ప్రధాన మంత్రి కార్యాలయం
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 101వ జయంతి సందర్భంగా డిసెంబర్ 25న ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్న ప్రధాని
మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి జీవితాన్ని, ఆదర్శాలను గౌరవిస్తూ లక్నోలో ఏర్పాటు చేసిన ప్రేరణా స్థల్‌ను ప్రారంభించినున్న పీఎం
రాష్ట్ర ప్రేరణా స్థల్‌లో ఏర్పాటు చేసిన 65 అడుగుల ఎత్తున్న డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి కాంస్య విగ్రహాల ఆవిష్కరణ
రాష్ట్ర ప్రేరణా స్థల్‌లో కమలం ఆకారంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక మ్యూజియం భారత దేశ ప్రయాణాన్ని, నాయకత్వ వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది
प्रविष्टि तिथि:
24 DEC 2025 11:05AM by PIB Hyderabad
మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజపేయి 101 జయంతిని పురస్కరించుకొని 2025 డిసెంబర్ 25న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్ర ప్రేరణా స్థల్‌ను ప్రారంభిస్తారు. అలాగే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
స్వతంత్ర భారతదేశంలో ప్రముఖుల వారసత్వాన్ని గౌరవించాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనకు అనుగుణంగా రాష్ట్ర ప్రేరణా స్థల్‌ను ఏర్పాటు చేశారు. ఇది దేశ ప్రజాస్వామ్య, రాజకీయ, అభివృద్ధి ప్రయాణంలో తమదైన ముద్ర వేసిన గొప్ప రాజనీతిజ్ఞుల జీవితాలకు, ఆదర్శాలకు, వారి వారసత్వానికి నివాళి అర్పిస్తుంది.
జాతీయ స్మారకంగా, స్ఫూర్తి కేంద్రంగా రాష్ట్రీయ ప్రేరణా స్థల్‌ను అభివృద్ధి చేశారు. 65 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.230 కోట్ల వ్యయంతో ఈ సముదాయాన్ని నిర్మించారు. నాయకత్వ విలువలను, దేశ సేవను, సాంస్కృతిక స్పృహను, ప్రజా స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు అంకితమైన శాశ్వత జాతీయ ఆస్తిగా దీన్ని రూపొందించారు.
భారతీయ రాజకీయ ఆలోచనకు, జాతి నిర్మాణానికి, ప్రజా జీవితానికి విశేష కృషి చేసిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజపేయిని గౌరవిస్తూ 65 అడుగుల ఎత్తున్న కాంస్య విగ్రహాలను ఈ సముదాయంలో ఏర్పాటు చేశారు. అలాగే 98,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కమలం ఆకారంలో అత్యాధునిక మ్యూజియంను ఏర్పాటు చేశారు. అత్యాధునిక డిజిటల్, ఇమర్సివ్ సాంకేతికతలను ఉపయోగించి భారతదేశ ప్రయాణాన్ని, దార్శనిక నాయకులు చేసిన సేవలను ఈ మ్యూజియం ప్రదర్శిస్తుంది. సందర్శకులకు వైజ్ఞానిక అనుభవాన్ని అందిస్తుంది.
నిస్వార్థ నాయకత్వం, సుపరిపాలన ఆదర్శాలను పరిరక్షించే, ప్రోత్సహించే దిశగా చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రేరణా స్థల్ ప్రారంభం సూచిస్తుంది. ఇది ప్రస్తుత, భవిష్యత్తు తరాలకు స్పూర్తిగా నిలుస్తుంది.
***
(रिलीज़ आईडी: 2208050)
आगंतुक पटल : 27
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam