సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా 591 బ్రాడ్‌కాస్టింగ్ స్టేషన్లను నిర్వహిస్తూ.. ప్రసార పరిధిని విస్తరిస్తున్న ఆకాశవాణి
प्रविष्टि तिथि:
18 DEC 2025 12:50PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా 591 ప్రసార కేంద్రాల ద్వారా ఆకాశవాణి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వీటిలో 230 స్టేషన్లలో సొంతంగా కార్యక్రమాల రూపకల్పనకు, ప్రసారాల కోసం స్టూడియో సౌకర్యం ఉంది.
ఎక్కువ మందికి చేరువ అయ్యేందుకు గాను మిగిలిన 361 స్టేషన్లలో ఇతర ఆకాశవాణి కేంద్రాల కార్యక్రమాలను ప్రసారం చేస్తారు. రాష్ట్రాల వారీగా ప్రసార కేంద్రాల వివరాలు https://prasarbharati.gov.in వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయి. భిల్వారాలోని 100 వాట్ల ఎఫ్ఎం రిలే స్టేషన్ (28.04.2023న ప్రారంభమైంది) వివిధ భారతి కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది.
కార్యక్రమాలను రూపొందించడానికి, ప్రసారం చేయడానికి ఆకాశవాణి ఉదయ్‌పూర్‌లో స్టూడియో సౌకర్యం ఉంది. వివిధ భారతి సర్వీస్ (ఎఫ్ఎం)పై స్థానిక పరిధిలో కార్యక్రమాలను రూపొందించి, ప్రసారం చేస్తుంది.
ఇతర ఆకాశవాణి కేంద్రాలు రూపొందించిన కార్యక్రమాలను పునఃప్రసారం చేయాలనే లక్ష్యంతో ఆకాశవాణి భిల్వారాతో సహా దేశవ్యాప్తంగా ప్రసారభారతి రిలే స్టేషన్లు ఏర్పాటయ్యాయి.
ఇవి సాంకేతిక, మావన వనరులను సమర్థంగా ఉపయోగించుకొని, కార్యక్రమ నాణ్యతను కొనసాగిస్తూనే ఎక్కువ మందికి ప్రసారాలు చేరుకొనేలా చేస్తాయి.
లోక్‌సభలో 17-12-25న సమాచార, ప్రసార శాఖ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఈ సమాచారాన్ని అందించారు.
***
(रिलीज़ आईडी: 2206109)
आगंतुक पटल : 6