హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్‌-ఒమన్ సీఈపీఏను ప్రశంసించిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా.. రైతులు, చేతివృత్తులవారు, మహిళలు, ఎంఎస్‌ఎంఈల సంక్షేమం కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన దౌత్యానికి లభించిన విజయం


ఒమన్ సుంకాల జాబితాలోని 98.08శాతం వస్తువులపై పన్ను రహిత ప్రవేశాన్ని అందిస్తూ.. కీలక మైలురాయిగా నిలవనున్న భారత్‌-ఒమన్ సీఈపీఏ ఒప్పందం. దీని ద్వారా భారత్‌ నుంచి వెళ్లే 99.38 శాతం ఎగుమతులకు లబ్ధి

కష్టపడే ప్రజలు, పరిశ్రమలకు ఈ ఒప్పందం సరికొత్త అవకాశాలను కల్పిస్తుంది. శ్రీ ప్రధాని మోదీ నాయకత్వంలో మన వాణిజ్య దౌత్యం లో వచ్చిన మార్పునకు ఈ ఒప్పందం నిదర్శనం. ప్రపంచ స్థాయి చర్చల్లో ప్రజల ప్రయోజనాలే కేంద్ర బిందువు

प्रविष्टि तिथि: 18 DEC 2025 6:59PM by PIB Hyderabad

భారత్-ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని(సీఈపీఏ) కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రశంసించారు. ఇది రైతులు, చేతివృత్తుల వారు, మహిళలు, ఎంఎస్‌ఎంఈల శ్రేయస్సు కోసం శ్రీ మోదీ చేపట్టిన దౌత్యానికి లభించిన  విజయమని కొనియాడారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టులో..‘‘ భారత్-ఒమన్ సీఈపీఏ ఒప్పందం ఒక చారిత్రక మైలురాయి. ఇది ఒమన్  సుంకాల జాబితాలోని 98.08శాతం వస్తువులపై పన్ను రహిత ప్రవేశాన్ని అందిస్తుంది. దీనివల్ల భారత్‌ నుంచిఒమన్‌కు వెళ్లే 99.38 శాతం ఎగుమతులకు లబ్ధి చేకూరుతుంది. కష్టపడే ప్రజలు, పరిశ్రమలకు సరికొత్త అవకాశాన్ని కల్పిస్తూ.. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో మన వాణిజ్య దౌత్యం లో వచ్చిన మార్పునకు ఈ ఒప్పందం నిదర్శనం. అంతర్జాతీయ చర్చల్లో ప్రజా ప్రయోజనాలే ఇప్పుడు కేంద్రబిందువుగా ఉన్నాయని ఇది నిరూపిస్తుంది.’’

 

***


(रिलीज़ आईडी: 2206326) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Gujarati , Kannada , Malayalam