ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూజిలాండ్ ప్రధానితో టెలిఫోన్లో మాట్లాడిన ప్రధానమంత్రి
చరిత్రాత్మకమైన భారత్-న్యూజిలాండ్ వాణిజ్య ఒప్పందాన్ని సంయుక్తంగా ప్రకటించిన ఇద్దరు నాయకులు
వాణిజ్యానికి, పెట్టుబడులకు, ఆవిష్కరణలకు, రెండు దేశాల మధ్య ఉమ్మడి అవకాశాలకు ఉత్ప్రేరకంగా ఎఫ్‌టీఏ పనిచేస్తుందని అంగీకరించిన నాయకులు
రక్షణ, క్రీడలు, విద్య, ప్రజాసంబంధాలతో సహా ద్వైపాక్షిక సహకారం ఉన్న ఇతర రంగాల్లో సాధించిన పురోగతిని స్వాగతించిన నాయకులు
प्रविष्टि तिथि:
22 DEC 2025 11:30AM by PIB Hyderabad
న్యూజిలాండ్ ప్రధాని శ్రీ క్రిస్టోఫర్ లక్సన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు టెలిఫోన్లో మాట్లాడారు. చరిత్రాత్మకమైన, లక్ష్యపూరితమైన, భారత్-న్యూజిలాండ్‌కు పరస్పరం ప్రయోజనాలు అందించే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) విజయవంతంగా పూర్తయిందని నాయకులిద్దరూ సంయుక్తంగా ప్రకటించారు.
2025 మార్చిలో భారత్‌లో ప్రధాని లక్సన్ పర్యటించిన సమయంలో దీనికి సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి లక్ష్యాన్ని, రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే రాజకీయ సంకల్పాన్ని ప్రతిబింబిస్తూ.. రికార్డు స్థాయిలో 9 నెలల్లో ఎఫ్‌టీఏ పూర్తయిందని నాయకులు అంగీకరించారు. ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను ఈ ఎఫ్‌టీయే మరింత బలోపేతం చేస్తుంది. మార్కెట్ అవకాశాలను విస్తరిస్తుంది. పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. అలాగే రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేస్తుంది. రెండు దేశాలకు చెందిన ఆవిష్కర్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, రైతులు, ఎంఎస్ఎంఈలు, విద్యార్థులు, యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తుంది.
ఎఫ్‌టీఏ అందించే బలమైన, నమ్మకమైన పునాదితో వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపవుతుందని, వచ్చే 15 ఏళ్లలో న్యూజిలాండ్ నుంచి భారత్‌కు 20 బిలియన్ల యూఎస్ డాలర్ల పెట్టుబడులు వస్తాయనే విశ్వాసాన్ని నాయకులిద్దరూ వ్యక్తం చేశారు. క్రీడలు, విద్య, ప్రజా సంబంధాలు లాంటి ద్వైపాక్షిక సహకారం ఉన్న ఇతర రంగాల్లో సాధించిన పురోగతిని నాయకులు స్వాగతించారు. అలాగే భారత్-న్యూజిలాండ్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
సంప్రదింపులు కొనసాగించేందుకు వారు అంగీకరించారు.
(रिलीज़ आईडी: 2207373)
आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam