హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఒమన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఫస్ట్ క్లాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఒమన్’ అందుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు తెలిపిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్‌ షా


ఈ గౌరవం ప్రధాని మోదీ రాజనీతిజ్ఞతకు, ప్రపంచ నాయకుడిగా ఆయనకు ఉన్న ఆదరణకు దక్కిన గొప్ప గుర్తింపుగా అభివర్ణించిన శ్రీ అమిత్ షా

ప్రధాని మోదీ గారికి వరుసగా లభిస్తున్న ఈ అంతర్జాతీయ గౌరవాలు 140 కోట్ల మంది భారతీయుల శక్తికి,, ఆయన నాయకత్వంలో భారత్ ఒక కొత్త, శక్తిమంతమైన దేశంగా అవతరించిందన్న దానికి నిదర్శనం

నాడు పోస్టు చేయడమైనది: 18 DEC 2025 5:56PM by PIB Hyderabad

ఒమన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఫస్ట్ క్లాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఒమన్’ అందుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్‌ షా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

‘ఎక్స్’లో చేసిన ఒక పోస్ట్‌లో శ్రీ అమిత్ షా గారు ఇలా అన్నారు. ‘‘ఒమన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఫస్ట్ క్లాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఒమన్’ను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి ఇవ్వడం ఆయన రాజనీతిజ్ఞతకు, ప్రపంచ నాయకుడిగా ఆయనకున్న ఆదరణకు దక్కిన గొప్ప గుర్తింపు. ప్రధానమంత్రి శ్రీ మోదీకి వరుసగా లభిస్తున్న ఈ గౌరవాలు.. 140 కోట్ల మంది భారతీయుల శక్తిని ప్రతిబింబిస్తూ, ఆయన నాయకత్వంలో భారత్ ఒక శక్తిమంతమైన దేశంగా ఎదుగుతున్న తీరుకు నిదర్శనం’’

 

***


(రిలీజ్ ఐడి: 2206329) సందర్శకుల సూచీ సంఖ్య : : 30
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Gujarati , Kannada , Malayalam