ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్‌-జోర్డాన్‌ బిజినెస్‌ ఫోరంలో ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 16 DEC 2025 3:04PM by PIB Hyderabad

మాననీయ రాజు అబ్దుల్లా గారు...

కాలుష్య రహిత వృద్ధి లేనిదే నేటి ప్రపంచం ముందడుగు వేయడం సాధ్యం కాదు. అందువల్ల కాలుష్య రహిత ఇంధనం ఇక ఎంతమాత్రం ఐచ్ఛికం కాదు... అదొక అవసరంగా మారిపోయింది. ఆ మేరకు భారత్‌ ఇప్పటికే సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్ సహా ఇంధన నిల్వలో పెట్టుబడిదారుగా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రంగంలో జోర్డాన్‌కు అపార సామర్థ్యం ఉంది కాబట్టి, దాన్ని రెండు దేశాలూ సంయుక్తంగా మరింత సద్వినియోగం చేసుకోవచ్చు.

అదేవిధంగా ఆటోమొబైల్, రవాణా రంగాల రీత్యా కూడా జోర్డాన్‌కు అపార సామర్థ్యం ఉంది. నేడు చౌక విద్యుత్‌ వాహనాలు, ద్విచక్ర వాహనాలు, సీఎన్‌జీ రవాణా అంశాల్లో భారత్‌ ప్రపంచంలోని అగ్ర దేశాలలో ఒకటిగా ఉంది. అందువల్ల ఈ రంగంలోనూ సహకార విస్తృతికి మనం కృషి చేయవచ్చు.

మిత్రులారా!

భారత్‌, జోర్డాన్ రెండింటికీ తమ సంస్కృతి, వారసత్వంపై ఎనలేని గౌరవం ఉంది. కాబట్టి, మన దేశాల మధ్య వారసత్వ-సాంస్కృతిక పర్యాటక వృద్ధికి అవకాశాలు అపారం. రెండు దేశాల నుంచి పెట్టుబడిదారులు ఈ అవకాశాలను చురుగ్గా ఉపయోగించుకోగలరని నేను విశ్వసిస్తున్నాను.

భారత్‌లో ఏటా పెద్ద సంఖ్యలో సినిమాలు నిర్మిస్తుంటారు. జోర్డాన్‌లో వీటి చిత్రీకరణతోపాటు వాటికి అవసరమైన ప్రోత్సాహం ద్వారా ఉమ్మడిగా చలనచిత్రోత్సవాల నిర్వహణకు అవకాశాలను కూడా  సృష్టించవచ్చు. ఇక భారత్‌లో నిర్వహించే ‘వేవ్స్‌’ సమ్మిట్‌లో జోర్డాన్ నుంచి పెద్ద ప్రతినిధి బృందం రాకకోసం కూడా మేం ఎదురుచూస్తున్నాం.

మిత్రులారా!

భూగోళశాస్త్రం జోర్డాన్ బలం... ఇక భారత్‌లో నైపుణ్యం, స్థాయి రెండూ లభ్యమవుతాయి. ఈ బలాలు కలిస్తే రెండు దేశాల యువతకూ కొత్త అవకాశాలు అందివస్తాయి.

మన రెండు ప్రభుత్వాల దార్శనికత పూర్తి స్పష్టంగా ఉంది. కాబట్టి, మీ అందరి మేధస్సు, ఆవిష్కరణ,  వ్యవస్థాపన ద్వారా దీన్ని వాస్తవంగా మార్చడం వాణిజ్య సమాజ భాగస్వాములుగా మీ అందరి బాధ్యత.

చివరగా... నేను మరోసారి పిలుపు ఇద్దామనుకుంటున్నాను:

రండి...

కలసి పెట్టుబడులు పెడదాం...

కలసి ఆవిష్కరణలకు కృషి చేద్దాం..

కలసికట్టుగా ఎదుగుదాం...

మాననీయ రాజు గారూ,

మీకు, జోర్డాన్ ప్రభుత్వానికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయ ప్రముఖులందరికీ మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

షూక్రాన్...

అనేకానేక ధన్యవాదాలు...

గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి స్వేచ్ఛానువాదం మాత్రమే.

 

***


(रिलीज़ आईडी: 2204918) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam