వ పాలనలో పారదర్శకత పెరిగిందని అన్నారు. ఇప్పటివరకు సుమారు రూ. 47 లక్షల కోట్లకు పైగా నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకే ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు తెలిపారు. ఇది పాలనా విభాగంలో ఒక గొప్ప విప్లవమని ఉపరాష్ట్రపతి వెల్లడించారు.
ఈ యుగంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మరో చరిత్రాత్మక మైలురాయి అని ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. ఇది పన్నుల వ్యవస్థను సరళీకృతం చేసిందని, దీనివల్ల భారత్ ఏకీకృత జాతీయ మార్కెట్‌గా మారిందని పేర్కొన్నారు. ఇది పన్ను నిబంధనల అమలును మెరుగుపరచడమే కాకుండా, సహకార సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేసిందని ఆయన అన్నారు. అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను తొలగించడం వల్ల సరుకు రవాణా సులభతరమైందని, దీనివల్ల లక్షలాది పని గంటలు, ఇంధనం ఆదా అయ్యాయని వివరించారు. స్వతంత్ర భారత చరిత్రలో చేపట్టిన అతిపెద్ద ఆర్థిక సంస్కరణల్లో ఒకటిగా జీఎస్టీ గుర్తింపు పొందిందని ఆయన కొనియాడారు.
సమ్మిళిత విధానంపై కేంద్రీకరించిన బలమైన దృష్టి వల్ల భారతదేశ ఆర్థిక సాధికారత సాధ్యమైందని ఉపరాష్ట్రపతి అన్నారు. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, యూపీఐ వేగవంతమైన విస్తరణ వవంటి కార్యక్రమాలు పౌరులు, పారిశ్రామికవేత్తలు, చిన్న వ్యాపారాలకు ఆర్థిక సాధికారత కల్పించాయని ఉపరాష్ట్రపతి అన్నారు.
ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ‘ఆత్మ నిర్భర్ భారత్’ దేశాన్ని ఇతర దేశాలపై ఆధారపడే స్థితి నుంచి స్వశక్తితో ఎదిగేలా మార్చిందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. అదే సమయంలో ప్రపంచ సరఫరా వ్యవస్థలో దేశాన్ని నమ్మకమైన భాగస్వామిగా నిలిపిందని ఆయన అన్నారు. ఈ ప్రయాణం వికసిత భారత్ అనే విస్తృత ఆకాంక్షకు అనుగుణంగా సాగుతోందని, ఇందులో ఆర్థిక వృద్ధి సామాజిక న్యాయం, పర్యావరణ స్థిరత్వం, సాంకేతిక పురోగతి సమతుల్యంగా ఉంటాయని ఆయన తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ విధానపరమైన స్తబ్దత నుంచి ఉద్దేశపూర్వక పాలన వైపు.. పేదరికం అనే ఆలోచన విధానం నుంచి సమృద్ధి అనే లక్ష్యం దిశగా ప్రయాణం సాగుతోందని పేర్కొన్నారు. ఇతర దేశాలపై ఆధారపడే స్థితి నుంచి ఆత్మనిర్భరత వైపు ముందడుగు వేసిందని తెలిపారు. వికసిత భారత్ @2047 సాధన దిశగా సాగుతున్న ఈ ప్రయాణంలో ఆత్మవిశ్వాసం కలిగిన, సామర్ధ్యం, కరుణతో కూడిన నవ భారతాన్ని ఒక పండగలా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.
***
(रिलीज़ आईडी: 2208232)
आगंतुक पटल : 6