ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సబ్‌కా బీమా సబ్‌కీ రక్షా (బీమా చట్టాల సవరణ) బిల్లు- 2025కు పార్లమెంటు ఆమోదం.. బీమా కంపెనీలలో 100% వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతి


· బీమా కవరేజీని మరింతగా పెంచడం, సులభతర వాణిజ్యాన్ని అందించడం, నియంత్రణా పర్యవేక్షణ, పాలనను మెరుగుపరచడానికే ఈ బిల్లు

· మూలధన పెంపు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, బీమా రంగంలో ప్రపంచంలో అత్యుత్తమ పద్ధతుల వినియోగం

· ప్రజలకు ఉత్పత్తులు, సేవల్లో సమర్థతను పెంచేలా పోటీలో పెరుగుదల

· విదేశీ పునః బీమా శాఖల నికర యాజమాన్య నిధుల అవసరం 5,000 కోట్ల నుంచి 1,000 కోట్లకు తగ్గింపు

· పాలసీదారుల్లో బీమాపై అవగాహన కల్పించేలా పాలసీదారుల విద్య, రక్షణ నిధి

प्रविष्टि तिथि: 18 DEC 2025 5:15PM by PIB Hyderabad

సబ్‌కా బీమా సబ్‌కీ రక్షా (బీమా చట్టాల సవరణ) బిల్లు- 2025ను 2025 డిసెంబరు 17న పార్లమెంటు ఆమోదించింది. బీమా రంగానికి సంబంధించిన మూడు చట్టాలను ఈ బిల్లు సవరించింది. అవి: ఇన్సూరెన్సు చట్టం- 1938, జీవిత బీమా కార్పొరేషన్ చట్టం- 1956, బీమా నియంత్రణ, అభివృద్ధి అథారిటీ చట్టం- 1999.

ఈ బిల్లులోని ముఖ్య లక్షణాలలో ఒకటి.. బీమా కంపెనీలలో 100 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం, తద్వారా దేశంలోకి మరిన్ని విదేశీ సంస్థలకు మార్గం సుగమం చేయడం. మూలధనాన్ని పెంచడంలో, అధునాతన సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో, ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ పద్ధతులను స్వీకరించడంలో ఇది దోహదపడుతుంది. పెరిగిన పోటీ ఉత్పత్తులు, సేవల్లో సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఒకేసారి లైసెన్స్ పొందే సదుపాయాన్ని ప్రవేశపెట్టడం ద్వారా, లైసెన్సును వెంటనే రద్దు చేయకుండా సస్పెండ్ చేసే నిబంధన ద్వారా.. మధ్యవర్తుల కోసం సులభతర వాణిజ్యాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. బీమా కంపెనీల విషయంలో, షేర్ మూలధన బదిలీ కోసం ముందస్తు నియంత్రణ పరమైన అనుమతి కోరాల్సిన పరిమితిని 1శాతం నుంచి 5 శాతానికి పెంచారు. విదేశీ పునః బీమా శాఖల నికర యాజమాన్య నిధుల అవసరాన్ని రూ. 5,000 కోట్ల నుంచి రూ. 1,000 కోట్లకు తగ్గించారు. దేశంలో జోనల్ కార్యాలయాలను తెరవడానికి, తన విదేశీ కార్యాలయాలను సంబంధిత అధికార పరిధిలోని చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా నడిపించడానికి ఎల్ఐసీకి స్వయం ప్రతిపత్తి కల్పించారు.

పాలసీదారుల ప్రయోజనాలను పరిరక్షించడం, బీమాపై అవగాహన కల్పించడం కోసం పాలసీదారుల విద్య, పరిరక్షణ నిధి అనే ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు పాలసీదారుల డేటాను డీపీడీపీ చట్టం- 2023కు అనుగుణంగా సేకరించి, రక్షించాల్సి ఉంటుంది.

నిబంధనల రూపకల్పన కోసం ఒక ప్రామాణిక నిర్వహణ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా, ఆ ప్రక్రియలో అందరి సంప్రదింపులను తప్పనిసరి చేయడం ద్వారా నియంత్రణ పాలనను మరింత బలోపేతం చేస్తున్నారు. బీమా కంపెనీలు, మధ్యవర్తులు అక్రమంగా పొందిన లాభాలను తిరిగి రాబట్టే అధికారాన్ని ఐఆర్‌డీఏఐకి ఇస్తున్నారు. జరిమానాలను హేతుబద్ధీకరిస్తున్నారు. అలాగే జరిమానాలను ఏ ప్రాతిపదికన విధించాలో తెలిపే అంశాలను ప్రవేశపెడుతున్నారు.

ప్రజలు, గృహాలు, సంస్థలకు బీమా కవరేజీని విస్తరించడం, బీమా కవరేజీని మరింత పెంచడం, సులభతర వాణిజ్యాన్ని అందించడం, నియంత్రణ పర్యవేక్షణను, పాలనను మెరుగుపరచడం ఈ సంస్కరణల లక్ష్యం. ఈ చర్యలు భారతీయ బీమా రంగాన్ని మరింత పటిష్టం చేస్తాయి, తద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన ఆర్థిక రక్షణను అందిస్తాయి.

 

***


(रिलीज़ आईडी: 2206328) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Khasi , English , Urdu , हिन्दी , Assamese , Punjabi , Gujarati , Odia , Malayalam