ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తిరు రజనీకాంత్ గారి 75వ పుట్టినరోజు ప్రత్యేక సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 12 DEC 2025 8:59AM by PIB Hyderabad

ఈ రోజు తిరు రజనీకాంత్ గారి 75వ పుట్టినరోజు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
రజనీకాంత్ గారి నటన భిన్న తరాల ప్రేక్షకులను ఆకట్టుకుందనీ, ఆయనకు సర్వత్ర ప్రశంసలు లభించాయనీ ప్రధానమంత్రి అన్నారు. వేర్వేరు పాత్రలు, శైలులు, సినిమా తరహా స్టైళ్లు.. ఇవన్నీ రజనీ సినిమాల్లో మనం గమనించవచ్చని, ఆయన సినిమాలు భారత చలనచిత్ర రంగంలో నిరంతరం కొత్త ప్రమాణాలను నెలకొల్పాయని ప్రధానమంత్రి అన్నారు.
ఈ ఏడాది తిరు రజనీకాంత్ చలనచిత్ర సీమలో 50 ప్రఖ్యాత సంవత్సరాలు పూర్తి చేసుకోవడం కూడా ఒక విశేష ప్రాముఖ్యత కలిగిన అంశం. ఇది ఆయన ప్రగతి ప్రస్థానాన్నీ, చిత్ర పరిశ్రమపై ప్రసరిస్తున్న చిరకాల ప్రభావాన్నీ, అందిస్తున్న సాటిలేని సేవనూ సూచిస్తోందన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వేర్వేరు సందేశాల్లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
‘‘తిరు రజనీకాంత్ గారికి ఆయన 75వ పుట్టినరోజు ప్రత్యేక సందర్భంగా ఇవే శుభాకాంక్షలు. ఆయన నటన విభిన్న తరాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. సర్వత్ర గొప్ప ప్రశంసలను పొందింది. ఆయన వృత్తి జీవనంలో రక రకాల భూమికలను, శైలులను ఆవిష్కరించి నిరంతరం అనేక ప్రమాణాలను నెలకొల్పుతున్నారు. ఈ సంవత్సరం మరో విశేషం కూడా ఉంది.. చలనచిత్ర జగతిలో ఆయన 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయనకు ఆరోగ్యవంతమైన జీవనం లభించాలనీ, దీర్ఘాయుష్షు కలగాలనీ ప్రార్థిస్తున్నాను.’’


(रिलीज़ आईडी: 2202830) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Gujarati , Odia , Kannada