ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జోర్డాన్ రాజు గౌరవ అబ్దుల్లా-II గారితో ప్రధానమంత్రి భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 15 DEC 2025 10:58PM by PIB Hyderabad

జోర్డాన్ రాజు అబ్దుల్లా IIగారితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సమావేశమయ్యారుఅల్ హూస్సేనియా ప్యాలెస్‌కు చేరుకున్న మోదీకి అబ్దుల్లా II రాజుగారు లాంఛనప్రాయంగా స్వాగతం పలికారు.

నాయకులిద్దరూ ప్రత్యేకంగా సమావేశమైప్రతినిధి బృంద స్థాయిలో చర్చలు నిర్వహించారుగత సమావేశాలుసంభాషణలను గుర్తుచేసుకున్నారుఇరుదేశాల మధ్య ఉన్న హృదయపూర్వకచారిత్రక అనుబంధాన్ని స్పష్టం చేశారురెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన జరుగుతుండటం చరిత్రాత్మకమని నేతలు పేర్కొన్నారుభారత్-జోర్డాన్ మధ్య సంబంధాల బలోపేతానికి రాజుగారు చేస్తున్న కృషినిఅంకితభావాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారుఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి బలంగా మద్దతిస్తామని తెలిపిన రాజుగారు...అన్ని రూపాల్లో ఉండే ఉగ్రవాదాన్ని ఖండించారుఉగ్రవాదంతీవ్రవాదంతీవ్రవాద భావజాలాన్ని ఎదుర్కోవటంలోఈ దుష్టశక్తులకు వ్యతిరేకంగా ప్రపంచ పోరాటానికి సహకరించటంలో రాజుగారి నాయకత్వాన్ని ప్రధానమంత్రి అభినందించారువాణిజ్యంపెట్టుబడిరక్షణభద్రతపునరుత్పాదక శక్తిఎరువులువ్యవసాయంఆవిష్కరణఐటీడిజిటల్ సాంకేతికతప్రధాన ఖనిజాలుమౌలిక సదుపాయాలుఆరోగ్యంఫార్మావిద్యాసామర్థ్యంపర్యాటకంవారసత్వంసాంస్కృతికప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారాన్ని మరింత బలపరచటంపై ఇరు దేశాల నేతలు చర్చించారుజోర్డాన్ దేశానికి భారత్ మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం వచ్చే అయిదేళ్లలో అమెరికన్ బిలియన్ డాలర్లకు చేరేలా లక్ష్యం పెట్టుకోవాలని ప్రధానమంత్రి సూచించారుభారత్ లోని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ)తో జోర్డాన్ డిజిటల్ పేమెంట్ వ్యవస్థను అనుసంధానించాలని ఆయన సూచించారుజోర్డాన్... భారతదేశానికి ఎరువుల్ని ఎగుమతి చేస్తోందిభారత్‌లో పెరుగుతున్న ఫాస్ఫాటిక్ ఎరువుల డిమాండ్‌కు తగ్గట్టుగా జోర్డాన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇరు దేశాల్లోని ఎరువుల కంపెనీలు సంప్రదింపులు నిర్వహిస్తున్నాయి.

ప్రాంతీయ పరిణామాలుఇతర ప్రపంచ సమస్యలపై నేతలిద్దరూ అభిప్రాయాలను పంచుకున్నారుశాంతిస్థిరత్వం పునరుద్ధరణ ప్రాముఖ్యతను స్పష్టం చేశారుశాశ్వత శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ మద్దతిస్తుందని ప్రధానమంత్రి తెలిపారు.

ఈ పర్యటన సందర్భంగా సంస్కృతిపునరుత్పాదక శక్తినీటి నిర్వహణడిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలుపెట్రాఎల్లోరా మధ్య రెండు అవగాహనా ఒప్పందాలను ఇరుపక్షాలు ఖరారు చేశాయిభారత్-జోర్డాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలనుస్నేహాన్ని ఈ ఒప్పందాలు మరింత ప్రోత్సహిస్తాయిఈ చర్చల అనంతరం రాజు అబ్దుల్లా II గారు ప్రధానమంత్రి గౌరవార్థం విందు ఏర్పాటు చేశారుభారత్‌ను సందర్శించాల్సిందిగా రాజుగారిని ప్రధానమంత్రి ఆహ్వానించగాఆయన అంగీకరించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2204518) సందర్శకుల సూచీ సంఖ్య : : 25