ప్రధాన మంత్రి కార్యాలయం
ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 75వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నివాళి
प्रविष्टि तिथि:
15 DEC 2025 8:44AM by PIB Hyderabad
ఈ రోజు భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 75వ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. దేశం మొత్తాన్ని ఏకం చేయడానికి, ఐక్యత అనే దారంతో భారత్‌ను కట్టి ఉంచడానికి సర్దార్ పటేల్ తన జీవితాన్ని అంకితం చేశారన్నారు.
ఏకీకృతమైన, బలమైన భారత్‌ను రూపొందించడానికి సర్దార్ పటేల్ అందించిన అసమానమైన సహకారం.. దేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని శ్రీ మోదీ తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ పోస్టు:
‘‘ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 75వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను. దేశాన్ని ఏకం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. అఖండమైన, బలమైన భారత్‌ను నిర్మించడంలో ఆయన చేసిన సాటిలేని కృషిని ఈ దేశం ఎన్నటికీ మరచిపోదు.’’
***
(रिलीज़ आईडी: 2204186)
आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam