ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్-ఒమన్ వాణిజ్య సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 18 DEC 2025 4:08PM by PIB Hyderabad

వాణిజ్యపరిశ్రమలుపెట్టుబడుల ప్రోత్సాహక మంత్రి గౌరవ ఖైస్ అల్ యూసఫ్ గారికి,

ఉభయ దేశాల ప్రతినిధులకు,

వాణిజ్య సంఘాల నాయకులకు,

మహిళలు, కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ,

 

నమస్కారాలు,

 

ఏడేళ్ల తర్వాత ఒమన్‌ను సందర్శించటం, ఇవాళ మీ అందరినీ కలిసే అవకాశం లభించటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా.

ఈ వాణిజ్య సదస్సుకు స్వాగతం పలికి, నాలోని ఉత్సాహాన్ని మరింత పెంచారుభారత్-ఒమన్ భాగస్వామ్యానికి ఇవాళ్టి ఈ సదస్సు సరికొత్త దిశానిర్దేశం చేయటమే కాకమరింత వేగంగా ఈ సంబంధాలను ఉన్నత శిఖరాలకు చేరుస్తుందిఈ ప్రయత్నంలో మీరంతా కీలక పాత్ర పోషించాలి.

 

మిత్రులారా,

భారత్ఒమన్ దేశాల వ్యాపారద్వైపాక్షిక వాణిజ్యానికి మీరు ప్రతినిధులుశతాబ్దాల నాటి సుసంపన్న వారసత్వానికి వారసులునాగరికత ప్రారంభమైనప్పటి నుంచీ మన పూర్వీకులు నౌకా వాణిజ్యం చేశారు.

 

సముద్రపు రెండు తీరాలు ఒకదానికొకటి దూరంగా ఉంటాయని అంటారుకానీ మాండ్విమస్కట్ మధ్య అరేబియా సముద్రం బలమైన వారధిగా నిలిచిందిఈ వారధి మన సంబంధాలను పటిష్టం చేసిసంస్కృతినిఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిందిఇవాళ మనం ఎంతో నమ్మకంగా చెప్పవచ్చుసముద్రపు అలలురుతువులు మారతాయి కానీభారత్-ఒమన్ మధ్య స్నేహం ప్రతి సీజన్ లోనూ బలపడుతూప్రతీ అలతో నూతన శిఖరాలను చేరుకుంటుంది.

 

మిత్రులారా,

నమ్మకం అనే పునాదిపై ఏర్పాటైన మన బంధం, స్నేహంతో శక్తిమంతమైకాలంతో పాటు మరింత బలపడింది.

మన దౌత్య సంబంధాలకు ఇవాళ 70 ఏళ్లు పూర్తయ్యాయిఇది కేవలం ఏడు దశాబ్దాల వేడుక మాత్రమే కాదు.. శతాబ్దాల నాటి వారసత్వాన్ని సుసంపన్నమైన భవిష్యత్ వైపు తీసుకెళ్లాల్సిన కీలక ఘట్టం.

 

మిత్రులారా,

దశాబ్దాల పాటు గుర్తుండిపోయే ఒక చారిత్రక నిర్ణయాన్ని ఇవాళ మనం తీసుకుంటున్నాం. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం లేదా సీఈపీఏ, 21వ శతాబ్దంలో మన బంధానికి కొత్త విశ్వాసాన్నినూతనోత్తేజాన్ని ఇస్తుందిఇది మన ఉమ్మడి భవిష్యత్తుకు నమూనా వంటిదిఈ ఒప్పందం ద్వారా వాణిజ్యం వేగవంతమవటమే కాకపెట్టుబడుల విషయంలో నమ్మకాన్ని పెంచిప్రతి రంగంలోనూ నూతన అవకాశాలను కల్పిస్తుంది.

అభివృద్ధి, ఆవిష్కరణఉపాధిపరంగా యువతకు ఎన్నో కొత్త అవకాశాలను సీఈపీఏ కల్పిస్తుందిఈ ఒప్పందం కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం కాకుండా ఫలితాలను సాధించాలంటే.. ప్రతి ఒక్కరి సహకారం అత్యంత కీలకంవిధానపరమైన చర్యలుపారిశ్రామిక కృషి కలిసినప్పుడే ఒక భాగస్వామ్యం కొత్త చరిత్రను సృష్టించగలదు.

 

మిత్రులారా,

భారతదేశ ప్రగతి అందరినీ కలుపుకునిపోయే విధంగా ఉంటుంది. భారతదేశ అభివృద్ధిలో మిత్రదేశాలను కూడా భాగస్వాములను చేస్తుందిఇవాళ కూడా మనం అదే చేస్తున్నాం.

 

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఇది యావత్ ప్రపంచానికి ఎన్నో అవకాశాలను కల్పిస్తోందిఒమన్ విషయంలో ఆ ప్రయోజనం ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది.

మనం కేవలం నమ్మకమైన మిత్రులమే కాదు.. సముద్ర తీర సరిహద్దులను పంచుకునే పొరుగు వాళ్లం కూడామన ప్రజల మధ్య సత్సంబంధాలున్నాయిమన వాణిజ్య సంఘాల మధ్య తరతరాలుగా నమ్మకముందిఒకరి మార్కెట్ పై మరొకరికి లోతైన అవగాహన ఉందికాబట్టిభారత్ అభివృద్ధి ప్రయాణం ఒమన్ కు అపారమైన అవకాశాలను అందించగలదు.

మిత్రులారా,

నేటి ప్రపంచ వాణిజ్యంలో భారత ఆర్థిక స్థితిపై విస్తృతంగా చర్చ జరుగుతోందిప్రపంచవ్యాప్తంగా అనిశ్చితిఅంతర్జాతీయ ఆర్థిక సవాళ్లున్నప్పటికీ భారత్ శాతానికి పైగా వృద్ధిని ఎలా సాధించగలిగిందని ప్రజలు తరచూ అడుగుతుంటారుదీనికి గల ప్రధాన కారణాలను నేను మీతో పంచుకుంటాను.

గత పదకొండేళ్లలో భారత్ కేవలం తన విధానాలను మాత్రమే కాదు.. ఆర్థిక డీఎన్ఏనే పూర్తిగా మార్చుకుంది.

 

ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చెబుతాను. వస్తుసేవల పన్ను (జీఎస్టీ).. భారతదేశాన్ని సమగ్రఏకీకృత మార్కెట్ గా మార్చేసిందిదివాలా స్మృతి.. ఆర్థిక క్రమశిక్షణను మెరుగుపరిచిపారదర్శకతను పెంచటమే కాకపెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని బలపరిచిందిమేం చేపట్టిన కార్పొరేట్ పన్ను సంస్కరణ ద్వారా పెట్టుబడులకు ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాల్లో ఒకటిగా భారత్ నిలిచింది.

 

మిత్రులారా,

మేం చేపట్టిన కార్మిక సంస్కరణల గురించి మీకు తెలిసే ఉంటుంది. డజన్ల కొద్దీ ఉన్న కార్మిక చట్టాలను క్రమబద్దీకరించికేవలం నాలుగు భాగాలుగా రూపొందించాంభారతదేశ చరిత్రలో అత్యంత కీలకమైన కార్మిక సంస్కరణల్లో ఇవి ఉన్నాయి.

 

మిత్రులారా,

విధానపరమైన స్పష్టత ఉన్నప్పుడు, తయారీ రంగం ఆత్మవిశ్వాసాన్ని పొందుతుందిఒకవైపు విధానపరమైనప్రక్రియపరమైన సంస్కరణలను అమలు చేస్తూనేమరోవైపు భారత్ లో తయారీని ప్రోత్సహించేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను మేం అందిస్తున్నాంఇలాంటి నిరంతర ప్రయత్నాల వల్ల 'మేక్ ఇన్ ఇండియాకార్యక్రమంపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.

 

మిత్రులారా,

ఈ సంస్కరణలు భారతదేశంలో డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేశాయిదీనివల్ల కాగిత రహిత ప్రభుత్వ పాలననగదు రహిత ఆర్థిక వ్యవస్థమొత్తం వ్యవస్థ సమర్థవంతంగాపారదర్శకంగాస్థిరంగా మారింది.

 

డిజిటల్ ఇండియా కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదుప్రపంచంలోనే అతి పెద్ద 'సమ్మిళిత విప్లవం'. ఇది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచటమే కాకవ్యాపార నిర్వహణను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిందిదేశంలో అభివృద్ధి చెందుతున్న ఆధునిక మౌలిక సదుపాయాలు దీనికి మరింత ఊతమిచ్చాయిమెరుగవుతున్న రవాణా వ్యవస్థ వల్ల దేశంలో లాజిస్టిక్స్ క్రమంగా వ్యయం తగ్గుతోంది.

 

మిత్రులారా,

పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానం భారత్ అని ప్రపంచం గుర్తించిందిభారత్ ఒక నమ్మకమైనరాబోయే సవాళ్లను ఎదుర్కోగల భాగస్వామి అని ఒమన్ కు బాగా తెలుసుఆ విషయాన్ని వారు ఎంతగానో గౌరవిస్తారు.

 

ఎన్నో ఏళ్లుగా రెండు దేశాల మధ్య పెట్టుబడులను సంయుక్త పెట్టుబడి నిధి ప్రోత్సహిస్తోందిఇంధనంఆయిల్గ్యాస్ఎరువులుఆరోగ్యంపెట్రో కెమికల్స్గ్రీన్ ఎనర్జీ వంటి ఏ రంగంలోనైనా కొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయి.

 

కానీ మిత్రులారాభారత్ఒమన్ కేవలం దీనికే పరిమితం కావాలని అనుకోవటం లేదుసౌకర్యవంతమైన పరిధులకే మనం పరిమితం కాకూడదుభారత్-ఒమన్ భాగస్వామ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలిఇందుకోసంఇరుదేశాల వాణిజ్య వర్గాలు ప్రతిష్ఠాత్మకమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి.

 

కొన్ని సవాళ్ల వివరణ ద్వారా మీ పనిని కాస్త సులభతరం చేస్తానుగ్రీన్ ఎనర్జీ రంగంలో మనం ఏదైనా ప్రగతిని సాధించగలమారాబోయే ఐదేళ్లలో అయిదు భారీ గ్రీన్ ప్రాజెక్టులను ప్రారంభించగలమాగ్రీన్ హైడ్రోజన్గ్రీన్ అమ్మోనియాసోలార్ పార్కులుఎనర్జీస్మార్ట్ గ్రిడ్ల రంగాల్లో మనం సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుదాం.

 

మిత్రులారా,

ఇంధన భద్రత ఎంత కీలకమో, ఆహార భద్రత కూడా అంతే ముఖ్యంభవిష్యత్తులో ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రధాన సవాలుగా మారనుందిభారత్-ఒమన్ కలిసి అగ్రి ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయగలమాఈ కార్యక్రమం ద్వారా ఒమన్ లో ఆహార భద్రతను బలోపేతం చేయటమే కాకభారతదేశ అగ్రి-టెక్ పరిష్కారాలు ప్రపంచ మార్కెట్లకు చేరువయ్యేందుకు సహాయపడుతుంది.

 

మిత్రులారా,

 

వ్యవసాయం రంగం కేవలం ఒక అంశం మాత్రమే. అన్ని రంగాల్లోనూ ఆవిష్కరణలను ప్రోత్సహించాలిఒమన్-ఇండియా ఇన్నోవేషన్ బ్రిడ్జిని మనం నిర్మించగలమారాబోయే రెండేళ్లలో భారత్ లోని 200 అంకుర సంస్థలను ఒమన్ తో అనుసంధానించటమే మన లక్ష్యం.

 

ఉమ్మడి ఇంక్యుబేటర్లు, ఫిన్‌టెక్ శాండ్ బాక్సులుఏఐసైబర్ సెక్యూరిటీ ల్యాబ్‌లను మనం ఏర్పాటు చేయాలిసీమాంతర పెట్టుబడులను ప్రోత్సహించాలి.

 

మిత్రులారా,

 

ఇవి కేవలం నా ఆలోచనలు మాత్రమే కాదు.. ఆహ్వానాలు:

 

పెట్టుబడులకు ఆహ్వానం.

 

ఆవిష్కరణలకు ఆహ్వానం.

 

కలిసి భవిష్యత్తును నిర్మించేందుకు ఆహ్వానం.

 

సరికొత్త సాంకేతికత, నూతన శక్తిసరికొత్త కలలతో ఈ చిరకాల మైత్రిని కొనసాగిద్దాం.

ధన్యవాదాలు!

గమనిక: ప్రధానమంత్రి హిందీలో ఇచ్చిన ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం.

 

***


(रिलीज़ आईडी: 2206631) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Urdu , Marathi , Manipuri , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam , Malayalam